Singer Smitha: నానితో ఉన్న బంధం అదే.. నాకు ఏమవుతాడంటే.. సింగర్ స్మిత ఆసక్తికర కామెంట్స్..
సింగర్ స్మిత అంటే తెలియనివారుండరు. ఒకప్పుడు తెలుగులో పాప్ మ్యూజిక్ తో రచ్చ చేసింది. ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్.. అలాగే సహయ నటిగానూ మెప్పించింది. తెలుగు పాత పాటలను ఇప్పటికీ ట్రెండ్ అయ్యే విధంగా రీమిక్స్ చేసి ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఇటీవల మసక మసక పాటతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చింది.

పాప్ సింగర్ స్మిత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దక్షిణాదిలో ఎన్నో పాటలు పాడి తనకంటూ మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. తెలుగు పాత పాటలను ఇప్పటి యూత్ కు సెట్ అయ్యే విధంగా రీమిక్స్ చేసి ఫుల్ పాపులారిటీని సంపాదించుకున్నారు. సింగర్ గానే కాకుండా నటిగానూ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. చాలా కాలంపాటు సైలెంట్ అయిన స్మిత.. ఇటీవల మసక మసక చీకటిలో పాటతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న స్మిత.. “మసక మసక చీకటిలో” పాట తన కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిందని అన్నారు. ఒకప్పుడు ఆల్బమ్‌లకు కోట్లు ఖర్చు చేసేవారని తెలిపారు. ప్రస్తుతం సింగిల్స్ యుగం నడుస్తోందని, సీడీలు, క్యాసెట్ల సంస్కృతి పూర్తిగా కనుమరుగై ఆన్‌లైన్ డౌన్‌లోడ్‌లు, మ్యూజిక్ యాప్‌లు డామినేట్ చేస్తున్నాయని తెలిపారు. ఒక క్యాసెట్ అమ్మే రోజు నుంచి నేరుగా ఫోన్ల ద్వారా పాటలు వినే వరకు జరిగిన ఈ మొత్తం మార్పును తాను ప్రత్యక్షంగా చూశానని, ఇది తన అదృష్టమని స్మిత అన్నారు. ఎనభైలు, తొంభైలలో పెరిగిన తరం చాలా అదృష్టవంతులని, ఇంటర్నెట్, ఫోన్లు లేని ఆ రోజులు చాలా భిన్నంగా ఉండేవని ఆమె అన్నారు.
ఇవి కూడా చదవండి : Actor Balaji: రఘువరన్ చనిపోవడానికి కారణం అదే.. ఆయన కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. నటుడు బాలాజీ..
“స్వర్ణకమలం”, “సాగర సంగమం”, “స్వాతిముత్యం” తన ఆల్-టైమ్ ఫేవరెట్ చిత్రాలని, ముఖ్యంగా భానుప్రియ గారు క్లాసికల్ డ్యాన్స్ పాత్రలకు గుర్తొస్తారని చెప్పారు. తన కూతురి భవిష్యత్తు గురించి మాట్లాడుతూ తన వారసత్వాన్ని కొనసాగిస్తుందా అనేది తన ఇష్టమని చెప్పుకొచ్చారు. ఆమె మంచి గాత్రం కలిగి ఉందని, కానీ స్టార్‌డమ్ నేరుగా రాదని, కష్టపడి నేర్చుకోవాలని తాను చెబుతానని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి : Soundarya : చనిపోవడానికి ముందు నాతో ఫోన్ మాట్లాడింది.. అసలు విషయం బయటపెట్టిన డైరెక్టర్..
అలాగే హీరో నానితో తన బంధం గురించి మాట్లాడుతూ.. తాము బంధువులు కాదని, కానీ చాలా సన్నిహిత కుటుంబ స్నేహితులుగా, ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీలా ఉంటారని తెలిపారు. నరేష్, ఆయన భార్య, నాని, అంజు, దేవా అందరూ తమ టీంలో భాగమేనని చెప్పారు. నాని ఇంత పెద్ద స్టార్ అవుతారని తాను మొదటి నుంచి ఊహించలేదని, తనకు నానితో ఆలస్యంగా పరిచయం ఏర్పడిందని వెల్లడించారు. నరేష్ గారు మాత్రం తనకు ఇరవై ఏళ్లకు పైగా స్నేహితులని, పరిశ్రమలో తన తొలి స్నేహితులలో ఒకరని స్మిత తెలిపారు.
ఇవి కూడా చదవండి : Anshu Ambani : ఏంటీ.. మన్మథుడు హీరోయిన్‌కు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయిందిగా..
ఇవి కూడా చదవండి : Actress Sudha : టాప్ హీరో.. చనిపోయే ముందు నా కాళ్లు పట్టుకుని ఏడ్చాడు.. నటి సుధ ఎమోషనల్..




