Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC Tourisam: తక్కువ ధరలోనే శ్రీలంకలోని ప్రముఖ ఆలయాలను చూసే అవకాశం.. IRCTC స్పెషల్ టూర్ ప్యాకేజీ వివరాలు మీకోసం

శ్రీలంక ప్రకృతి అందాలతో చాలా బాగుంటుంది. రామాయణం కాలం నాటి అనేక దేవాలయాలు ఉన్నాయి. వీటిని ఒక్కసారైనా తప్పక సందర్శించాలని కొంతమంది కోరుకుంటారు. దీంతో IRCTC ఎప్పటికప్పుడు శ్రీలంక కోసం టూర్ ప్యాకేజీలను ప్రారంభిస్తూనే ఉంటుంది. ఎవరైనా శ్రీలంకను సందర్శించాలనుకుంటున్నట్లయితే  ఈ టూర్ ప్యాకేజీ ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

IRCTC Tourisam: తక్కువ ధరలోనే శ్రీలంకలోని ప్రముఖ ఆలయాలను చూసే అవకాశం.. IRCTC స్పెషల్ టూర్ ప్యాకేజీ వివరాలు మీకోసం
Irctc Srilanka TourImage Credit source: gettyimages
Follow us
Surya Kala

|

Updated on: Jun 01, 2024 | 9:27 AM

వేసవిలో ఖచ్చితంగా సెలవులను ఎంజాయ్ చేయడానికి ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. అయితే ఇంటిలోని పెద్దలు ఉంటే ఎక్కడ ఎలాంటి ప్రాంతాలకు వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఉంటారు. నిజానికి వేసవి కాలంలో చాలా మంది కొండ ప్రాంతాలలో తిరగడానికి ఇష్టపడతారు. ఈ ప్రాంతాల్లో చలి ఎక్కువగా ఉండడంతో ఇక్కడి పెద్దలను తీసుకెళ్లడం అంటే వారి ఆరోగ్యంతో ఆడుకున్నట్లే. అటువంటి పరిస్థితిలో మన పొరుగు దేశం అయిన శ్రీలంకలోని ఈ అందమైన దేవాలయాలను సందర్శించడానికి మీ ఇంట్లో పెద్దలను, తల్లిదండ్రులను తీసుకెళ్లవచ్చు.

శ్రీలంక ప్రకృతి అందాలతో చాలా బాగుంటుంది. రామాయణం కాలం నాటి అనేక దేవాలయాలు ఉన్నాయి. వీటిని ఒక్కసారైనా తప్పక సందర్శించాలని కొంతమంది కోరుకుంటారు. దీంతో IRCTC ఎప్పటికప్పుడు శ్రీలంక కోసం టూర్ ప్యాకేజీలను ప్రారంభిస్తూనే ఉంటుంది. ఎవరైనా శ్రీలంకను సందర్శించాలనుకుంటున్నట్లయితే  ఈ టూర్ ప్యాకేజీ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. వాస్తవానికి, జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న శ్రీలంక పర్యటన కోసం IRCTC ఇటీవల ఒక ప్యాకేజీని విడుదల చేసింది. ఈ రోజు ఈ టూర్ కి సంబందించిన వివరాలు తెలుసుకుందాం.

ప్యాకేజీ ఎన్ని రోజులంటే IRCTC ఈ ప్యాకేజీ హైదరాబాద్ నుంచి ప్రారంభమవుతుంది. హైదరాబాద్ నుంచి విమానంలో శ్రీలంక చేరుకోవాల్సి ఉంటుంది. ఈ ప్యాకేజీలో మీకు హైదరాబాద్ నుంచి శ్రీలంకకు శ్రీలంక ఎయిర్‌లైన్స్ ద్వారా ఎకానమీ టిక్కెట్కేటాయిస్తారు. ఈ పూర్తి ప్యాకేజీ 5 రోజులు.. 4 రాత్రులు ఉండనుంది. ఈ ప్యాకేజీలో కొలంబోతో పాటు, దంబుల్లా, క్యాండీ , నువారా ఎలియా వంటి ప్రదేశాలను సందర్శించవచ్చు. ఈ ప్యాకేజీలో మొత్తం 34 సీట్లు ఉన్నాయి. ఈ ప్యాకేజీ పేరు శంకరి దేవి శక్తి పీఠ్ ఎక్స్ హైదరాబాద్(SH010)తో కూడిన శ్రీలంక రామాయణ యాత్ర .

ఇవి కూడా చదవండి

ప్రయాణ బీమా కూడా అందుబాటులో ఈ ప్యాకేజీలో మీరు మున్నేశ్వరం, శంకరి దేవి వంటి దేవాలయాలను కలిగి ఉన్న శ్రీలంకలోని పురాతన దేవాలయాలను సందర్శించవచ్చు. ఈ ప్యాకేజీలో అల్పాహారం, భోజనం, రాత్రి భోజనం కూడా ఇవ్వబడుతుంది. మొత్తం ప్యాకేజీలో త్రీ స్టార్ హోటల్‌లో సదుపాయం కల్పించనున్నారు. దీనితో పాటు స్థానిక టూర్ గైడ్ ను కూడా ఇస్తారు. టూరిస్ట్ వీసాతో పాటు 80 ఏళ్లు పైబడిన వారికి ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా ఇవ్వబడుతుంది. అయితే చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్ , పాన్ కార్డ్ ఉన్న వ్యక్తులకు మాత్రమే ట్రావెల్ ఇన్సూరెన్స్ అందుబాటులో ఉంటుంది.

ఈ ప్యాకేజీలో ఒక్క వ్యక్తి రూ.62,660 వెచ్చించాల్సి ఉంటుంది. అయితే షేరింగ్ విషయానికి వస్తే ఈ ప్యాకేజీ కోసం ఇద్దరు వ్యక్తులు రూ. 51,500, ముగ్గురు వ్యక్తులు రూ. 49,930 వెచ్చించాల్సి ఉంటుంది. అదే సమయంలో పిల్లలతో ఈ ప్యాకేజీని ఎంచుకుంటే పిల్లలకు డబ్బును కూడా చెల్లించాలి, పిల్లల కోసం విత్ బెడ్ అయితే మీరు రూ 39,440 , విత్ అవుట్ మంచం అయితే రూ. 37,430 లు చెల్లించాల్సి ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..