AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శరీరం హైడ్రేట్‌గా ఉందా లేదా నీటి లోపం ఉందా! నిపుణులు చెప్పిన సలహా ఏమిటంటే

మూత్రం రంగును బట్టి శరీరంలో నీటి కొరతను తేలికగా గుర్తించవచ్చని ఢిల్లీలోని సీనియర్ వైద్యుడు డాక్టర్ అజయ్ కుమార్ చెబుతున్నారు. మూత్రం రంగు స్పష్టంగా.. తెల్లగా ఉంటే శరీరంలో నీటి కొరత ఉండదు. మూత్రం రంగు లేత పసుపు రంగులో ఉన్నా చింతించాల్సిన పని లేదు. అయితే మూత్రం ముదురు పసుపు రంగులోకి మారితే అది శరీరంలో నీరు తక్కువ అయింది అనే విషయాన్ని సూచిస్తుంది. ఈ పరిస్థితిలో వెంటనే నీరు త్రాగాలి. నీళ్లు తగలేకపోయినా కొబ్బరినీళ్లు, మజ్జిగ కూడా తాగవచ్చు.

శరీరం హైడ్రేట్‌గా ఉందా లేదా నీటి లోపం ఉందా! నిపుణులు చెప్పిన సలహా ఏమిటంటే
Dehydration Symptoms
Surya Kala
|

Updated on: Jun 04, 2024 | 12:26 PM

Share

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విపరీతమైన వేడి, వడగాల్పుల ప్రభావం కనిపిస్తోంది. అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటింది. విపరీతమైన వేడి కారణంగా.. చాలా మంది శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. అయితే చాలా సందర్భాలలో ప్రజలకు తమ శరీరంలో నీటి కొరత ఏర్పడింది అనే విషయం తెలియదు. అయితే ఎక్కువ సమయం శరీరం నీటి కొరత ఉంటె.. అది అనేక శారీరక సమస్యలను కలిగిస్తుంది. హీట్ స్ట్రోక్‌కి కూడా కారణం కావచ్చు. అటువంటి పరిస్థితిలో శరీరంలో నీటి కొరత ఏర్పడింది అనే విషయం తెలుసుకోవడం ముఖ్యం. ఈ విషయంపై నిపుణులు చెప్పిన సూచనల గురించి ఈ రోజు తెలుసుకుందాం..

మూత్రం రంగును బట్టి శరీరంలో నీటి కొరతను తేలికగా గుర్తించవచ్చని ఢిల్లీలోని సీనియర్ వైద్యుడు డాక్టర్ అజయ్ కుమార్ చెబుతున్నారు. మూత్రం రంగు స్పష్టంగా.. తెల్లగా ఉంటే శరీరంలో నీటి కొరత ఉండదు. మూత్రం రంగు లేత పసుపు రంగులో ఉన్నా చింతించాల్సిన పని లేదు. అయితే మూత్రం ముదురు పసుపు రంగులోకి మారితే అది శరీరంలో నీరు తక్కువ అయింది అనే విషయాన్ని సూచిస్తుంది. ఈ పరిస్థితిలో వెంటనే నీరు త్రాగాలి. నీళ్లు తగలేకపోయినా కొబ్బరినీళ్లు, మజ్జిగ కూడా తాగవచ్చు.

ఒక వ్యక్తి ఎంత నీరు త్రాగాలంటే తాగునీటి విషయంలో ప్రజల మనసులో సందిగ్ధత నెలకొంది. ఎంత నీరు త్రాగాలి, ఎప్పుడు త్రాగాలి, భోజనానికి ముందు లేదా తరువాత త్రాగాలి అనే ప్రశ్నలతో గందరగోళానికి గురవుతూ ఉంటారు. ఈ నేపధ్యంలో డాక్టర్ అజయ్ కుమార్ చెప్పిన విషయాలను గురించి తెలుసుకుందాం. ఒక వ్యక్తి సాధారణ శరీర బరువుకి తగినట్లు 35 మి.లీ నీరు త్రాగాలని డాక్టర్ కుమార్ చెప్పారు. ఉదాహరణకు శరీరం బరువు 60 కిలోలు ఉంటే, సుమారు 2100 ml నీరు తీసుకోవాలి. జీవనశైలిని బట్టి ఈ మొత్తం కొంచెం ఎక్కువ లేదా తక్కువగా ఉండవచ్చు. ఎక్కువ సమయం వ్యాయామం చేసినా, చెమట అధికంగా పాయినా ఎక్కువ మొత్తంలో నీరు త్రాగాలి.

ఇవి కూడా చదవండి

తిన్న తర్వాత లేదా ముందు? ఆహారం తినడం గురించి మాట్లాడుతూ, ఆహారం తినే ముందు కొంత నీరు, ఆహారం తిన్న తర్వాత కూడా నీరు త్రాగాలి. అయితే ఎవరైనా కిడ్నీ సమస్యతో ఇబ్బంది పడుతుంటే బాధితుడు వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే నీటిని తీసుకోవాలి. ఏ విధంగానైనా నీరు త్రాగవచ్చు, కూర్చొని లేదా నిలబడి. దీని వల్ల ఎలాంటి హాని జరగదు.

నీటి కొరతను ఎలా అధిగమించాలి?

వేడిని నివారించడానికి, రోజంతా పుష్కలంగా నీరు త్రాగాలి.

వేడి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి, ORS పొడిని నీటిలో కలిపి త్రాగాలి.

క్రమం తప్పకుండా మూత్రాన్ని తనిఖీ చేస్తూ ఉండాలి

పండ్లు కూడా తప్పకుండా తినాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..