Big Eyed Mystery Woman: నిర్మాణంలో ఉన్న భవనాల ముందు దిష్టిబొమ్మలుగా సాధారణంగా రాక్షసుల ఫోటోలను ఉపయోగిస్తారు. అయితే, బెంగళూరులో ఈ మధ్య ఓ కొత్త ట్రెండ్ మొదలైంది. పెద్ద కళ్ళ మహిళ ఫోటోలను దిష్టిబొమ్మలుగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, అసలు ఆ మహిళ ఎవరు అనే ప్రశ్న తలెత్తుతోంది. నెటిజన్లు ఆమె గుర్తింపు కోసం వెతుకుతున్నారు.