Uric Acid: యూరిక్‌ యాసిడ్‌తో బాధపడేవారు ఈ ఆహారాలు తప్పక తీసుకోవాలి.. ఎందుకో తెల్సా!

కాలి మడమలు ఒక్కోసారి విపరీతంగా నొప్పి పెడుతుంటాయి. దీంతో నేలపై కాలు పెట్టలేని పరిస్థితి వస్తుంది. అలాగే కాలి బొటనవేలులో కూడా విపరీతమైన నొప్పి కారణంగా వేళ్లను కదిలించాలంటే అల్లాడిపోతుంటారు. శరీరంలో కాల్షియం లోపం వల్ల ఇలా జరుగుతోందని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది శరీరంలో పోషకాల లోపం వల్ల తలెత్తదు. ఇది పెరిగిన యూరిక్ యాసిడ్ సంకేతం. మధుమేహం, కొలెస్ట్రాల్ మాదిరిగానే..

Uric Acid: యూరిక్‌ యాసిడ్‌తో బాధపడేవారు ఈ ఆహారాలు తప్పక తీసుకోవాలి.. ఎందుకో తెల్సా!
Uric Acid
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 03, 2024 | 9:23 PM

కాలి మడమలు ఒక్కోసారి విపరీతంగా నొప్పి పెడుతుంటాయి. దీంతో నేలపై కాలు పెట్టలేని పరిస్థితి వస్తుంది. అలాగే కాలి బొటనవేలులో కూడా విపరీతమైన నొప్పి కారణంగా వేళ్లను కదిలించాలంటే అల్లాడిపోతుంటారు. శరీరంలో కాల్షియం లోపం వల్ల ఇలా జరుగుతోందని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది శరీరంలో పోషకాల లోపం వల్ల తలెత్తదు. ఇది పెరిగిన యూరిక్ యాసిడ్ సంకేతం. మధుమేహం, కొలెస్ట్రాల్ మాదిరిగానే యూరిక్ యాసిడ్ సమస్యలు కూడా నేటి కాలంలో సర్వసాధారణం అవుతోంది. అనేక మంది శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి ఎక్కువగా పెరిగితే ఆహారంలో పప్పులు, టమోటా వంటివి తీసుకోవడం మానేస్తుంటారు. నిజానికి, యూరిక్ యాసిడ్ పెరిగితే కొన్ని ఆహారాలు తప్ప మిగిలిన అన్ని ఆహారాలు పరిమిత పరిమాణంలో తినవచ్చు. సాధారణంగా యూరిక్ యాసిడ్ పెరిగితే రెడ్ మీట్, ఆల్కహాల్, ఫాస్ట్ ఫుడ్ వంటివి తీసుకోకూడదు. ఇవికాకుండా ఎలాంటి ఆహారాలు తినవచ్చో నిపుణుల మాటల్లో మీకోసం..

విటమిన్ సి

ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరం నుంచి అదనపు యూరిక్ యాసిడ్‌ను బయటకు పంపడంలో సహాయపడుతుంది. సిట్రస్ ఫ్రూట్ జ్యూస్, బెర్రీస్ తినడం వల్ల శరీరంలో విటమిన్ సి తగినంత మొత్తంలో అందుతుంది. ఫలితంగా యూరిక్ యాసిడ్ సమస్య నుంచి త్వరగా విముక్తి పొందవచ్చు.

కొవ్వు పాలు

‘పూర్తి క్రీమ్’ లేదా ‘పూర్తి కొవ్వు’ ఉన్న పాలు, పాల ఉత్పత్తులను తీసుకోవాలి. ‘డబుల్ టోన్డ్’ లేదా ‘స్కిమ్డ్’ మిల్క్ తీసుకోవడం యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గిస్తుంది. ఈ పాలతో చేసిన పెరుగు తినవచ్చు. పెరుగు, మజ్జిగ కూడా సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. గౌట్ నొప్పిని తగ్గించుకోవడానికి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి. చియా విత్తనాలు, వాల్‌నట్స్, సీఫుడ్‌లలో ఈ పోషకం అధికంగా ఉంటుంది. పాంఫ్రెట్, హిల్సా వంటి సముద్రపు చేపలు తినవచ్చు. అయితే ట్యూనా, ట్రౌట్ లాగా చేపట్లో యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచే ప్యూరిన్‌లు ఉంటాయి. వీటికి దూరంగా ఉండాలి.

ఫైబర్ పుష్కలంగా ఉండే ఆహారాలు

పీచుతో కూడిన ఆహారాలు యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఓట్స్, బ్రౌన్ రైస్, గ్రీన్ వెజిటేబుల్స్ లో ఫైబర్ ఉంటుంది.

వెజిటబుల్ ప్రోటీన్

యూరిక్ యాసిడ్ అధికంగా ఉన్నందున ప్రోటీన్ తినడం పూర్తిగా మానేయకూడదు. జంతు ప్రోటీన్‌కు బదులుగా కూరగాయల ప్రోటీన్‌ను ఎంచుకోవాలి. కూరగాయలతో పాటు వివిధ రకాల పప్పులు, గింజలు, పెరుగు మొదలైన వాటిని తినవచ్చు.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.