ప్ర‌ఖ్యాత న‌టి ఒలివియా డీ హ‌విల్లాండ్ ఇక‌లేరు…

అల‌నాటి హాలీవుడ్ సూప‌ర్ హిట్ మూవీ 'గాన్ విత్ ద విండ్‌'లో న‌టించిన ప్ర‌ముఖ‌ న‌టి ఒలివియా డీ హ‌విల్లాండ్ మృతి చెందారు.

ప్ర‌ఖ్యాత న‌టి ఒలివియా డీ హ‌విల్లాండ్ ఇక‌లేరు...
Follow us
Ram Naramaneni

| Edited By:

Updated on: Jul 27, 2020 | 7:46 PM

Olivia de Havilland Died : అల‌నాటి హాలీవుడ్ సూప‌ర్ హిట్ మూవీ ‘గాన్ విత్ ద విండ్‌’లో న‌టించిన ప్ర‌ముఖ‌ న‌టి ఒలివియా డీ హ‌విల్లాండ్ మృతి చెందారు. ఆమె వ‌య‌సు ప్రస్తుతం 104 ఏళ్లు. హాలీవుడ్ స్వ‌ర్ణ‌యుగంలో ఆమె త‌న మార్క్ వేశారు. డీ హ‌విల్లాండ్ త‌న 50 ఏళ్ల కెరీర్‌లో దాదాపు 50 సినిమాల‌కు పైగా న‌టించారు. 1939లో రిలీజైన ఎవ‌ర్‌గ్రీన్ ఫిల్మ్ ‘గాన్ విత్ ద విండ్‌’లో ఆమె త‌న న‌ట‌న‌తో అద‌ర‌గొట్టారు. ఆ సినిమాలో పోషించిన పాత్ర‌కు ఆమె ప్ర‌తిష్ఠాత్మ‌క‌ ఆస్కార్‌కు నామినేట్ అయ్యారు. 1960 నుంచి డీ హ‌విల్లాండ్ పారిస్‌లోనే జీవనం సాగిస్తున్నారు. ఫ్రాన్స్ రాజ‌ధాని పారిస్‌లో అనారోగ్య కార‌ణాల‌తో ఒలివియా క‌న్నుమూసిన‌ట్లు ఫ్యామిలీ మెంబ‌ర్స్ తెలిపారు. కెప్టెన్ బ్ల‌డ్ చిత్రంతో డీ హ‌విల్లాండ్ పేరు మారుమోగిపోయింది. ఓ ద‌శ‌లో హాలీవుడ్ కాంట్రాక్ట్ వ్య‌వ‌స్థ‌పై ఆమె క‌న్నెర్ర జేసి కేసు వేసి మ‌రీ గెలిచారు. న‌టీన‌టుల‌తో వార్న‌ర్ బ్ర‌ద‌ర్స్ కుదుర్చుకున్న అగ్రిమెంటుకు వ్య‌తిరేకంగా 1943లో ఆమె కోర్టు కేసు వేశారు. ఆ కేసులో కోర్టు డీ హ‌విల్లాండ్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది.

Read More : ఏపీ పేద‌ల‌కు స‌ర్కార్ గుడ్ న్యూస్..ఇళ్ల నిర్మాణానికి చౌక ధ‌రకే సామాగ్రి