Sweet Capital of India: స్వీట్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారో తెలుసా?
స్వీట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు.. మన దేశంలో స్వీట్లకు ఎంతో పాధాన్యత ఉంది. ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా స్వీట్స్ కచ్చితంగా ఉండాల్సిందే. అంతేకాదు భారతదేవానికి స్వీట్లకు బంధానికి ఎంతో చరిత్ర ఉంది. ఆత్రేయపురం అనగానే మనకు పూతరేకులు ఎలాగైతే గుర్తుకు వస్తాయో అలానే మన దేశంలోని చాలా ప్రాంతాలు తమదైన స్వీట్ల తయారీతో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాయి. అయతే వీటిలో స్వీట్ సిటీ ఆఫ్ ఇడియా అని ఏ నగరాన్ని పిలుస్తారో మీకు తెలుసా? అయితే తెలుసుకుందాం పదండి.

దేశంలోని ఒక నగరం స్వీట్లకు అసలైన చిరునామాగా నిలుస్తోంది. అదే సైన్స్ సిటీ ఆఫ్ ఇడియాగా పిలువబుతున్న పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కతా. ఇంత వరకు సైన్స్ సిటీ ఆఫ్ ఇండియాగా పిలువబడే ఈ నగరాన్ని ఇకపై స్వీట్ సిటీ ఆఫ్ ఇండియా అని కూడా పిలువనున్నారు. ఎందుకుంటే ఈ నగరం సంప్రదాయ తీపి వంటకాలు విభిన్న రుచులు, శతాబ్దాల నాటి రెసిపీలకు ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ నగరంలో స్వీట్లను తాజా పనీర్, ఖర్జూరం, సుగంధ ద్రవ్యాలతో కూడా వాటితో ఎంటో ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఇక్కడ తయారైన స్వీట్లకు కేవలం మన దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉంది. అందుకే ఈ నగరాన్ని స్వీట్స్ సిటీ ఆఫ్ ఇండియా అంటారు.
కోల్‌కతాలో ఫేమస్ స్వీట్స్ ఇవే
1. రోసగుల్లా
తాజా పనీర్, రవ్వ, చక్కెర పాకంతో తయారు చేసే ఈ మృదువైన రసగుల్లాలు ఇక్కడ ఎంతో ప్రసిద్ది చెందినవి. మొదటగా దీనిని రవ్వ, పనీర్‌తో కలిసి గుండ్రని ముద్దలుగా తయారు చేసి ఆ తర్వాత వాటిని చక్కెర పాకంలో వేసి నానబెడతారు. తేలికైన టెక్స్చర్, మితమైన తీపి ఈ స్వీట్ ప్రత్యేకత అందుకే ఈ స్వీట్‌ను కింగ్ ఆఫ్ కోల్‌కతా అని పిలుస్తారు. ఐకానిక్ స్వీట్‌గా సాంస్కృతిక ప్రాముఖ్యతను పొందిన ఈ స్వీట్ GI ట్యాగ్‌ను కూడా సంపాదించింది.
2 సందేశ్:
తాజా పనీర్, చక్కెరతో తయారు చేయబడిన ఈ సున్నితమైన బెంగాల్ స్వీట్‌ను సందేశ్ అని పిలుస్తారు. దీన్ని పాలు, చక్కెర, పనీర్‌ను కలిపి తరాయు చేస్తారు. ఈ స్వీట్ మీకు కుంకుమ పువ్వు, పిస్తాపప్పు, చాక్లెట్‌తో సహా వివిధ రకాల ప్లేవర్స్‌లో మార్కెట్‌లో దొరుకుతుంది.
3 .మిష్టి దోయి
మట్టి కుండలలో మరిగించిన పాలు, చక్కెరను కలిపి పులియబెట్టి తయారు చేసే ఈ స్వీట్‌ను మిష్టి దోయ్ అని పిలుస్తారు.రిచ్, క్రీమీ టెక్స్చర్, నెమ్మదిగా చేసే దీని తయారీ విధానం దీనికి ఎంతో రుచిని ఇస్తుంది. ఇది రుచికి ఎంత టేస్ట్‌గా ఉంటుందో.. అంతే లగ్జరీ ఫీలింగ్ ఇస్తుంది.
4.చోమ్‌చోమ్
ఓవల్ ఆకారంలో, రంగురంగులుగా కనిపించే ఈ స్వీట్‌ను చోమ్ చోమ్ అంటారు. దీనిని పనీర్, చక్కరె పాకంతో తయారు చేస్తారు. కొబ్బరి ముక్కలతో డెకరేట్ చేసే ఈ స్వీట్ చూడ్డానికి ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో.. రుచికి కూడా అందే టెస్ట్‌గా ఉంటుంది. దీన్ని ఎక్కువగా వేడుకలు, పండగ సమయంలో తింటూ ఉంటారు.
5. నోలెన్ గుర్ స్వీట్స్
ఇది కోల్‌కతాలో శీతాకాలంలో ప్రత్యేకంగా దొరికే స్వీట్. దీనిని ఖర్జూర, బెల్లం ఉపయోగించి తయారుచేస్తారు. నోలెన్ గుర్ సందేశ్ నుండి నోలెన్ గుర్ రోసగుల్లా వరకు అన్ని స్వీట్స్ ప్రత్యేకమైన స్మోకీ తీపిని అందిస్తాయి. సీజనల్ స్వీట్స్‌గా ఎంతో పేరుపొందిన ఈ స్వీట్స్ కోసం స్థానిక ప్రజలు ఏడాది పాటు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
