AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bluecon Flowers: వర్షం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ జర్మనీ పువ్వు సాగుని ట్రై చేయండి.. మార్కెట్ లో కిలో. 2000

ఇప్పుడు బుందేల్ ఖండ్ ప్రాంతంలో రైతులు కూడా బ్లూకాన్ ఫ్లవర్‌ సాగుని ప్రారంభించారు.ఈ పువ్వు ప్రత్యేకత ఏమిటంటే ఈ పంటకు తక్కువ నీరు చాలు.. పెద్దగా నీరు పారుదల సదుపాయం అవసరం లేదు. దీంతో ఈ బ్లూకాన్ ఫ్లవర్‌ సాగుని కరువు పీడిత ప్రాంతాల్లో కూడా చేయవచ్చు. జర్మనీలోని పొడి ప్రాంతాల్లో బ్లూకాన్ ఫ్లవర్‌ పెరగడానికి ఇదే కారణం.

Bluecon Flowers: వర్షం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ జర్మనీ పువ్వు సాగుని ట్రై చేయండి.. మార్కెట్ లో కిలో. 2000
Blue Cornflower
Surya Kala
|

Updated on: Sep 23, 2023 | 2:46 PM

Share

ఉత్తరప్రదేశ్‌లోని బుదేల్‌ఖండ్ పేరు వినగానే ప్రజలకు ముందుగా గుర్తుకు వచ్చేది కరువు పీడిత ప్రాంతం. ఎందుకంటే బుదేల్‌ఖండ్ ప్రాంతంలో నీటి కొరత చాలా ఉంది. రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోలిస్తే ఇక్కడ వర్షపాతం కూడా చాలా తక్కువ. ఇటువంటి వాతావరణ పరిస్థితుల వలన ఇక్కడి రైతులు మొక్కజొన్న, మినుము వంటి ముతక ధాన్యాలను ఎక్కువగా సాగు చేస్తారు. రైతులకు తక్కువ ఆదాయం వస్తుంది. అయితే ఇప్పుడు ఇక్కడి రైతులు తమ ఆలోచనలకూ పదును పెట్టారు. వ్యవసాయంలో ఆధునికతను జోడించి ఇతర రాష్ట్రాల రైతుల మాదిరిగానే ఆధునిక పంటలను సాగు చేస్తున్నారు. ముఖ్యంగా స్థానికంగా రైతులు ఇప్పుడు ఉద్యానవనంపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. దీంతో రైతుల ఆదాయం పెరిగింది.

వాస్తవానికి బుదేల్‌ఖండ్ ప్రాంతంలోని రైతులు ఇప్పుడు బ్లూకాన్ ఫ్లవర్‌ను సాగు చేస్తున్నారు. ఈ పుష్పం విదేశాల్లో మాత్రమే లభ్యమయ్యేది. ఇంకా చెప్పాలంటే బ్లూకాన్ ఫ్లవర్‌ సాగునీ జర్మనీలో మాత్రమే చేస్తారు.  అయితే ఇప్పుడు బుందేల్ ఖండ్ ప్రాంతంలో రైతులు కూడా బ్లూకాన్ ఫ్లవర్‌ సాగుని ప్రారంభించారు.

బ్లూకాన్ ఫ్లవర్‌ స్పెషాలిటీ ఏమిటంటే

ఈ పువ్వు ప్రత్యేకత ఏమిటంటే ఈ పంటకు తక్కువ నీరు చాలు.. పెద్దగా నీరు పారుదల సదుపాయం  అవసరం లేదు. దీంతో ఈ బ్లూకాన్ ఫ్లవర్‌ సాగుని కరువు పీడిత ప్రాంతాల్లో కూడా చేయవచ్చు. జర్మనీలోని పొడి ప్రాంతాల్లో బ్లూకాన్ ఫ్లవర్‌ పెరగడానికి ఇదే కారణం.

ఇవి కూడా చదవండి

బ్లూకాన్ ఫ్లవర్ కిలో రూ. 2000

ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వర్షం తక్కువగా కురిసే బుందేల్‌ఖండ్ , ఝాన్సీల్లో బ్లూకాన్ ఫ్లవర్‌ సాగును ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం బ్లూకాన్ పూల సాగుకు ఇక్కడి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అదే సమయంలో ఈ పూల కోసం వ్యవసాయ శాఖ నర్సరీని సిద్ధం చేసింది. అంతేకాదు ప్రభుత్వం సాగు కోసం రైతులకు మొక్కలను పంపిణీ చేస్తోంది. బ్లూకాన్ పువ్వులు మార్కెట్‌లో కిలో రూ.2000లకు లభిస్తున్నాయి.

రూ. 9 లక్షల సంపాదన

విశేషమేమిటంటే ఒక్క బిగాలో సాగు చేస్తే రోజుకు 15 కిలోల వరకు పువ్వులు కోతకు వస్తాయి. అంటే ఎవరైనా  ఒక బిగా భూమిలో ఈ పువ్వులను సాగు చేస్తే రోజుకు రూ.30,000 సంపాదించవచ్చు. ఈ  పూలు అమ్మడం ద్వారా రైతు సోదరులు నెలలో రూ.9 లక్షల ఆదాయం పొందవచ్చని ఉద్యావన అధికారులు చెబుతున్నారు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..