- Telugu News Photo Gallery Spiritual photos Vastu Tips For Plants : According To Vastu Shastra Know Plants That Bring Success And Wealth
Vastu Tips for Plant: సక్సెస్‌ను, సంపదను తెచ్చే మొక్కల గురించి తెలుసుకోండి.. ఏ మొక్కను ఏ దిశలో పెంచుకోవాలంటే..
వాస్తు శాస్త్రంలో ఇంటి ఆవరణలో మొక్కలు పెంచే విషయంలో, పచ్చదనానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. వాస్తు ప్రకారం సరైన దిశలో నాటిన చెట్లు, మొక్కలు ఇంటిలోని వాస్తు దోషాలను తొలగిస్తాయి, అయితే ఇంట్లో లేదా ఆవరణలో చెట్లు, మొక్కలు నిర్దేశించిన దిశలో లేకుంటే అది శారీరక, మానసిక సమస్యలతో పాటు ఆర్థికపరమైన ఇబ్బందులను కూడా కలిగిస్తుందని మీకు తెలుసా? వాస్తు శాస్త్రం ప్రకారం చెట్లు, మొక్కలకు కొన్ని దిశలు ఉన్నాయి. అవి ఆ దిశల్లోనే నాటడం వలన అద్భుత ప్రయోజనాలను అందిస్తాయి. ఈ రోజు ఏ మొక్కను ఎ దిశలో పెంచుకోవాలో తెలుసుకుందాం..
Updated on: May 31, 2024 | 7:18 AM

తులసి, కలువ, అరటి, ఉసిరి, శంఖం పువ్వు తీగ, పుదీనా, పసుపు మొదలైన చిన్న మొక్కలను తోట లేదా ఇంటి బాల్కనీకి ఈశాన్య దిక్కులో లేదా తూర్పు దిశలో పెంచుకోవాలి. ఈ దిశలలో చిన్న చిన్న మొక్కలు ఉంటే ఉదయించే సూర్యుని ఆరోగ్యకరమైన కిరణాలు ఇంట్లోకి ప్రవేశిస్తాయి. ఇది కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సామాజిక సంబంధాలను బలోపేతం చేస్తుంది.

ఉత్తర దిశ: ఉత్తర దిశలో నీలం రంగు పూలను ఇచ్చే మొక్కలు పెంచుకోవాలి. ఇవి జీవితంలో శ్రేయస్సును తీసుకురావడానికి సహాయపడతాయి. నీలం రంగు వ్యక్తి జీవితంలో స్థిరత్వం, స్వచ్ఛతను తెస్తుంది. నీలిరంగు కుండీలో మనీ ప్లాంట్‌ను నాటడం వల్ల కెరీర్‌లో పురోగతి ఉంటుంది. అంతేకాదు నీలి రంగు పుష్పలైన శంఖ పుష్పం తీగను ఈ దిశలో పెంచుకోవడం శుభప్రదం.

దక్షిణ, పడమర: ఇంటికి దక్షిణం లేదా పడమర దిశలో పొడవైన చెట్లను నాటడం ఎల్లప్పుడూ సముచితంగా పరిగణించబడుతుంది. ఇంటి నుంచి తగినంత దూరంలో లేదా పశ్చిమం వైపు ఏదైనా బహిరంగ ప్రదేశంలో రావి చేట్టుకుని పెంచుకోవడం శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ దిశలో చాందినీ, సన్నజాజులు, మల్లె తదితర తెలుపు రంగు పూల మొక్కలను నాటడం వల్ల లాభాలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. దీంతో పిల్లల్లో సృజనాత్మక శక్తి పెరుగుతుంది.

వాయువ్య దిశ: శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన బిల్వ చెట్టును ఇంటికి వాయువ్య దిశలో నాటడం చాలా శుభప్రదంగా భావిస్తారు.

వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటి ప్రాంగణంలో తీగ మొక్క ఉండటం వల్ల అన్ని రకాల ప్రతికూల శక్తుల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది. వాస్తు దోషాలను తొలగించి ఇంట్లో ఆనందం, శ్రేయస్సును తెస్తుంది. ఇంటి వాయువ్య దిశలో నాటిన తీగ మొక్క ఆ ఇంట్లో నివసించే ప్రతి సభ్యుడికి విజయాన్ని ఇస్తుంది. జీవితం ప్రకాశవంతంగా ఉండేలా చేస్తుంది. గౌరవం, కీర్తిని కోరుకునే వారు ఈ దిశలో తీగ మొక్కలను నాటాలి.





























