AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Makhana: ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు ఇచ్చే మఖానా.. డ్రై, ఏ మఖానా ఆరోగ్యానికి మంచిదంటే?

చాలా మంది ఆరోగ్య నిపుణులు మఖానాను తక్కువ నూనెలో లేదా నెయ్యిలో వేయించి తింటే.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు. మఖానా తో అనేక రకాల రుచికరమైన, ఆరోగ్యకరమైన అల్పాహారం సిద్ధం చేసుకోవచ్చు. అంతేకాదు ఇది అన్ని వయసుల వారికి ఉపయోగకరంగా ఉంటుంది. మఖానాను వేయించి తింటే దీని రుచి మరింత పెరుగుతుంది.

Makhana: ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు ఇచ్చే మఖానా.. డ్రై, ఏ మఖానా ఆరోగ్యానికి మంచిదంటే?
మీకు కిడ్నీ స్టోన్ సమస్యలు ఉంటే మఖానా తినకండి. శరీరంలో కాల్షియం స్థాయిలు పెరగడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. చాలామంది మఖానాలో రుచికి కాస్తింత ఎక్కువ ఉప్పు వేస్తారు. అధిక రక్తపోటు రోగులకు ఉప్పు హానికరం. కాబట్టి అధిక రక్తపోటు ఉన్నవారు అదనపు ఉప్పు కలిగిన మఖానా తినకూడదు.Image Credit source: Gettyimages
Surya Kala
|

Updated on: Jun 01, 2024 | 9:55 AM

Share

మఖానా అనేది ప్రతి ఒక్కరూ ఇష్టపడే చిరుతిండి. ఇది తామర గింజలు. ఫాక్స్ నట్ పేరుతో కూడా ప్రజలకు తెలుసు. వీటి తామర గింజలతో రకరకాలైన వంటకాలు, చాట్ తయారీ వరకు ప్రతిదానిలో ఉపయోగించబడుతుంది. వీటిని తినే ఆహారంలో చేర్చుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కొందరికి పొడిగా తింటే, మరికొందరు వేయించి తింటారు. చాలా మంది నెయ్యిలో వేయించి తినడానికి ఆసక్తిని చూపిస్తారు. అయితే డ్రై మఖానా తినాలా లేక వేయించిన మఖనా ను తింటే ఎక్కువ లాభదాయకంగా ఉంటుందా అనే ప్రశ్న చాలా మందిలో మెదులుతుంది. బరువు తగ్గడం కోసం ఆరోగ్యాని ఇచ్చే స్నాక్స్‌లో మఖానా ఒకటి. దీనిని తినే ఆహారంలో అనేక విధాలుగా చేర్చుకుంటారు. అయితే దీన్ని సరైన పద్ధతిలో తిన్నప్పుడే దాని ప్రయోజనాలను పొందుతారు. మఖానాను ఏ విధంగా తినడం ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందో ఈ రోజు తెలుసుకుందాం..

ఆరోగ్య పరంగా ఏది మంచిది? చాలా మంది ఆరోగ్య నిపుణులు మఖానాను తక్కువ నూనెలో లేదా నెయ్యిలో వేయించి తింటే.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు. మఖానా తో అనేక రకాల రుచికరమైన, ఆరోగ్యకరమైన అల్పాహారం సిద్ధం చేసుకోవచ్చు. అంతేకాదు ఇది అన్ని వయసుల వారికి ఉపయోగకరంగా ఉంటుంది. మఖానాను వేయించి తింటే దీని రుచి మరింత పెరుగుతుంది. మరోవైపు, మఖానాను కాల్చి తింటే.. సులభంగా జీర్ణం అవుతుంది. మఖానాను వేయించడం వల్ల దీనిలోని యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కూడా పెంచుతుంది.

మఖానా వేయించేటప్పుడు ఈ పొరపాటు చేయకండి మఖానాను వేయించేటప్పుడు అధిక ఉష్ణోగ్రత వద్ద ఎక్కువసేపు వేయించకుండా ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఎక్కువ సమయం వేయిస్తే మఖానాలో ఉండే విటమిన్లు, మినరల్స్ కోల్పోవచ్చు. అదే సమయంలో మఖానాను కాల్చేటప్పుడు లేదా ఆ తర్వాత మసాలాలను ఎక్కువగా ఉపయోగించవద్దు. అదనపు మసాలాల వల్ల కొలెస్ట్రాల్ సమస్యలు ఏర్పడవచ్చు,

ఇవి కూడా చదవండి

డ్రై మఖానా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు డ్రై మఖానా ఆరోగ్య దృక్కోణంలో నుంచి చూస్తే ప్రయోజనకరమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే దీనిని ఏ ఉష్ణోగ్రత వద్ద వంట చేయరు. డ్రై మఖానాలో అన్ని పోషకాలు చెక్కుచెదరకుండా ఉంటాయి. మరోవైపు నీటిలో నానబెట్టిన తర్వాత పొడి మఖానాను తింటే… వేసవిలో చాలా కాలం పాటు హైడ్రేట్‌గా ఉండవచ్చు. డ్రై మఖానాలో ప్రోటీన్, ఫైబర్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..