Sweet Corn: స్వీట్‌కార్న్ కనిపిస్తే ఆలోచించకుండా తినేయండి.. లేకుంటే ఇవి మిస్ అవుతారు!

ఎక్కడైనా బయటకు షాపింగ్‌కి, వాకింగ్‌కి, షికారుకు వెళ్తే బయట ఖచ్చితంగా కనిపించే వాటిల్లో స్వీట్ కార్న్ కూడా ఒకటి. స్వీట్ కార్న్ అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ల దాకా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. అందులోనూ ఇప్పుడ వర్షాకాలం. ఈ సీజన్‌లో స్వీట్ కార్న్ చాలా ఎక్కువగా దొరకుతుంది. చల్లని వర్షంలో పొగలు కక్కే స్వీట్ కార్న్ తింటే ఆహా అనిపిస్తుంది. చిన్న చిన్న కప్పులో వేసి ఇస్తార. వీటి ధర కూడా ఎక్కవే. దీంతో కొంత మంది తింటే..

Sweet Corn: స్వీట్‌కార్న్ కనిపిస్తే ఆలోచించకుండా తినేయండి.. లేకుంటే ఇవి మిస్ అవుతారు!
Sweet Corn
Follow us

|

Updated on: Jun 27, 2024 | 6:28 PM

ఎక్కడైనా బయటకు షాపింగ్‌కి, వాకింగ్‌కి, షికారుకు వెళ్తే బయట ఖచ్చితంగా కనిపించే వాటిల్లో స్వీట్ కార్న్ కూడా ఒకటి. స్వీట్ కార్న్ అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ల దాకా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. అందులోనూ ఇప్పుడ వర్షాకాలం. ఈ సీజన్‌లో స్వీట్ కార్న్ చాలా ఎక్కువగా దొరకుతుంది. చల్లని వర్షంలో పొగలు కక్కే స్వీట్ కార్న్ తింటే ఆహా అనిపిస్తుంది. చిన్న చిన్న కప్పులో వేసి ఇస్తార. వీటి ధర కూడా ఎక్కవే. దీంతో కొంత మంది తింటే.. మరికొంత మంది తినరు. అలా కాకుండా హాయిగా ఇంట్లో ఒక పొత్తు తెచ్చుకుని ఉడికించారంటే.. హ్యాపీగా ముగ్గురు, నలుగురు తినేయవచ్చు. అయితే ఈ స్వీట్ కార్న్ కేవలం చిరు తిండిగా మాత్రమే అనుకుంటే పొరపాటే. ఈ స్వీట్ కార్న్‌తో చెప్పలేనన్ని లాభాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

ఫోలేట్ అధికం:

స్వీట్‌ కార్న్‌లో ఫోలేట్ అధికంగా ఉంటుంది. ఈ ఫోలేట్ పోషకం ఎక్కడ పడితే అక్కడ లభించదు. ఇది గర్భిణీలకు ఎంతో మేలు చేస్తుంది. ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అయ్యేందుకు ఎంతో హెల్ప్ చేస్తుంది. కడుపులో ఉండే శిశువు ఎదుగుదలకు ఈ ఫోలేట్ ఎంతో ఉపయోగ పడుతుంది. కాబట్టి గర్భిణీలు వీటిని ప్రతి రోజూ తింటే చాలా మంచిది.

ఫైబర్:

స్వీట్ కార్న్‌లో ఫోలేట్ తర్వాత అధికంగా లభించేది ఫైబర్. ఇందులో కరిగే ఫైబర్, కరగని ఫైబర్ రెండూ ఉంటాయి. కాబట్టి ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచిది. అంతే కాకుండా శరీరంలోని కొలెస్ట్రాల్ లెవల్స్‌ను కరిగిస్తుంది. జీర్ణ క్రియని మెరుగు పరిచి మల బద్ధకాన్ని నివారిస్తుంది. కడుపు సమస్యలు కూడా దూరం అవుతుంది. అంతే కాకుండా కడుపులో మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు హెల్ప్ చేస్తుంది.

ఇవి కూడా చదవండి

విటమిన్లు అధికం:

స్వీట్ కార్న్‌లో విటమిన్లు అధికంగా లభిస్తాయి. బి1, బి3, బి9 వంటివి లభిస్తాయి. ఇవి శరీరంలో మెటబాలిజం రేటును పెంచుతుంది. అంతే కాకుండా నాడీ మండల వ్యవస్థ పని తీరు మెరుగు పడుతుంది. బ్రెయిన్ యాక్టివ్‌గా పని చేసేలా చేస్తుంది. చిన్న పిల్లలకు స్వీట్ కార్న్ సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు.

చర్మ ఆరోగ్యం:

స్వీట్ కార్న్ తినడం వల్ల చర్మ ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. ఇందులో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు. చర్మాన్ని అందంగా మార్చుతాయి. వృద్ధాప్య ఛాయలను కూడా దరి చేరనివ్వదు. కంటి ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. బీపీని తగ్గించి.. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..