AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: మీకు స్మోకింగ్ అలవాటు ఉందా.? ఈ వీడియో చూస్తే జీవితంలో మళ్లీ ఆ జోలికి వెళ్లరు..

పొగాకు కారణంగా ప్రతి సంవత్సరం 8 మిలియన్ల కంటే ఎక్కువ మంది మరణిస్తున్నారు. వీరిలో సుమారు 10 లక్షల ంది ఈ మరణాలలో, సుమారు 10 లక్షల మంది పొగతాగే వారి పక్కన ఉన్నవారే కావడం గమనార్హం. సిగరెట్‌ పొగలో 7000 కంటే ఎక్కువ హానికరమైన రసాయనాలు ఉంటాయి. ఇవి క్యాన్సర్‌కు దారి తీస్తాయి. స్మోకింగ్ చేసే సమయంలో ఈ రసాయనాలు ఊపిరిత్తుల్లోకి...

Viral: మీకు స్మోకింగ్ అలవాటు ఉందా.? ఈ వీడియో చూస్తే జీవితంలో మళ్లీ ఆ జోలికి వెళ్లరు..
Smoking
Narender Vaitla
|

Updated on: May 31, 2024 | 9:51 PM

Share

పొగతాగడం ఆరోగ్యానికి హానికరమనే విషయం ప్రతీ ఒక్కరికీ తెలిసిందే. అయినా ఈ పాడు అలవాటును మానడానికి ఇష్టపడరు. పైగా స్టైల్‌గా గుప్పుగుప్పుమంటూ పొగ పీల్చేస్తుంటారు. పొగాకు వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ప్రతీ ఒక్కరిలో అవగాహన కల్పించేందుకు ప్రతీ ఏటా మే31న ప్రపంచపొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు. పొగాతో కలిగే తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

పొగాకు కారణంగా ప్రతి సంవత్సరం 8 మిలియన్ల కంటే ఎక్కువ మంది మరణిస్తున్నారు. వీరిలో సుమారు 10 లక్షల ంది ఈ మరణాలలో, సుమారు 10 లక్షల మంది పొగతాగే వారి పక్కన ఉన్నవారే కావడం గమనార్హం. సిగరెట్‌ పొగలో 7000 కంటే ఎక్కువ హానికరమైన రసాయనాలు ఉంటాయి. ఇవి క్యాన్సర్‌కు దారి తీస్తాయి. స్మోకింగ్ చేసే సమయంలో ఈ రసాయనాలు ఊపిరిత్తుల్లోకి వెళ్లి ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ మార్పిడికి ఆటంకం కలిగిస్తాయి. దీంతో ఊపిరిత్తుల పనితీరును దెబ్బతీస్తాయి. కాలక్రమేణా, ధూమపానం ఎంఫిసెమా మరియు క్రానిక్ బ్రోన్కైటిస్ వంటి తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతుంది, ఇది ప్రాణాంతకమవుతుంది.

ఇక స్మోకింగ్ చేసే వారి ఊపిరిత్తులు పూర్తిగా వాటి రూపాన్ని కోల్పోతాయి. ఆరోగ్యకరమైన ఊపిరితిత్తులు గులాబీ రంగులో ఉంటే, స్మోకింగ్ చేసే వారి లంగ్స్ పూర్తిగా నలుపు రంగులోకి మారుతాయి. స్మోకింగ్ చేసే వారి ఊపిరిత్తుల్లో అల్వియోలీ తగ్గిపోయి, శ్లేష్మం పేరుకుపోతుంది. ఇది ఊపిరితిత్తుల పనితీరును దెబ్బతీస్తుంది, ఇది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు, అలసట వంటి సమస్యలకు దారి తీస్తుంది. స్మోకింగ్‌ చేసే వారికి, ఈ అలవాటు లేని వారి ఊపిరితిత్తుల మధ్య ఎలాంటి తేడా ఉంటుందో ఈ కింది వీడియో చూస్తే స్పష్టమవుతోంది.

అయితే స్మోకింగ్ మానేయడం వల్ల ఊపిరితిత్తులు కోలుకుని క్రమంగా ఆరోగ్యంగా మారే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. స్మోకింగ్ మానేసిన నెల రోజుల్లోనే మార్పు కనిపిస్తుంది. శ్వాసతీసుకోవడం మెరుగవుతుంది, అలసట తగ్గుతుంది, శక్తి స్థాయిలు పెరుగుతాయి. వీటితో పాటు స్మోకింగ్ మానేసిన వారికి గుండె జబ్బులు, స్ట్రోక్, క్యాన్సర్ వంటి మరింత తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాల ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..