అత్యంత రుచికరమైన 800 కిలోల అరుదైన చేప.. ధర 20 లక్షల పైనే..!
పశ్చిమ బెంగాల్‌లోని దిఘాలో 800 కిలోల బరువున్న చిల్‌శంకర్ చేప పట్టుబడింది. ఇది అత్యంత రుచికరమైన పదార్థంగా పేర్కొనబడింది. మత్స్యకారులు చేపలు పడుతుండగా వలకు ఈ చేప చిక్కుకోవడంతో

Rare Chilshankar fish: పశ్చిమ బెంగాల్‌లోని దిఘాలో 800 కిలోల బరువున్న చిల్‌శంకర్ చేప పట్టుబడింది. ఇది అత్యంత రుచికరమైన పదార్థంగా పేర్కొనబడింది. మత్స్యకారులు చేపలు పడుతుండగా వలకు ఈ చేప చిక్కుకోవడంతో వారంతా షాక్ అయినా, తర్వాత వారి ఆనందానికి అవధుల్లేవు. ఈ చేప చాలా అరుదైనది. మత్స్యకారులే ఇప్పటివరకు చూడలేదు. ఒరిస్సాకు చెందిన ఒక వ్యక్తి యాజమాన్యంలోని ట్రాలర్‌లో ఈ చేప పట్టుబడింది. దీన్ని చూడ్డానికి ప్రజలు, స్థానిక పర్యాటకులు గుమిగూడారు.
దీన్ని మార్కెట్‌కు తీసుకెళ్లడానికి తాళ్లను ఉపయోగించారు. కిలోకు రూ. 2100 చొప్పున వేలం వేశారు. అంటే చేప మొత్తం ధర రూ. 20 లక్షల పైమాటే! అక్కడ స్థానిక మత్స్యకారుడు అజిరుల్ మాట్లాడుతూ ఇంత పెద్ద అరుదైన చేపలను మనం ఎప్పుడూ చూడలేదని చెప్పుకొచ్చారు. ఈ చేప స్కిన్, ఆయిల్‌ను ఔషధాల తయారీకి ఉపయోగిస్తారు.
Read More:
గుడ్ న్యూస్: సప్లిమెంటరీ, బ్యాక్‌లాగ్ విద్యార్థులకు పాస్ మార్కులు..
గుడ్ న్యూస్: ఇక కామర్స్, ఆర్ట్స్ విద్యార్థులకూ ‘గేట్’ రాసే అవకాశం..!