లైకుల కోసం మరీ ఇంతలానా.. సిలిండర్‌పై యువతి స్టెప్పులు.. కట్ చేస్తే.. చివర్లో ఊహించని ట్విస్ట్.!

ఇలా రీల్స్ చేస్తున్న సమయంలో ఒకటి చేయాలనుకుంటారు.. మరొకటి జరుగుతుంది. అలాంటి వీడియోలను చూస్తే.. ఫన్నీ కోసం ఇదంతా చేశారా లేదా ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగిందా అని అనే విషయం అర్థం కాదు. అయితే కొన్ని సార్లు రకరకాల ఫన్నీ వీడియోలను షేర్ చేస్తూ ఓ రేంజ్ లో సందడి చేస్తారు. ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో సందడి చేస్తున్న ఈ వీడియోలో ఓ అమ్మాయి గ్యాస్ సిలిండర్‌పై డ్యాన్స్ చేస్తోంది.

లైకుల కోసం మరీ ఇంతలానా.. సిలిండర్‌పై యువతి స్టెప్పులు.. కట్ చేస్తే.. చివర్లో ఊహించని ట్విస్ట్.!
Dance Video Viral
Follow us
Surya Kala

|

Updated on: Jun 01, 2024 | 11:23 AM

తమలోని ప్రతిభను, ఇష్టాలను, అభిరుచులను పదిమందికి తెలిసేలా రీల్స్, వీడియోలను చేస్తున్నారు. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసి నెట్టింట్లో సందడి చేస్తున్నారు. ఇలా సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేసి తమ కళను ప్రదర్శించడం ప్రస్తుతం ఓ ట్రెండ్. అయితే కొంత మంది విచిత్రమైన పనులు చేస్తూ.. రీల్స్ చేసి సోషల్ మీడియాలో వదులుతున్నారు కూడా.. అయితే ఇలా రీల్స్ చేస్తున్న సమయంలో ఒకటి చేయాలనుకుంటారు.. మరొకటి జరుగుతుంది. అలాంటి వీడియోలను చూస్తే.. ఫన్నీ కోసం ఇదంతా చేశారా లేదా ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగిందా అని అనే విషయం అర్థం కాదు. అయితే కొన్ని సార్లు రకరకాల ఫన్నీ వీడియోలను షేర్ చేస్తూ ఓ రేంజ్ లో సందడి చేస్తారు. ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో సందడి చేస్తున్న ఈ వీడియోలో ఓ అమ్మాయి గ్యాస్ సిలిండర్‌పై డ్యాన్స్ చేస్తోంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో ఓ అమ్మాయి స్కూల్ యూనిఫాంలో చక్కగా డ్యాన్స్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఆ యువతి నేలపై కాకుండా గ్యాస్ సిలిండర్‌పై డ్యాన్స్ చేస్తుంది. బ్యాలెన్స్ మెయింటెయిన్ చేస్తూ డాన్స్ చేస్తోంది. మొదట్లో ఆ యువతి ప్రయత్నంలో బాగానే సక్సెస్ అయినట్లు తెలుస్తోంది. అయితే అకస్మాత్తుగా ఆమె సిలెండర్ మీద నుంచి పడిపోయింది. మంచి డ్యాన్స్ వీడియో కాస్త ఫన్నీ వీడియోగా మారింది.

ఇవి కూడా చదవండి

వీడియోపై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు దీనిని ప్రభుత్వ గ్యాస్ సిలిండర్ సబ్సిడీకి లింక్ చేయగా.. మరికొందరు ఇది కేంద్ర ప్రభుత్వానికి పెద్ద దెబ్బ అని అంటున్నారు. రీల్ చేయడానికి అమ్మాయి చేసిన ప్రయత్నంపై చాలా మంది ఫన్నీ కామెంట్స్ చేశారు. రీల్స్ చేయడం పిల్లల ఆట కాదని.. ఈ అమ్మాయి నిరూపించిందని ఒకరు కామెంట్ చేయగా.. రోజు రోజుకీ గ్యాస్‌ ఖరీదు పెరిగిపోతుంది ఇందుకే అంటూ ఫన్నీ కామెంట్ చేశారు.

ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి

ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో sehnaj_badgujar ఖాతాతో షేర్ చేశారు. “డింగ్ డింగ్ డ్యాన్స్ చివరి వరకు చూడటం” అనే క్యాప్షన్ జత చేశారు. ఇప్పటి వరకు 3.3 మిలియన్ల (33 లక్షలు) మంది చూశారు. 48 వేల మందికి పైగా లైక్ చేశారు. అమ్మాయి ఖచ్చితంగా పడిపోతుందని తాను మొదట్లోనే అనుకున్నానని ఒకరు కామెంట్ చేయగా.. కొంతమంది ఇలా పడినప్పుడు ఏమైనా దెబ్బలు తగిలితే ఎలా అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..