ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు సమ్మెకు దిగుతున్నారు. ఈ నెల 12 నుంచి బస్సులు నిలిపివేయాలని నిర్ణయించారు. స్త్రీ శక్తి పథకం కారణంగా నిర్వహణ భారం పెరిగిందని, దీనిపై న్యాయం చేయాలంటూ యజమానులు డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీ ఎండీకి సమ్మె నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.