Free Bus Scheme: త్వరలో పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం.. వీరికి అవకాశం.. ఎప్పటినుంచంటే..?
మహిళలకే కాదు.. త్వరలో తెలుగు రాష్ట్రాల్లో పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం అందుబాటులోకి రానుంది. అవును.. ఈ దిశగా ప్రభుత్వాలు ముందడుగు వేస్తున్నారు. దివ్యాంగులకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పించేందుకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు సిద్దమవుతున్నాయి. త్వరలోనే ఇది మనం చూడవచ్చు.

ప్రస్తుతం తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణలో మహాలక్ష్మి పేరుతో ఈ పథకం అమలు అవుతుండగా.. ఏపీలో స్త్రీ శక్తి పేరుతో అమవుతోంది. ఇందుకోసం మహిళలు ఆధార్ కార్డు చూపిస్తే.. కండక్టర్లు చెక్ చేసి జీరో టికెట్ జారీ చేస్తారు. ఈ జీరో టికెట్‌తో మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయవచ్చు. రాష్ట్రంలో ఎక్కడినుంచి ఎక్కడికైనా మహిళలు ప్రయాణం చేయవచ్చు. త్వరలో ఆధార్ కార్డుతో సంబంధం లేకుండా మహిళలకు క్యూఆర్ కోడ్‌తో కూడిన ఓ కార్డు జారీ చేయనున్నారు. ఈ కార్డు అందుబాటులోకి వస్తే ఆధార్ కార్డు చూపించాల్సిన అవసరం అనేది ఉంది. దీని వల్ల మహిళలు మరింత సులభతరంగా ఉచిత బస్సు జర్నీ చేయవచ్చు.
దివ్యాంగులకు ఫ్రీ జర్నీ
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో దివ్యాంగులకు రాయితీపై బస్సు సౌకర్యం అందుబాటులో ఉంది. అంటే వీరికి టికెట్లపై రాయితీ ఉంటుంది. సగం చార్జీ చెల్లించి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయవచ్చు. అంతేకాకుండా వీరి కోసం ఆర్టీసీ బస్సుల్లో ప్రత్యేక సీట్లు కూడా అందుబాటులో ఉంటాయి. అయితే త్వరలో వీరికి కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించేందుకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు సిద్దమవుతున్నాయి. దీని వల్ల దివ్యాంగులైన పరుషులు ఉచితంగా ప్రయాణించవచ్చు. దివ్యాంగులను ఉచిత బస్సు ప్రయాణ పధకంలో భాగస్వామ్యం చేయనున్నట్లు ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. ప్రస్తుతం మహిళలకు ఫ్రీ బస్సు జర్నీలాగే దివ్యాంగులకు కూడా ఫ్రీ బస్సు సౌకర్యం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎంతమంది దివ్యాంగులు ఉన్నారు..? వీరిని పథకంలో చేరిస్తే ఎంత ఖర్చు అవుతుంది? అనే వివరాలు ఏపీఎస్‌ఆర్టీసీ సేకరిస్తోంది. ఆ వివరాలు వచ్చాక ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయనుంది.
తెలంగాణలోనూ దివ్యాంగులకు ఫ్రీ బస్..?
ఇక తెలంగాణలోనూ దివ్యాంగులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. త్వరలో దివ్యాంగులకు ఫ్రీ బస్ సౌకర్యాన్ని కల్పిస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రకటించారు. ఈ మేరకు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో చర్చలు జరిపానని, త్వరలోనే సీఎం రేవంత్‌తో మాట్లాడుతున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో తప్పకుండా దీనిపై సానుకూల నిర్ణయం వస్తుందని అడ్లూరి లక్ష్మణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తే మహిళలతో పాటు దివ్యాంగ పరుషులు కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.
