TTD News: టీటీడీ శ్రీవాణి దర్శన టికెట్ల జారీ విధానంలో కీలక మార్పులు చేసింది. జనవరి 9 నుండి రోజుకు 800 ఆఫ్‌లైన్ టిక్కెట్లను ఆన్లైన్ కరెంట్ బుకింగ్‌కు మార్చారు. ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి. అదే రోజు సాయంత్రం 4 గంటలకు దర్శనం. ఒక కుటుంబానికి నాలుగు టిక్కెట్లకు పరిమితి విధించారు.