మీకు గోళ్లు కొరికే అలవాటు ఉందా.. ఈ 3 ప్రమాదకరమైన రోగాలు రావడం పక్కా.. వెంటనే..
చాలా మందికి గోళ్లు కొరికే అలవాటు ఉంటుంది. పనిలో బిజీగా ఉన్నప్పుడు, ఆందోళన చెందుతున్నప్పుడు లేదా ఆలోచిస్తున్నప్పుడు తెలియకుండానే గోళ్లు కొరుకుతారు. కానీ అది వారి ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తుంది. ఇది వ్యాధులకు కూడా కారణమవుతుంది. దీన్ని వల్ల ఎటువంటి వ్యాధులు వస్తాయనేది తెలుసకుందాం..

చాలా మందిలో తరచుగా కనిపించే ఒక అలవాటు గోళ్లు కొరకడం. ఆలోచిస్తున్నప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు లేదా ఒత్తిడికి గురైనప్పుడు తెలియకుండానే చాలా మంది తమ గోళ్లను కొరుకుతూ ఉంటారు. ఇది పిల్లల నుండి పెద్దల వరకు అందరిలోనూ సాధారణమే అయినా ఈ అలవాటు ఆరోగ్యానికి, దంతాలకు చాలా హానికరం.
గోళ్లు ఎందుకు కొరుకుతారు..?
గోళ్లు కొరకడానికి గల కారణాలు ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయి. అయితే ఒత్తిడి లేదా ఆందోళన వంటి భావోద్వేగాలను నియంత్రించుకోవడానికి ఈ అలవాటు కొంతమందికి సహాయపడుతుందని ఒక సిద్ధాంతం చెబుతోంది. ఏదేమైనా ఇది అనారోగ్యకరమైన అలవాటు. ఇది మీ ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.
గోళ్లు కొరకడం వల్ల కలిగే 3 ప్రధాన ఆరోగ్య సమస్యలు
దంత క్షయం – ఎనామిల్ నష్టం
అమెరికన్ డెంటల్ అసోసియేషన్ ప్రకారం.. గోళ్లు కొరకడం వల్ల దంతాలు త్వరగా అరిగిపోతాయి. ముఖ్యంగా బ్రేస్‌లు ఉన్నవారిలో ఇది దంతక్షయానికి దారి స్తుంది. ఈ అలవాటు దంతాల పైపొర అయిన ఎనామిల్‌ను కూడా దెబ్బతీస్తుంది.
బ్రక్సిజం
గోళ్లు కొరికే వారికి బ్రక్సిజం అనే పరిస్థితి వచ్చే ప్రమాదం ఎక్కువ. నిద్రలో లేదా తెలియకుండానే దంతాలను ఒకదానిపై ఒకటి గట్టిగా గ్రైండ్ చేయడాన్ని బ్రక్సిజం అంటారు. ఈ అలవాటు వల్ల తలనొప్పి, ముఖ నొప్పి, దంతాల సున్నితత్వం పెరగడం వంటి సమస్యలు వస్తాయి.
బాక్టీరియా – ఇన్ఫెక్షన్లు
గోళ్ల కింద ప్రమాదకరమైన బాక్టీరియా ఉంటుంది. గోళ్లు కొరికినప్పుడు, ఈ బ్యాక్టీరియా వేళ్ల నుండి నేరుగా నోటిలోకి, ఆపై ప్రేగులలోకి ప్రయాణించి తీవ్రమైన అనారోగ్యాలకు దారి తీస్తుంది. ఈ అలవాటు ఉన్నవారికి పరోనిచియా అనే ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం కూడా ఎక్కువ. దీని వల్ల వేళ్ల చుట్టూ వాపు, చీము పేరుకుపోవడం జరుగుతుంది.
గోళ్లు కొరికే అలవాటును ఎలా మానుకోవాలి..?
ఈ హానికరమైన అలవాటును మానుకోవడానికి నిపుణులు చెప్పిన సులభమైన మార్గాలు ఇక్కడ ఉన్నాయి
గోళ్లను చిన్నగా ఉంచండి: గోళ్లను తరచుగా కత్తిరించి, చిన్నగా ఉండేలా చూసుకుంటే కొరకడానికి వీలుండదు.
నెయిల్ పాలిష్ : మహిళలైతే నెయిల్ పాలిష్ వేయడం వల్ల గోళ్లు కొరకకుండా సహాయపడుతుంది.
దృష్టి మరల్చండి: గోళ్లు కొరకాలని అనిపించిన ప్రతిసారీ, వెంటనే మీ మనస్సును వేరే దానిపైకి మళ్లించండి. అప్పుడు ఈ ఆలోచన పోతుంది.
ఈ చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా గోళ్లు కొరికే అలవాటును పూర్తిగా మానుకోవచ్చు. తద్వారా అనారోగ్య సమస్యల నుండి రక్షణ పొందవచ్చు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్య రీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




