తెలుగువారి కోసం IRCTC పుణ్యక్షేత్ర టూర్ .. హైదరాబాదు నుంచి పూరీ, కాశీ, అయోధ్య వరకూ తక్కువ ధరకే చుట్టేయండి..
పుణ్యక్షేత్ర యాత్ర టూర్ ప్యాకేజీ రైలు ప్రయాణం సాగుతుంది. 9 రాత్రులు, 10 పగళ్లు సాగే ఈ యాత్రా సికింద్రాబాద్ నుంచి మొదలవుతుంది. కాజీపేట, ఖమ్మం నుంచి ఎపీలోని విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, పెందుర్తి, విశాఖపట్నం, విజయనగరం స్టేషన్ల మీదుగా సాగుతుంది. ఈ టూర్ ని ఎంచుకున్న భక్తులు ఆయా స్టేషన్లలో యాత్రికులు రైలును ఎక్కొచ్చు. జూన్ 8వ తేదీ, 2024న ప్రారంభమయ్యే పుణ్యక్షేత్ర యాత్ర పూర్తి వివరాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..
వేసవి సెలవుల్లో ఆధ్యాత్మిక పర్యటన చేయాలనుకునే తెలుగువారి కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ స్పెషల్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. పుణ్యక్షేత్ర యాత్ర పేరుతో తెలుగు రాష్ట్రాల్లో వివిధ స్టేషన్ల లో సాగే ఈ టూర్ లో పూరీ జగన్నతుడితో మొదలు కాశీ విశేశ్వరుడి దర్శనంతో పాటు గయ, అయోధ్య రామయ్య వంటి ప్రముఖ క్షేత్రాలను దర్శించుకోవచ్చు. పుణ్యక్షేత్ర యాత్ర టూర్ ప్యాకేజీ రైలు ప్రయాణం సాగుతుంది. 9 రాత్రులు, 10 పగళ్లు సాగే ఈ యాత్రా సికింద్రాబాద్ నుంచి మొదలవుతుంది. కాజీపేట, ఖమ్మం నుంచి ఎపీలోని విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, పెందుర్తి, విశాఖపట్నం, విజయనగరం స్టేషన్ల మీదుగా సాగుతుంది. ఈ టూర్ ని ఎంచుకున్న భక్తులు ఆయా స్టేషన్లలో యాత్రికులు రైలును ఎక్కొచ్చు. జూన్ 8వ తేదీ, 2024న ప్రారంభమయ్యే పుణ్యక్షేత్ర యాత్ర పూర్తి వివరాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..
10 రోజులు పాటు ఈ టూర్ ఎలా సాగుతుందంటే
- పుణ్యక్షేత్ర యాత్ర టూర్ ఫస్ట్ డే సికింద్రాబాద్ నుంచి ప్రారంభం అవుతుంది. కాజీపేట, ఖమ్మం, విజయాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట మీదుగా రైలు ప్రయాణిస్తూ రెండో రోజు పెందుర్తి, విజయనగరం మీదుగా సాగుతుంది.
- రెండో రోజు ఉదయం 9 గంటలకు మాల్తీపాట్పూర్‌కు చేరుతుంది. ఇక్కడ రైల్వే స్టేషన్ నుంచి పూరీలో బస చేయాల్సి ఉంటంది. ఫ్రెష్ అయ్యాక టిఫిన్, లంచ్ తిన్న తర్వాత జగన్నాథుని దర్శించుకోవాలి. రెండో రాత్రి పూరీలోనే బస చేయాల్సి ఉంటుంది.
- మూడో రోజు ఉదయం పూరీలో బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్‌చేసి కోణార్క్‌లోని సూర్యదేవాలయాన్ని సందర్శించుకోవాలి. అనంతరం మాల్తీపాట్పూర్ రైల్వేస్టేషన్ కు చేరుకోవాలి. ఇక్కడ నుంచి గయకు పబయలు దేరాలి.
- నాలుగోరోజు ఉదయం 8:30 గంటలకు గయ చేరుకుంటారు. ఉదయం హోటల్‌లో బస చేసి టిఫిన్ తిని విష్ణుపాద దేవాలయాన్ని దర్శించుకోవాలి. అనంతరం కాశికి ప్రయాణం కావాల్సి ఉంటుంది.
- ఐదో రోజు ఉదయం 6 గంటలకు కాశికి చేరుకుంటారు. ఇక్కడ హోటల్ లో బస్ చేసి బ్రేక్ఫాస్ట్తిని కాశీ విశ్వనాథుడిని, విశాలాక్షి అమ్మవారు, అన్నపూర్ణాదేవీ ఆలయాలను దర్శించుకోవాలి. సాయంత్రం గంగా హారతిని చూడవచ్చు. రాత్రి వారణాసిలోనే బస చేయాలి.
- ఆరో రోజుఉదయం ఆల్ఫా హారం తిని హోటల్ నుంచి చెక్అవుట్ అయ్యి కాశీలోని ఇతర ప్రముఖ దేవాలయాలు, ఘాట్లు దర్శించుకోవాల్సి ఉంది. రాత్రి భోజనం తర్వాత వారణాసి నుంచి అయోధ్యకు పయణం కావాలి.
- ఏడో రోజు బాల రామయ్య దర్శనం కోసం అయోధ్యకు చేరుకుంటారు. అక్కడ బాల రామయ్య దర్శనం, హనుమంతుని ఆలయాలు దర్శించుకుంటారు. ఆ రోజు సాయంత్రం సరయూ హారతిని దర్శించుకుని రాత్రి అయోధ్యలోనే భోజనం తిని.. ప్రయోగకు స్టార్ట్ అవుతారు.
- యాత్రలో ఎనిమిదో రోజు ఉదయం ప్రయాగ్‌రాజ్ చేరుకుంటారు. ఇక్కడ అల్పాహారం తీసుకుని త్రివేణి సంగమం, హనుమాన్ ఆలయం, శంకర్ విమన్ మండపాన్ని దర్శించుకోవాలి. దీంతో పుణ్యక్షేత్ర యాత్రలోని పుణ్యక్షేత్రాల దర్శనం పూర్తి అవుతుంది. అనంతరం సొంత ఊర్లకు పయనం కావాల్సి ఉంటుంది.
- తొమ్మిదో రోజు విజయనగరం, పెందుర్తి, సామర్లకోటకు చేరుకుంటుంది..
- పదో రోజు రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఖమ్మం, కాజీపేట ప్రాంతాల మీదుగా ప్రయాణించి సికింద్రాబాద్ చేరుకోవటంతో పుణ్యక్షేత్ర దర్శనం యాత్ర ముగుస్తుంది.
ఈ టూర్ ప్యాకేజీ ఛార్జీలు ఎలా ఉన్నాయంటే
- కంఫర్ట్‌లో ఒక టికెట్ ధర రూ.33,955
- స్టాండర్డ్‌లో రూ.25,980
- ఎకానమీ క్లాస్‌లో రూ.16,525
5 నుంచి 11 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు
- కంఫర్ట్‌లో రూ.32,380
- స్టాండర్డ్‌లో రూ.24,670
- ఎకానమీ క్లాస్‌లో రూ.15,410
- అయితే డబుల్ ఆక్యుపెన్సీ, ట్రిపుల్ ఆక్యుపెన్సీలకు వేర్వేరుగా చార్జీలు ఉంటాయి.
ప్యాకేజీలో ఏయే సదుపాయాలు ఉంటాయంటే..
ప్యాకేజీని బట్టి ట్రైన్ లో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్ క్లాస్ లో ప్రయాణం
ప్యాకేజీని బట్టి ప్రయాణానికి వాహనం
ప్యాకేజీలోనే ఉదయం కాఫీ, బ్రేక్‌ఫాస్ట్, భోజన సదుపాయం
పుణ్యక్షేత్రాల దర్శనం కోసం టికెట్స్, బోటింగ్ వంటి వాటికి ప్రయాణీకులే సొంతంగా చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు ప్యాకేజీలో లేని ప్రదేశాలను సందర్శించాలనుకుంటే పర్యాటకులే సొంతంగా ఖర్చు చేసుకోవాలి. గైడ్‌ని నియమించుకోవాన్నా యాత్రికులే చూసుకోవాలి.
సెలవుల్లో జగన్నాథుడిని, విశ్వేశ్వరుడిని, బాల రామయ్యని ఏకకాలంలో దర్శించుకోవలనుకుంటే ఈ పుణ్యక్షేత్ర యాత్ర టూర్ ప్యాకేజీ బెస్ట్ ఎంపిక. ఈ టూర్ కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ప్యాకేజీని బుక్ చేసుకునేందుకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..