Pickles: మీకు అత్యంత ఇష్టమైన ఊరగాయలతో ఆ రెండు అవయవాలు హాంఫట్..
మామిడి, నిమ్మ, అల్లం, మిరపకాయలు వంటి వివిధ రకాల ఊరగాయలు మార్కెట్‌లో లభిస్తాయి. వీటి తయారీలో వాడే సుగంధ ద్రవ్యాలు అదనపు రుచి ఇస్తాయి. కిణ్వ ప్రక్రియ ద్వారా తయారైన ఊరగాయలు పేగుల ఆరోగ్యానికి మంచివే. కానీ వీటి వల్ల మీరు ఊహించలేని డేంజర్ ఉంది. వీటిని అతిగా తినడం వల్ల శరీరంలో రెండు ముఖ్యమైన అవయవాలను కోల్పోయే ప్రమాదం ఉందని మీకు తెలుసా? అసలు హెల్తీ ఊరగాయలు ఎలా చేయాలో ఈ టిప్స్ ద్వారా తెలుసుకోండి..

మన దేశంలో భోజనంతో పాటు ఊరగాయలు తినేవారు చాలా మంది ఉన్నారు. మామిడి, నిమ్మ, అల్లం నుంచి చికెన్, చేపల వరకు అనేక రకాల ఊరగాయలను తయారు చేస్తారు. వీటిలో ఉపయోగించే సుగంధ ద్రవ్యాలు, కిణ్వ ప్రక్రియ (Fermentation) ద్వారా ఏర్పడే రుచి పేగులకు ఆరోగ్యకరమైనదే. అయితే, ఊరగాయలను నిల్వ ఉంచేందుకు ఇందులో ఎక్కువ ఉప్పు, నూనె వాడతారు. పోషకాహార నిపుణురాలు శిల్పా అరోరా ప్రకారం, ఊరగాయలలోని అధిక ఉప్పు, నూనె గుండె, కాలేయంతో పాటు మొత్తం ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. వాటిని క్రమం తప్పకుండా తీసుకునేవారు ఈ ఆరోగ్య విషయాలు తప్పక తెలుసుకోవాలి.
అయినా ప్రమాదం ఎందుకు?
ఊరగాయలలో ఎక్కువ పరిమాణంలో ఉప్పు, నూనెలు కలుపుతారు.
అధిక ఉప్పు (సోడియం): ఉప్పులో ఉండే అధిక సోడియం శరీరానికి హాని చేస్తుంది. ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలు గుండెకు హానికరం. అవి అధిక రక్తపోటు, వాపునకు కారణం అవుతాయి.
చెడు కొవ్వులు (నూనె): ఊరగాయలలో వాడే నూనెలో హైడ్రోజనేటెడ్ కొవ్వులు, ట్రాన్స్ ఫ్యాట్స్ లాంటి చెడు కొవ్వులు ఉంటాయి. పోషకాహార నిపుణురాలు శిల్పా అరోరా హెచ్చరిస్తూ, నూనెలో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ గుండె జబ్బులు, ఊబకాయం వంటి వివిధ సమస్యలకు దారితీస్తాయి అంటారు. నాణ్యత లేని నూనె వాడితే, అందులోని ట్రాన్స్ ఫ్యాట్స్ కాలేయానికి హాని కలిగిస్తాయి.
జీర్ణ వ్యవస్థ చికాకు: ఊరగాయలలో కలిపే మసాలాలు జీర్ణవ్యవస్థను చికాకుపరిచే అవకాశం ఉంది.
ఆరోగ్యకరమైన ఊరగాయ తయారీ:
శిల్పా అరోరా, శరీరానికి మేలు చేసే విధంగా ఊరగాయలు ఎలా తయారు చేయాలో వివరించారు. ఆవనూనె, సుగంధ ద్రవ్యాలను సరైన నిష్పత్తిలో కలిపి ఊరగాయలు తయారు చేస్తే, పేగులకు మంచిది. ఊరగాయకు జోడించే పదార్థాలను జాగ్రత్తగా ఎంచుకోవాలి. కిణ్వ ప్రక్రియ కూడా సరైన విధంగా చేయాలి. అయితే, ఊరగాయలను తక్కువ పరిమాణంలో తీసుకోవడం వలన అనవసరమైన ప్రమాదాల నుంచి రక్షణ పొందవచ్చని ఆమె సూచించారు.
గమనిక: ఈ కథనంలో తెలిపిన ఆరోగ్య సమాచారం పోషకాహార నిపుణురాలు అందించిన సాధారణ సలహాలు మాత్రమే. మీరు ఏదైనా నిర్దిష్ట ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే లేదా ఆహార నియమాలలో ముఖ్యమైన మార్పులు చేయాలనుకుంటే, తప్పనిసరిగా వైద్య నిపుణుడిని సంప్రదించాలి.




