AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prasadam in Temples: ఈ ఆలయాల్లోని ప్రసాదం రుచికరం.. మళ్ళీ మళ్ళీ తినలనిపించేలా ప్రసాదం దొరికే ఆలయాలు ఏమిటంటే

మన దేశంలో భగవంతునిపై విశ్వాసంతో పాటు ఆలయంలో దేవుళ్లకు సమర్పించే ప్రసాదంతో కూడా గాఢమైన అనుబంధం ఉంది. దేశంలోని కొన్ని దేవాలయాల్లో ప్రతిరోజూ వందల కిలోల ఆహారాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. భక్తులకు ఆ ఆహారాన్ని ప్రసాదంగా వడ్డిస్తారు. తిరుపతి లడ్డు, అన్నవరం ప్రసాదం, అయ్యప్ప ప్రసాదం ఇలా రకరకాల ప్రసాదాలు ప్రఖ్యాతిగాంచాయి. అయితే ఒక ఆలయంలో 56 రకాల నైవేద్యాలను సమర్పించే సంప్రదాయం ఉంది. ఆ ప్రసాదాన్ని కూడా భక్తులకు పంపిణీ చేస్తారు. ఈ దేవాలయాలంలో తయారు చేసిన ప్రసాదం చాలా రుచికరమైనది. దేవుడిపై భక్తితో పాటు ప్రసాదానికి ఫ్యాన్ గా మారతారు.

Surya Kala
|

Updated on: Jun 01, 2024 | 8:20 AM

Share
పూరి జగన్నాథ దేవాలయం, మహాప్రసాదం 
హిందూ మతంలో ఒరిస్సాలో ఉన్న జగన్నాథ దేవాలయం నాలుగు ధాములలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇక్కడ ఉన్న జగన్నాథునికి మహాప్రసాదం అందిస్తారు. ఇందులో 56 భోగ్ ను సమర్పిస్తారు. 56 రకాల ఆహార పదార్థాలను సేకరించి ఒక మట్టి కుండలో చెక్కపై ఈ మహాప్రసాదాన్ని తయారుచేస్తారు. ఈ మహాప్రసాదాన్ని స్వీకరించడం మహాభాగ్యమని చెబుతారు. ఎంతమంది వచ్చినా ఈ ప్రసాదానికి లోటుండదని ఈ మహాప్రసాదాన్ని పరమాత్మగా భావిస్తారు. ఈ మహాప్రసాదం తినడానికి ఎంత రుచిగా ఉంటుందో అంతే దివ్యమైనది.

పూరి జగన్నాథ దేవాలయం, మహాప్రసాదం హిందూ మతంలో ఒరిస్సాలో ఉన్న జగన్నాథ దేవాలయం నాలుగు ధాములలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇక్కడ ఉన్న జగన్నాథునికి మహాప్రసాదం అందిస్తారు. ఇందులో 56 భోగ్ ను సమర్పిస్తారు. 56 రకాల ఆహార పదార్థాలను సేకరించి ఒక మట్టి కుండలో చెక్కపై ఈ మహాప్రసాదాన్ని తయారుచేస్తారు. ఈ మహాప్రసాదాన్ని స్వీకరించడం మహాభాగ్యమని చెబుతారు. ఎంతమంది వచ్చినా ఈ ప్రసాదానికి లోటుండదని ఈ మహాప్రసాదాన్ని పరమాత్మగా భావిస్తారు. ఈ మహాప్రసాదం తినడానికి ఎంత రుచిగా ఉంటుందో అంతే దివ్యమైనది.

1 / 5

తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం
భారతదేశంలోని పురాతన దేవాలయాలలో ఒకటి తిరుమల ఆలయం. ఇది దేశంలోని అత్యంత ధనిక దేవాలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. దీనితో పాటు ఈ ఆలయం ప్రసాదంగా లభించే లడ్డూ ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలోని వంటగదిలో ప్రతిరోజూ లక్షలాది మందికి వివిధ రకాల దక్షిణ భారతీయ వంటకాలు తయారు చేయబడతాయి. ఆలయ వంటగది సౌరశక్తితో పనిచేస్తుంది. ఇక్కడ ప్రతిరోజూ సుమారు 1100 మంది వంటవారు ఆహారాన్ని తయారు చేసి ప్రసాదంగా పంపిణీ చేస్తారు.

తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం భారతదేశంలోని పురాతన దేవాలయాలలో ఒకటి తిరుమల ఆలయం. ఇది దేశంలోని అత్యంత ధనిక దేవాలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. దీనితో పాటు ఈ ఆలయం ప్రసాదంగా లభించే లడ్డూ ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలోని వంటగదిలో ప్రతిరోజూ లక్షలాది మందికి వివిధ రకాల దక్షిణ భారతీయ వంటకాలు తయారు చేయబడతాయి. ఆలయ వంటగది సౌరశక్తితో పనిచేస్తుంది. ఇక్కడ ప్రతిరోజూ సుమారు 1100 మంది వంటవారు ఆహారాన్ని తయారు చేసి ప్రసాదంగా పంపిణీ చేస్తారు.

2 / 5

కోయంబత్తూరులోని మురుగన్ దేవాలయం, పంచామృతం
అరుల్మిగు దండాయుధపాణి స్వామి ఆలయం తమిళనాడులోని కోయంబత్తూరుకు ఆగ్నేయంగా 150 కిలోమీటర్ల దూరంలో పళనిలో ఉంది. భారతదేశంలోని ఏకైక హిందూ దేవాలయం  ప్రసాదానికి భౌగోళిక సూచిక ట్యాగ్ ఇవ్వబడింది. అరటిపండ్లు, ఆవు నెయ్యి, బెల్లం, తేనె , యాలకులతో ప్రసాదం తయారు చేస్తారు. కొన్నిసార్లు ఖర్జూరం, చక్కెరను కూడా కలుపుతారు.

కోయంబత్తూరులోని మురుగన్ దేవాలయం, పంచామృతం అరుల్మిగు దండాయుధపాణి స్వామి ఆలయం తమిళనాడులోని కోయంబత్తూరుకు ఆగ్నేయంగా 150 కిలోమీటర్ల దూరంలో పళనిలో ఉంది. భారతదేశంలోని ఏకైక హిందూ దేవాలయం ప్రసాదానికి భౌగోళిక సూచిక ట్యాగ్ ఇవ్వబడింది. అరటిపండ్లు, ఆవు నెయ్యి, బెల్లం, తేనె , యాలకులతో ప్రసాదం తయారు చేస్తారు. కొన్నిసార్లు ఖర్జూరం, చక్కెరను కూడా కలుపుతారు.

3 / 5
షిర్డీ సాయిబాబా మందిరం, షిర్డీ
షిర్డీ సాయిబాబా ఆలయానికి ఆనుకుని ఉన్న భారీ వంటగదిలో రోజూ దాదాపు 2000 కిలోల పప్పులు, బియ్యంతో పాటు ఇతర కూరలను తయారుచేస్తారు. ఇది భారతదేశంలోనే అత్యంత ధనిక తీర్థయాత్ర కేంద్రంగా మాత్రమే కాదు రుచికరమైన ప్రసాదం లడ్డు, రసోయి ప్రసాదాలకు కూడా ప్రసిద్ధి చెందింది. ఈ వంటగదిలో దాదాపు 1100 మంది వంటవారు పని చేస్తున్నారు. ఇక్కడ ఉన్న వంటగది ఆసియాలోనే అతిపెద్ద సౌరశక్తితో పనిచేసే వంటగది.

షిర్డీ సాయిబాబా మందిరం, షిర్డీ షిర్డీ సాయిబాబా ఆలయానికి ఆనుకుని ఉన్న భారీ వంటగదిలో రోజూ దాదాపు 2000 కిలోల పప్పులు, బియ్యంతో పాటు ఇతర కూరలను తయారుచేస్తారు. ఇది భారతదేశంలోనే అత్యంత ధనిక తీర్థయాత్ర కేంద్రంగా మాత్రమే కాదు రుచికరమైన ప్రసాదం లడ్డు, రసోయి ప్రసాదాలకు కూడా ప్రసిద్ధి చెందింది. ఈ వంటగదిలో దాదాపు 1100 మంది వంటవారు పని చేస్తున్నారు. ఇక్కడ ఉన్న వంటగది ఆసియాలోనే అతిపెద్ద సౌరశక్తితో పనిచేసే వంటగది.

4 / 5
లంగర్ ఆఫ్ గోల్డెన్ టెంపుల్, అమృత్‌సర్
అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌లోని లంగర్‌లో ప్రతిరోజూ చాలా ప్రసాదం, అన్నం, పప్పు, రోటీ , కూరగాయలు తయారుచేస్తారు. ఇక్కడ పూర్తి సేవా స్ఫూర్తితో వంటగదిలో వండిన లంగర్ మీ కడుపుని నింపుతుంది. ఈ ప్రసాదం ఆత్మకు ఓదార్పు, సంతృప్తిని అందిస్తుంది.

లంగర్ ఆఫ్ గోల్డెన్ టెంపుల్, అమృత్‌సర్ అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌లోని లంగర్‌లో ప్రతిరోజూ చాలా ప్రసాదం, అన్నం, పప్పు, రోటీ , కూరగాయలు తయారుచేస్తారు. ఇక్కడ పూర్తి సేవా స్ఫూర్తితో వంటగదిలో వండిన లంగర్ మీ కడుపుని నింపుతుంది. ఈ ప్రసాదం ఆత్మకు ఓదార్పు, సంతృప్తిని అందిస్తుంది.

5 / 5