వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఈ రాశిలో రాశ్యధిపతి శుక్రుడు, గురు, బుధ, రవుల సంచారం, లాభస్థానంలో రాహువు సంచారం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆదాయం బాగా వృద్ధి చెందడానికి, ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం కొనసాగుతాయి. వృత్తి, వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. అదనపు ఆదాయ సంబంధమైన ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీల జోలికి పోకపోవడం మంచిది. విలాసాల మీద, స్నేహితుల మీద అనవసర ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. ముఖ్యమైన వ్యవహారాలు, కార్యకలాపాలు వ్యయ ప్రయాసలతో పూర్తవుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఒకటి రెండు కుటుంబ సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభి స్తుంది. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది.