AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదంతా పీడకల అయితే బావుండేది: సుశాంత్‌ సోదరి భావోద్వేగ పోస్ట్‌

సుశాంత్‌ సింగ్‌ గురించి మరోసారి భావోద్వేగ పోస్ట్‌‌ చేశారు సోదరి శ్వేతా సింగ్‌ కిర్తి. త్వరలోనే తనను కలుస్తానని చెప్పిన తన తమ్ముడు.. శాశ్వతంగా దూరమయ్యాడంటూ సుశాంత్‌ ఙ్ఞాపకాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

ఇదంతా పీడకల అయితే బావుండేది: సుశాంత్‌ సోదరి భావోద్వేగ పోస్ట్‌
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 27, 2020 | 7:26 PM

Share

సుశాంత్‌ సింగ్‌ గురించి మరోసారి భావోద్వేగ పోస్ట్‌‌ చేశారు సోదరి శ్వేతా సింగ్‌ కిర్తి. త్వరలోనే తనను కలుస్తానని చెప్పిన తన తమ్ముడు.. శాశ్వతంగా దూరమయ్యాడంటూ సుశాంత్‌ ఙ్ఞాపకాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. రోజూ నిన్ను చూడాలన్న ఆశతోనే లేస్తున్నానన్న శ్వేతా.. సోదరుడితో తన అనుభవాలను గుర్తు తెచ్చుకున్నారు.

”అమ్మానాన్నలు మొదట్లో కొడుకు కావాలనుకున్నారు. అనుకున్నట్లుగా మొదటి సంతానంగా బాబు జన్మించాడు. కానీ ఏడాదిన్నరకే మరణించాడు. ఆ తరువాత మళ్లీ కొడుకు పుట్టాలని ఎన్నో పూజలు చేశారు. రెండేళ్ల తరువాత దీపావళి రోజున నేను పుట్టా. నన్ను లక్ష్మీదేవి ప్రసాదంగా భావించి గారాబంగా పెంచారు. ఆ తరువాత నా తమ్ముడు పుట్టాడు.అందమైన చిరునవ్వు, కళ్లల్లో మెరుపులు,ముద్దు ముద్దుగా ఉండే ముఖంతో నా తమ్ముడు ఈ లోకంలోకి వచ్చాడు. అక్కగా వాడిని బాగా చూసుకోవడాన్ని నా బాధ్యతగా భావించేదాన్ని. ఇద్దరం కలిసి స్కూల్‌కు వెళ్లేవాళ్లం. తను యూకేజీలో ఉన్నప్పుడు అర కిలోమీటరు నడిచి లంచ్‌బ్రేక్‌లో నన్ను చూసేందుకు వచ్చాడు. నాతోనే ఉంటానని మారాం చేశాడు. అప్పుడు టీచర్లకు తెలీకుండా వాడిని దాచిపెట్టాను.

2007లో నాకు పెళ్లై అమెరికాకు వెళుతున్నప్పుడు సుశాంత్‌ నన్ను గట్టిగా హత్తుకొని, బిగ్గారగా ఏడ్చాడు. భౌతికంగా దూరమైనప్పటికీ మా మనసులు దూరం కాలేదు. కెరీర్ పరంగా ఇద్దరం బిజీ అయ్యాము. బాలీవుడ్‌ హీరోగా సుశాంత్‌ మమ్మల్ని గర్వపడేలా చేశాడు. జూన్‌ 10న అమెరికాకు రమ్మని సుశాంత్‌ని కోరాను. అక్కడికి రావాలని మనసు ఉబలాటపడుతోంది అక్కా అని సుశాంత్‌ సమాధానం ఇచ్చాడు. వచ్చి ఒక నెల రోజులు ఇక్కడే ఉండు బావుంటుంది అని చెప్పాను. కానీ ఈ లోపే ఆత్మహత్య చేసుకొని నాకు, కోట్లాది మంది అభిమానులకు తీరని శోకాన్ని మిగిల్చాడు. ఇది పీడకల అయితే బావుండేది” అని రాసుకొచ్చారు. ఈ సందర్భంగా సుశాంత్‌ చిన్న నాటి ఫొటోను ఆమె సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. కాగా గత నెల 14న సుశాంత్‌ ఆత్మహత్య చేసుకొని తనువు చాలించారు. ఆయన మరణించి నెలన్నర గడుస్తున్నా.. కుటుంబ సభ్యులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

https://www.instagram.com/p/CDIV-kelYMo/?utm_source=ig_embed

ఓరీ దేవుడో వీళ్లకు జామకాయ వెరీ డేంజర్‌..! అస్సలు తినొద్దు తెలుసా?
ఓరీ దేవుడో వీళ్లకు జామకాయ వెరీ డేంజర్‌..! అస్సలు తినొద్దు తెలుసా?
56 ఏళ్ల వయసులో ఫిట్‌నెస్ మంత్రం చెప్పిన హీరోయిన్..
56 ఏళ్ల వయసులో ఫిట్‌నెస్ మంత్రం చెప్పిన హీరోయిన్..
ముఖంపై మొటిమలు నల్లమచ్చలతో బాధపడుతున్నారా.. సింపుల్ టిప్స్ మీకోసం
ముఖంపై మొటిమలు నల్లమచ్చలతో బాధపడుతున్నారా.. సింపుల్ టిప్స్ మీకోసం
అదృష్టాన్నిచ్చే ఆలయాలు.. జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలంట!
అదృష్టాన్నిచ్చే ఆలయాలు.. జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలంట!
ట్యాక్స్ లిమిట్ రూ.35 లక్షలకు పెంపు..? బడ్జెట్‌లో నిర్ణయం..!
ట్యాక్స్ లిమిట్ రూ.35 లక్షలకు పెంపు..? బడ్జెట్‌లో నిర్ణయం..!
మొలకలా మజాకా?రోజూ గుప్పెడు తిన్నారంటే హెల్త్‌కి ఫుల్‌ సెక్యూరిటీ!
మొలకలా మజాకా?రోజూ గుప్పెడు తిన్నారంటే హెల్త్‌కి ఫుల్‌ సెక్యూరిటీ!
టాక్సిక్‌ టీజర్‌పై మొదలైన వివాదం.. ఆ సీన్స్ పై నెట్టింట రచ్చ..
టాక్సిక్‌ టీజర్‌పై మొదలైన వివాదం.. ఆ సీన్స్ పై నెట్టింట రచ్చ..
ఉచిత వైద్యం లిమిట్ రూ.15 లక్షలకు పెంపు..? కేంద్రం క్లారిటీ
ఉచిత వైద్యం లిమిట్ రూ.15 లక్షలకు పెంపు..? కేంద్రం క్లారిటీ
కత్తులతో పొడిచి, గొంతుకోసి మహిళ దారుణ హత్య.. కారణం ఏంటో తెలుస్తే!
కత్తులతో పొడిచి, గొంతుకోసి మహిళ దారుణ హత్య.. కారణం ఏంటో తెలుస్తే!
ఆ సినిమాకు రూ.35 లక్షలు పెడితే 9 లక్షలు వచ్చాయి..
ఆ సినిమాకు రూ.35 లక్షలు పెడితే 9 లక్షలు వచ్చాయి..