AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: మామిడి పండ్లను ఇష్టంగా తెగ లాగించేస్తున్నారా.? అయితే ఇది మీకోసమే.!

పండ్లలో రారాజు మామిడి పండు. దీని రుచికి సాటి మరోటి ఉండదంటే అతిశయోక్తి కాదు. మామిడిపండ్లను చూస్తేనే నోరూరుతుంది అందరికీ? దీనిని ఇష్టపడనివారుండరు. రుచిలోనే కాదు ఇవి ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తాయి. అయితే వీటిని తినడానికి ఓ పద్ధతి ఉంటుంది. మరి మీరు మామిడిపళ్లను..

Health Tips: మామిడి పండ్లను ఇష్టంగా తెగ లాగించేస్తున్నారా.? అయితే ఇది మీకోసమే.!
Mangoes
Ravi Kiran
|

Updated on: Jun 03, 2024 | 9:53 PM

Share

పండ్లలో రారాజు మామిడి పండు. దీని రుచికి సాటి మరోటి ఉండదంటే అతిశయోక్తి కాదు. మామిడిపండ్లను చూస్తేనే నోరూరుతుంది అందరికీ? దీనిని ఇష్టపడనివారుండరు. రుచిలోనే కాదు ఇవి ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తాయి. అయితే వీటిని తినడానికి ఓ పద్ధతి ఉంటుంది. మరి మీరు మామిడిపళ్లను సరైన పద్ధతిలోనే తింటున్నారా? ఒక్కసారి ఆలోచించండి. పండును తినడానికి పద్ధతేంటండి బాబు… అనుకుంటున్నారా? అవును.. మామిడిపండ్ల మీద ఒకరకం ఫైటిక్‌ ఆమ్లం ఉంటుంది. ఇది చర్మానికి తగిలితే అలర్జీ తలెత్తొచ్చు. దురద పుట్టొచ్చు. అందువల్ల మామిడికాయలనైనా, పండ్లనైనా శుభ్రంగా కడగటం చాలా ముఖ్యం. తొడిమ వద్ద అంటుకొనే సొన పూర్తిగా పోయేలా శుభ్రం చేయాలి. ఇందుకోసం మామిడిపండ్లను నీటిలో కనీసం అరగంట సేపు నానబెట్టి, కడగటం మంచిది. దీంతో అధికంగా ఉన్న ఫైటిక్‌ ఆమ్లం తొలగిపోతుంది.

ఆయుర్వేదం ప్రకారం- భోజనంతో పాటు పండ్లను తినకూడదు. కానీ, మామిడిపండ్లు దీనికి మినహాయింపు. వీటిని పాలతో కలిపి తీసుకుంటే మంచి బలవర్ధకంగా పనిచేస్తుంది. అంతేకాదు.. శృంగారం మీద ఆసక్తినీ పెంచుతుంది. పిత్త, వాత దోషాలను తగ్గిస్తుంది. అయితే జీర్ణ సమస్యలు.. రుమటాయిడ్‌ ఆర్థ్రయిటిస్‌, సొరియాసిస్‌, ల్యూపస్‌ వంటి ఆటోఇమ్యూన్‌ జబ్బులు.. చర్మ సమస్యలు గలవారు మామిడిపండ్లను పాలతో కలిపి తీసుకోకూడదు.

ఇక మామిడిలో యాంటీఆక్సిడెంట్ల గుణాలతో కూడిన గ్యాలటానిన్లు, మ్యాంగిఫెరిన్‌ వంటి వృక్ష రసాయనాలు దండిగా ఉంటాయి. ఇవి విశృంఖల కణాల దుష్ప్రభావాలను అడ్డుకుంటున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే తొక్కతో పాటు తింటేనే ఇవి అందుతాయి. ఎందుకంటే ఇవి తొక్క కిందే ఉంటాయి కాబట్టి. మామిడిపండ్లు విసర్జన సాఫీగా అయ్యేలా చేస్తాయి. ఇవి దీర్ఘకాల మలబద్ధకం తగ్గటానికీ తోడ్పడుతున్నట్టు బయటపడింది. మామిడిలో విటమిన్‌ ఎ, సి దండిగా ఉంటాయి. ఇవి చర్మం బిగుతుగా ఉండటానికి తోడ్పడే కొలాజెన్‌ ఏర్పడటంలో పాలు పంచుకుంటాయి. అంటే ఇవి చర్మం నిగనిగకూ తోడ్పడతాయన్నమాట. ఇలా వృద్ధాప్య ఛాయలనూ తగ్గిస్తాయి.

దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ