ఏపీ పేదలకు సర్కార్ గుడ్ న్యూస్..ఇళ్ల నిర్మాణానికి చౌక ధరకే సామాగ్రి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న గృహ నిర్మాణ స్కీమ్ లో భాగంగా లబ్దిదారులకు రూ. 1.95 లక్షల వ్యయంతో ఇంటి నిర్మాణాన్ని కంప్లీట్ చేసేలా అధికారులు ప్లానింగ్ రెడీ చేశారు.

Jagananna Colonies : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న గృహ నిర్మాణ స్కీమ్ లో భాగంగా లబ్దిదారులకు రూ. 1.95 లక్షల వ్యయంతో ఇంటి నిర్మాణాన్ని కంప్లీట్ చేసేలా అధికారులు ప్లానింగ్ రెడీ చేశారు. ఇందుకు కావాల్సిన నిర్మాణ సామగ్రిని లబ్దిదారుల ఇళ్లకే చేరవేయాలని నిర్ణయించారు. ఇసుకను ఫ్రీగా ఇవ్వడంతో పాటు..సిమెంటు బస్తా రూ. 225కు ఇవ్వనున్నారు. ఇటుకలు, తలుపులు, కిటికీలు, ఇనుప కడ్డీలు, విద్యుత్తు పరికరాలు, రంగులు, శానిటరీ వస్తువులు, మార్కెట్ ధర కంటే తక్కువకు అందించేందుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే నిర్ణయించిన మొత్తంలో గుంటూరు జిల్లా తాడేపల్లిలో నమూనా గృహాన్ని నిర్మించారు.

ఇక గృహనిర్మాణ పథకానికి వైఎస్సార్ జగనన్న కాలనీలుగా పేరు పెట్టారు. మొదటి విడతగా ఆగస్టు 26న 15 లక్షల మందికి గవర్నమెంట్ ఇళ్లు మంజూరు చేయనుంది. లబ్దిదారులు సొంతంగా లేదా అధికారుల పర్యవేక్షణలో ఇళ్ల నిర్మాణాలు చేసుకోవచ్చు. తలుపులు, కిటికీలు, ఇటుకలను తయారు చేపించే లబ్దిదారులకు అందిస్తారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మేస్త్రీలు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు , కార్పెంటర్లు, ఎంతమంది ఉన్నారో గుర్తించి గృహ నిర్మాణ శాఖ వెబ్సైట్లో రికార్డు చేయనున్నారు. లబ్దిదారులను సంప్రదించి వీరికి ఇళ్ల నిర్మాణ పనులు అప్పగిస్తారు.
శాంపిల్ ఇంటి నిర్మాణంలో హాలు, కిచెన్, బెడ్ రూమ్, మరుగుదొడ్డి, వరండా ఉన్నాయి. వీటికి అవసరమైన సామగ్రి కొనుగోలుకు రూ. 1.25 లక్షలు అయినట్లు అధికారులు అంచనాకు వచ్చారు. నిర్మాణ కార్మికుల ఖర్చు కింద రూ. 55 వేలు అవుతున్నట్లు లెక్కగట్టారు. మొత్తంగా రూ. 1.80 లక్షల ఖర్చుతో ఇంటిని, రూ. 15 వేలతో వరండా నిర్మాణాన్ని కంప్లీట్ చేశారు.
Read More : ఎన్ఆర్ఐ సంబంధం..పెళ్లైన మూడు రోజుల్లోనే వరుడు ‘గే’ అని తెలిసి…
