Viral News: ఎండవేడి నుంచి ఉపశమనం కోసం ఏకంగా టాయిలెట్ లోనే ఏసీ .. నెట్టింట్లో ఫోటో వైరల్..

ఎండ వేడికి సంబంధించిన రకరకాల వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. కొందరు ఎండ వేడితో రకరకాల ఆహార పదార్ధాలను వండేస్తుంటే.. మరికొందరు వేడి నుంచి తమని తాము రక్షించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు పులువురు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం అలాంటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇది చూసిన ఎవరైనా సరే షాక్ అవాల్సిందే.

Viral News: ఎండవేడి నుంచి ఉపశమనం కోసం ఏకంగా టాయిలెట్ లోనే ఏసీ .. నెట్టింట్లో ఫోటో వైరల్..
Viral News
Follow us
Surya Kala

|

Updated on: Jun 01, 2024 | 10:49 AM

సోషల్ మీడియాలోని పేజీలను స్క్రోల్ చేస్తున్నప్పుడు.. చాలా సార్లు కళ్ళు కొన్ని వీడియోల దగ్గర ఆగిపోతాయి. వాటిని చూసి ఆశ్చర్యపోతాం. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి జనాల్లో చర్చనీయాంశమైంది. అది చూసిన తర్వాత ఎవరి దృష్టి అయిన సరే తమకు నచ్చిన చోట నిలిచిపోతుంది. ప్రస్తుతం ఎండ వేడికి సంబంధించిన రకరకాల వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. కొందరు ఎండ వేడితో రకరకాల ఆహార పదార్ధాలను వండేస్తుంటే.. మరికొందరు వేడి నుంచి తమని తాము రక్షించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు పులువురు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం అలాంటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇది చూసిన ఎవరైనా సరే షాక్ అవాల్సిందే.

ప్రస్తుతం దేశంలోని చాలా రాష్ట్రాలు ఎండ వేడిమికి నిప్పుల కొలిమిగా మారిపోయాయి. దేశ రాజధాని ఢిల్లీ లో రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం వేసవిలో ఉన్న పరిస్థితులు ఇలా ఉన్నాయంటూ.. వేడిగాలులతో వివిధ రాష్ట్రాలలో ప్రజలు మరణిస్తున్న వారి సంఖ్యను ప్రకటిస్తూనే ఉన్నారు. దీంతో ప్రజలు తమను తాము రక్షించుకునేందుకు రకరకాల ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి తన వాష్‌రూమ్‌లో కూడా AC ఇన్‌స్టాల్ చేసుకున్న ఈ చిత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇవి కూడా చదవండి

ఇక్కడ చిత్రాన్ని చూడండి

వైరల్ అవుతున్న ఈ చిత్రంలో సాధారణంగా కనిపించే వాష్‌రూమ్‌ను చూడవచ్చు. టాయిలెట్ ఓ గోడ పైభాగంలో ఏసీ అమర్చబడి ఉంటుంది. ఈ చిత్రం ఘజియాబాద్‌లోని ఒక ఇంటిలోనిది అని తెలుస్తుంది. ఇది చూసిన తర్వాత నెటిజన్లు చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు.

ఈ వీడియో @haseenkhan3933 అనే ఖాతా ద్వారా Instaలో షేర్ చేశారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో షేర్ చేస్తున్నారు. ఇది చూసిన జనాలు దీనిపై ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు. ఒకరు ‘ఇది నా కల వాష్‌రూమ్ సోదరా.’ అని కామెంట్ చేయగా.. మరొకరు ఈ చిత్రాన్ని చూసి ‘బ్రదర్, ఇది ధనవంతులకు మాత్రమే పరిమితం అని వ్యాఖ్యానించారు. అంతేకాదు చాలా మంది రకరకాలుగా కామెంట్ చేస్తూ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..