రాజకీయాల్లోకి ఎంట్రీ.. సోనూసూద్ ఏమన్నారంటే
కష్టంలో ఉన్నారని తెలిస్తే చాలు.. వారు తనకు ఏం కాకపోయినా స్పందిస్తాడు. నేనున్నాను.. బాధపడకండి అంటూ భరోసా ఇస్తాడు. అంతేనా.. ''ఇదిగో నా సాయం తీసుకోండి. ఇంకా అవసరం అయితే అడగండి'' అంటూ వరాలు ఇచ్చేస్తాడు.

Sonu Sood entry in Politics : కష్టంలో ఉన్నారని తెలిస్తే చాలు.. వారు తనకు ఏం కాకపోయినా స్పందిస్తాడు. నేనున్నాను.. బాధపడకండి అంటూ భరోసా ఇస్తాడు. అంతేనా.. ”ఇదిగో నా సాయం తీసుకోండి. ఇంకా అవసరం అయితే అడగండి” అంటూ వరాలు ఇచ్చేస్తాడు. కరోనా పరిస్థితుల్లో ఎంతో మందికి సాయం చేసి దేవుడిలా వెలుగొందుతున్న సోనూసూద్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎవరి నుంచి ఏం ఆశించకుండా సేవ చేస్తున్న ఈ రీల్ విలన్ ఇప్పుడు ఎంతోమంది పాలిట రియల్ హీరోగా మారారు. ఇక సోనూ చేస్తున్న సాయంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సోనూసూద్‌ను మెచ్చుకుంటున్నారు. సామాన్యులైతే సూపర్ మ్యాన్‌లా భావిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఆయన రాజకీయాల్లోకి రావాలని చాలా మంది కోలుకుంటున్నారు.
ఇక ఇదే ప్రశ్న ఓ ఇంటర్వ్యూలో సోనూకు ఎదురైంది. రాజకీయాల్లో వస్తారా అన్న ప్రశ్నకు.. ”ఇప్పట్లో ఏం అనుకోలేదు. సేవ చేయాలనుకుంటే రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదు కదా. నటుడిగా నేను చేయాల్సింది చాలా ఉంది. ఇంకా చాలా తెలుగు, హిందీ సినిమాల్లో నటించాలి. ఆ సమయం వస్తే అప్పుడు ఆలోచిస్తా. కానీ ఇప్పుడైతే నటుడిగానే కొనసాగుతా” అని సోనూ చెప్పుకొచ్చారు. కాగా సాయం చేస్తున్న సోనూకు ఒకానొక సమయంలో రాజకీయ మరకలు అంటిన విషయం తెలిసిందే.
Read This Story Also: కరోనాతో నెల రోజుల పోరాటం.. కన్నుమూసిన యువ వైద్యుడు



