AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Mummy Hero : గుర్తు పట్టలేనంతగా మారిపోయిన హాలీవుడ్ స్టార్ హీరో.. షాక్ తిన్న అభిమానులు

Mummy Hero : వయసులో ఉన్నప్పుడు సిల్వర్ స్క్రీన్ పై అందంగా కనిపించిన తాము వయసు వచ్చిన తర్వాతగా తమ ఫ్యాన్స్ కు అంతే అందంగా కనిపించాలని చాలామంది నటీనటులు..

The Mummy Hero : గుర్తు పట్టలేనంతగా మారిపోయిన హాలీవుడ్ స్టార్ హీరో.. షాక్ తిన్న అభిమానులు
Mummy Brendan
Surya Kala
|

Updated on: Jun 20, 2021 | 1:01 PM

Share

Mummy Hero : వయసులో ఉన్నప్పుడు సిల్వర్ స్క్రీన్ పై అందంగా కనిపించిన తాము వయసు వచ్చిన తర్వాతగా తమ ఫ్యాన్స్ కు అంతే అందంగా కనిపించాలని చాలామంది నటీనటులు కోరుకుంటారు. అందుకు తగ్గట్లుగా మేకప్ వేసుకుని బయటకు వస్తారు.. అయితే కొంతమంది హీరో, హీరోయిన్లు అందుకు భిన్నం.. వయసుతో వచ్చిన శారీరక మార్పులను అంగీకరిస్తారు.. అలా ప్రేక్షకుల ముందుకు వస్తారు. తాజాగా హాలీవుడ్ స్టార్ హీరో ను చూసి కంగు తిన్నారు. ముందుగా అతనిని గుర్తు పట్టలేదు కూడా..

సినిమాల్లో తన క్యారెక్టర్ లో ఒదిగి పోయి నటించే హీరోల్లో ఒకరుగా హాలీవుడ్‌ నటుడు బ్రెండన్‌ ఫ్రాజర్‌ పేరు తెచ్చుకున్నారు. మమ్మీ సిరీస్‌ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడు ఈ హీరో. అయితే ప్రస్తుతం బ్రెండన్‌ ఫ్రాజర్‌ గుర్తుపట్టలేనంతలా మారిపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

జార్జ్‌ ఆఫ్‌ ది జంగిల్‌, మమ్మీ, బ్రేక్‌ అవుట్‌ లాంటి సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్నాడు. తన నటనతో అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఈ 52 ఏళ్ల ఈ హాలీవుడ్‌ స్టార్‌ శుక్రవారం రాత్రి న్యూయార్క్‌లో జరిగిన ట్రైబెకా ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ‘నో సడన్‌ మూవ్‌’ ప్రత్యేక ప్రదర్శనకు హాజరయ్యాడు.

ఐతే బ్రెండన్‌ ఫ్రాజర్‌ గుర్తు పట్టలేనట్లుగా మారిపోవడంతో అక్కడ ఉన్న ఫొటోగ్రాఫర్లు ఆయనెవరో అనుకుని చాలాసేపు పట్టించుకోలేదు. చివరికి.. నటుడు డాన్‌ చెడల్‌ ఆయన దగ్గరికి రావడంతో.. అప్పుడు విషయం తెలుసుకుని ఫ్రాజర్‌ను క్లిక్‌ మనిపించారు.బ్రెండన్‌ ఫ్రాజర్‌ ఇప్పుడు ఇలా మారిపోవడానికి కారణం అనేక ఆరోగ్య సమస్యలతో పాటు.. గతంలో చేయించుకున్న ఆపరేషన్స్ అని తెలుస్తోంది.

ప్రస్తుతం ఆయన ‘ది వేల్‌’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రాజార్ ది కూతురికి దగ్గరవ్వాలని ప్రయత్నించే తండ్రి పాత్ర. . తన పార్ట్‌నర్‌ చనిపోయాక ఈటింగ్‌ డిజార్డర్‌తో బాధపడే ఛార్లీ పాత్రలో ఫ్రాజర్‌ కనిపించబోతున్నాడు.

Also Read: లాక్ డౌన్ సమయంలో పొలం బాటపట్టిన బాలీవుడ్ నటుడు.. పంట పండేవరకూ ఇక్కడే అంటూ..