పోలీసులు చూస్తుండగానే షాప్ లోకి సైకిల్ పైన వచ్చి దర్జాగా దోచుకెళ్ళాడు…!! ( వీడియో )

అమెరికాలో ఇక చిన్న చిన్న దొంగతనాలను నేరంగా పరిగణించబోరు…అంటే ఇలాంటివాటిని డీక్రిమినలైజ్ చేసేశారు. కానీ వీటికీ ఓ లిమిట్ అంటూ ఉందట..

  • Publish Date - 11:58 am, Sun, 20 June 21

అమెరికాలో ఇక చిన్న చిన్న దొంగతనాలను నేరంగా పరిగణించబోరు…అంటే ఇలాంటివాటిని డీక్రిమినలైజ్ చేసేశారు. కానీ వీటికీ ఓ లిమిట్ అంటూ ఉందట.. 900 డాలర్ల కన్నా తక్కువ విలువైన వస్తువులను ఎవరైనా చోరీ చేసినా పోలీసులు ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోతారు. వాళ్ళను పట్టుకోరు.. శిక్షించబోరు….ఇంకేం ! ప్రజలకు పండగే ! శాన్ ఫ్రాన్సిస్కో లోని ఓ షాపులో చొరబడి తమకు నచ్చిన సరకులను ‘దొంగిలించుకుని’ పోతున్న వారిని మనం చూడవచ్చు.. ఓపెన్ గా చేస్తున్న ఈ చోరీలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. కానీ 900 లేదా 950 డాలర్ల కన్నా ఎక్కువ విలువ చేసే వస్తువులను దొంగిలిస్తే మాత్రం… అది నేరమే అవుతుంది. ఇప్పుడు ఈ చట్టం ఎలా తెచ్చారో గానీ షాపుల యజమానులు మాత్రం లబోదిబో మంటున్నారు. ఒక్కసారిగా అయిదారుగురో లేదా అంతకంటే ఎక్కువమందో తమ స్టోర్స్ లోకి చొరబడి ఇలా చేస్తే క్షణాల్లో తమ షాపులు ఖాళీ అయిపోతాయని వారు వాపోతున్నారు. 

మరిన్ని ఇక్కడ చూడండి: Water Dogs : ఉప్పలపాడులో అనుకోని అతిథులు.. చెరువులో సందడి చేస్తున్న నీటి కుక్కలు.. ( వీడియో )

Helmet: మెదడును చదివే హెల్మెట్‌ వచ్చేసింది.. అభివృద్ధి చేసిన అమెరికాకు చెందిన కెర్నల్‌ సంస్థ.. ( వీడియో )