Chicken: చికెన్‌తో కలిపి పెరుగు తింటే ఏం జరుగుతుంది..! మాంసాహార ప్రియులు మస్ట్‌గా తెలుసుకోండి
మాంసాహార ప్రియులకు ఎక్కువగా ఇష్ట పడే వాటిల్లో చికెన్ కూడా ఒకటి. చికెన్ అంటే ఎంతో మంది ఇష్టంగా తింటూ ఉంటారు. చికెన్‌తో ఏం చేసినా చాలా రుచిగా ఉంటాయి. చికెన్‌తో ఏమైనా తయారు చేసుకోవచ్చు. పచ్చళ్లు, స్నాక్స్, కర్రీలు, బిర్యానీలు, పులావ్‌లు ఏం చేసి చాలా టేస్టీగా ఉంటాయి. కోడి కూర రుచిగా ఉండటమే కాకుండా.. ఆరోగ్యానికి కూడా ఎంతో ఆరోగ్యం. ఇందులో అనేక రకాలైన పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ప్రోటీన్ ఎక్కువగా లభిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే..

మాంసాహార ప్రియులకు ఎక్కువగా ఇష్ట పడే వాటిల్లో చికెన్ కూడా ఒకటి. చికెన్ అంటే ఎంతో మంది ఇష్టంగా తింటూ ఉంటారు. చికెన్‌తో ఏం చేసినా చాలా రుచిగా ఉంటాయి. చికెన్‌తో ఏమైనా తయారు చేసుకోవచ్చు. పచ్చళ్లు, స్నాక్స్, కర్రీలు, బిర్యానీలు, పులావ్‌లు ఏం చేసి చాలా టేస్టీగా ఉంటాయి. కోడి కూర రుచిగా ఉండటమే కాకుండా.. ఆరోగ్యానికి కూడా ఎంతో ఆరోగ్యం. ఇందులో అనేక రకాలైన పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ప్రోటీన్ ఎక్కువగా లభిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే.. చికెన్ పోషకాల బాంఢాగారం. చికెన్ తింటే ఎన్నో రకాల మంచి పోషకాలు లభిస్తాయి. అలాగని చికెన్ మరీ ఎక్కువగా తీసుకోకూడదు. దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి.
అయితే చికెన్ తింటున్నప్పుడు కొన్ని ఆహారాలకు ఖచ్చితంగా దూరంగా ఉండాలి. చికెన్‌తో కలిపి కొన్ని ఆహారాలు తినడం వల్ల ఇవి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. దీని వల్ల అలెర్జీలు, చర్మ సమస్యలు కూడా వస్తాయి. తీవ్రమైన వ్యాధులకు కూడా కారణం అవుతుంది. మరి చికెన్ తింటున్నప్పుడు ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
పాలు:
చికెన్ తినప్పుడు పాలకు దూరంగా ఉండాలి. చాలా మందికి ప్రతి రోజూ పాలు తాగే అలవాటు ఉంటుంది. చికెన్ తిన్నప్పుడు పాలు తాగకూడదు. దీని వల్ల శరీరంపై సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతాయి. దీని వల్ల దురద, దద్దుర్లు వంటివి రావచ్చు.
చేపలు:
ఎప్పుడైనా ఎక్కడైనా భోజనాలకు వెళ్లినప్పుడు.. అక్కడ అన్ని రకాల వంటలు చేస్తారు. ఇంట్లో కూడా ఒక్కోసారి చేపలు, చికెన్ కూడా చేస్తారు. చికెన్, చేపలు ఒక్కటేసారి తినకూడదు. ఇలా తినేవారు చాలా మంది ఉన్నారు. ఈ రెండు పదార్థాలను కలిపి ఒకటే సారి తీసుకోకూడదు. వీటిల్లో ప్రోటీన్ అనేది పుష్కలంగా ఉంటుంది. వీటిని రెండూ ఒకటేసారి తినడం వల్ల శరీరానికి హాని కలుగుతుంది.
పెరుగు:
ఎలాంటి భోజనం తిన్నా చివరిలో పెరుగు అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇలా తినడాన్ని చాలా మంది ఇష్ట పడుతూ ఉంటారు. అలా చికెన్‌తో పాటు పెరుగు కూడా తింటారు. చికెన్ తిన్న తర్వాత పెరుగు తింటే.. జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)








