10 Storey Building: మరో ఘనత సాధించిన డ్రాగన్ కంట్రీ.. కొన్ని గంటల్లోనే 10 అంతస్థుల భవన నిర్మాణం వీడియో వైరల్

10 Storey Building: ఒక భవనాన్ని నిర్మించడానికి కొన్ని నెలలు సమయం పడితే.. అదే పది అంతస్థుల బిల్డింగ్ ను నిర్మించాలంటే ఎంత సమయం..

10 Storey Building: మరో ఘనత సాధించిన డ్రాగన్ కంట్రీ.. కొన్ని గంటల్లోనే 10 అంతస్థుల భవన నిర్మాణం వీడియో వైరల్
10 Storey Building
Follow us

|

Updated on: Jun 20, 2021 | 1:39 PM

10 Storey Building: ఒక భవనాన్ని నిర్మించడానికి కొన్ని నెలలు సమయం పడితే.. అదే పది అంతస్థుల బిల్డింగ్ ను నిర్మించాలంటే ఎంత సమయం పడుతుంది.. ఎన్ని ఏళ్ళు పడుతుంది.. నగదు అన్ని సదుపాయాలు ఉండి భవనాని కట్టే మేస్త్రీలు, కూలీలు, ఇంజనీర్లు ఇలా అందరూ ఎంతో కష్టపడి వేగంగా పనిచేస్తే ఒక మూడేళ్లు పడుతుందేమో… అదే పనిలో వేగం లేకపోయినా.. ఏవైనా అవరోధాలు ఏర్పడినా ఐదేళ్లు పడుతుంది పది అంతస్థుల భవనాన్ని నిర్మించడానికి.

అయితే ఓ పది అంతస్థుల బిల్డింగ్ ను తోటరాముడు సినిమాలో పాతాళ భైరవి నిర్మించినట్లు కొన్ని గంటల్లో నిర్మిస్తే.. అది అద్భుతం .. అందరికి ఆశ్చర్యాన్ని కలిగించే సంఘటన అవుతుంది. చరిత్రలో ఒక రికార్డ్ నిలిచిపోతోవుంది. అలాంటి ఓ 10 అంతస్థుల భవనాన్నిచైనాలో 28 గంటల్లో నిరించిచారు..

ప్రపంచంలో అతిపెద్ద శక్తివంతమైన కార్మికులను కలిగిన చైనా దేశంలో తక్కువ సమయంలో పెద్ద పెద్ద బిల్డింగ్లులను కట్టడం కొత్తమీ కాదు.. కరోనా సమయంలో 10 రోజులలోనే 1000 బెడ్ల హాస్పిటల్ ను నిర్మించారు.చైనాలోని నిర్మాణాలు ప్రపంచ వ్యాప్తంగా గొప్ప నిర్మాణాలను ఘనత వహించాయి.  అయితే ఇప్పుడు మరోసారి డ్రాగన్ కంట్రీ ఇంకో చారిత్రాత్మక కట్టడాన్ని నిర్మించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.  చైనాలోని బ్రాడ్ గ్రూప్ కంపెనీ ఓ గొప్ప రికార్డును నెలకొల్పింది.పది అంతస్థుల భవనాన్ని 28 గంటల్లో కట్టి సరికొత్త రికార్డ్ నెలకొల్పింది.

ఈ 10 బిల్డింగుల భవణం కట్టడానికి ఓ పెద్ద కంటైనర్ బాక్సును తెచ్చి దాని సాయంతో నిర్మించారు.ఆ బాక్సులను ఒకదానిపై మరోకటి పెట్టి భవనాన్ని తొందరగా కట్టేశారు.బాక్సులను పేర్చిన తర్వాత బొల్టును బిగించారు.ఆ తర్వాత వాటిలో వాటర్, కరెంటు సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఈ భవనం పూర్తి కావడానికి కేవలం 28 గంటల 45 నిమిషాలే పట్టింది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ బిల్డింగ్ ను నిర్మిస్తున్న వీడియో హల్ చల్ చేస్తోంది.

Also Read: గుర్తు పట్టలేనంతగా మారిపోయిన హాలీవుడ్ స్టార్ హీరో.. షాక్ తిన్న అభిమానులు