Andhra: వాస్తు సరిగా లేదని ఇంట్లోకి వచ్చారు.. కట్ చేస్తే, ఆమె చూస్తుండగానే పని కానిచ్చారు..
ఆధునిక ప్రపంచం.. రోజు రోజుకి టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్నా.. ఇంకా ప్రజలు వాస్తు, జాతకాలపై విశ్వాసాన్ని వీడటం లేదు.. అంతేకాకుండా.. మూఢ నమ్మకాలతో నిత్యం మోసపోతూనే ఉన్నారు. అయితే ఇలాంటి వారి అమాయకత్వాన్ని ఎప్పటికప్పుడు క్యాష్ చేసుకుంటున్నారు కొందరు కేటు గాళ్ళు..

ఆధునిక ప్రపంచం.. రోజు రోజుకి టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్నా.. ఇంకా ప్రజలు వాస్తు, జాతకాలపై విశ్వాసాన్ని వీడటం లేదు.. అంతేకాకుండా.. మూఢ నమ్మకాలతో నిత్యం మోసపోతూనే ఉన్నారు. అయితే ఇలాంటి వారి అమాయకత్వాన్ని ఎప్పటికప్పుడు క్యాష్ చేసుకుంటున్నారు కొందరు కేటు గాళ్ళు.. జాతకాలు, ఇంటి వాస్తు పేరుతో ప్రజలను బురిడీ కొట్టించే వారిని ఇప్పటి వరకు చూసుంటాం.. కానీ నెల్లూరు జిల్లాలో ఇంటి వాస్తు బాగాలేదని సరి చేసుకోవాలని ఇంటి లోపలికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు.. వాస్తు సంగతి పక్కన పెట్టి ఇంటిలోని బంగారు నగలు, నగదుతో ఉడాయించారు. చోరీ విషయం ఆలస్యంగా తెలుసుకున్న భాదితులు పోలీసులను ఆశ్రయించారు.
వాస్తు పేరుతో ఇంట్లోకి వచ్చి ఇంటిలోని 15 లక్షల విలువైన బంగారు నగలు, రూ 50 వేల నగదు దోచుకెళ్లిన ఘటన నెల్లూరు జిల్లా వింజమురు మండలం ఎర్రబల్లి పాలెంలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఎర్రబల్లి పాలెం లో సౌభాగ్యమ్మ అనే మహిళ టిఫిన్ షాపు నిర్వహిస్తుంది.
గత మూడు రోజుల క్రితం సౌభాగ్యమ్మ ఇంటి వద్దకి ఇద్దరు వ్యక్తులు షిఫ్ట్ కారులో వచ్చారు. ఇంటిని చూస్తూ ఇంటిలోపల వాస్తు బాగాలేదని చిన్నపాటి లోపాలు సరిచేసుకోవాలి అన్నారు. దీంతో కేటుగాళ్ల మాటలు నమ్మిన సౌభాగ్యమ్మ కేటుగాళ్లను ఇంటిలోకి తీసుకువెళ్లింది.. అయితే ఇంటి పక్కన మహిళలు సైతం ఆసక్తిగా సౌభాగ్యమ్మ ఇంటి వద్దకు వచ్చారు. అయితే వాస్తు చూసే సమయంలో పక్కన ఎవరు ఉండకూడదు.. అంటూ పక్కన ఇంటి మహిళలను పంపించి వేశారు.
దీంతో మహిళలు వెళ్ళగానే ఒకరు కింద ఇంట్లో వాస్తు చూస్తుండగా.. మరొక వ్యక్తి మిద్దె మీదకు వెళ్లి బీరువాలోని 11 సవర్ల నగలు, రూ 50 వేల డబ్బు తీసుకుని కిందకు వచ్చాడు. చిన్న మార్పులు చెప్పిన ఇద్దరు కేటుగాళ్ల అక్కడి నుంచి ఉడాయించారు.
నిన్న సాయంత్రం టిఫిన్ షాపు సరుకుల కొనుగోలుకి నగదు అవసరం వచ్చి సౌభాగ్యమ్మ పైకి వెళ్లి బీరువాలో చూడగా నివ్వెరపోయింది. వాస్తు చెప్పేందుకు వచ్చిన వారు చోరీ చేశారని గ్రహించిన సౌభాగ్యమ్మ చివరికి పోలీసులను ఆశ్రయించింది.
భాదితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సౌభాగ్యమ్మ ఇంటి తో పాటు పట్టణంలోని మరి కొన్ని ప్రాంతాల్లో వాస్తు కేటుగాళ్ల తిరిగారని తెలుసుకుని సీసీ కెమెరాల ఆధారంగా కారును గుర్తించే పనిలో పడ్డారు. కాగా.. ఈ ఘటన సంచలనంగా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
