తమిళనాడులో కొత్తగా 6,993 పాజిటివ్ కేసులు
తమిళనాడులో కరోనా కరాళనృత్యం కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకీ పెరుగుతున్న కేసులు మరింత ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,993 మందికి కరోనా వైరస్ సోకినట్లు అధికారులు నిర్ధారించారు.

తమిళనాడులో కరోనా కరాళనృత్యం కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకీ పెరుగుతున్న కేసులు మరింత ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,993 మందికి కరోనా వైరస్ సోకినట్లు అధికారులు నిర్ధారించారు. సోమవారం మరో 77 మంది కొవిడ్ బారినపడి మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు తమిళనాడులో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 2,20,716కు చేరుకుంది. మరోవైపు కరోను జయించి ఇవాళ 5,723 మంది డిశ్చార్జ్ కాగా, ఇక ఇప్పటివరకు 1,62,249 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు మొత్తంగా మరణాల సంఖ్య 3571 గా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ 61,342 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తమిళనాడు వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. కేవలం ఒక్క చెన్నైలోనే అత్యధిక పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో చెన్నైలో 1,138 కేసులు నమోదయ్యాయి.
