AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుమ్మడి ఆకుల కూర తింటే మటన్, మష్రూమ్ మర్చిపోతారు! ఆరోగ్య ప్రయోజనాలు, తయారీ విధానం ఇదే..

సాధారణంగా మనం గుమ్మడికాయతో రకరకాల వంటకాలు చేసుకుంటాం. అలాగే, గుమ్మడి కాయ వితనాలు ఆరోగ్య నిధిగా పరిగణిస్తారు. కానీ, గుమ్మడికాయ ఆకులు, వాటి లేత తీగలతో అద్భుతమైన, రుచికరమైన ఆకుకూర వంటకాన్ని తయారు చేస్తారని మీకు తెలుసా..? ఇది మటన్, మష్రూమ్ కంటే కూడా ఎంతో బలవర్థకమైన ఆహారం. గుమ్మడి ఆకుల కూరతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, తయారీ విధానం ఇప్పుడు చూద్దాం..

గుమ్మడి ఆకుల కూర తింటే మటన్, మష్రూమ్ మర్చిపోతారు! ఆరోగ్య ప్రయోజనాలు, తయారీ విధానం ఇదే..
Pumpkin Leaf CurryImage Credit source: AI image
Jyothi Gadda
|

Updated on: Jun 05, 2026 | 7:13 AM

Share

భారతీయ సాంప్రదాయ వంటకాల్లో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల ఆకుకూరలు ఉన్నాయి. సాధారణంగా మనం తోటకూర, పాలకూర, చుక్కకూర వంటివి రెగ్యులర్‌గా తింటుంటాం. అయితే ఉత్తరాఖండ్ కొండ ప్రాంతాలలో గుమ్మడికాయ లేత తీగలు, వాటి ఆకులతో చేసే కద్దు బెల్ కా సాగ్ (గుమ్మడి ఆకుల కూర) చాలా ప్రసిద్ధి చెందింది. ఈ దేశీ ఆకుకూర రుచిలోనే కాకుండా, పోషకాలలోనూ ఎంతో శక్తివంతమైనది. దీని ముందు మటన్, మష్రూమ్ వంటకాలు కూడా సరిపోవని స్థానికులు చెబుతుంటారు.

ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్‌కు చెందిన సునీతా టామ్టా ఈ వంటకం విశేషాలను పంచుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల చుట్టుపక్కల, పొలాల్లో గుమ్మడి తీగలు సులభంగా పెరుగుతాయి. ఈ తీగల చివర ఉండే లేత ఆకులు, కాడలను తెంపి ఈ కూరను వండుకుంటారు.

తయారీ విధానం:

ఈ సాగ్ చేయడం చాలా సులభం. మొదట గుమ్మడి లేత ఆకులను, కాడలను శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి. బాణలిలో ఆవనూనె వేడి చేసి, అందులో జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి తాలింపు పెట్టాలి. ఆ తర్వాత తరిగిన ఆకులను వేయాలి. కొంతమంది దీని రుచిని మరింత పెంచడానికి ఆలుగడ్డ, వంకాయ ముక్కలను కూడా ఇందులో కలుపుతారు. ఈ కూరలో అస్సలు నీళ్లు పోయకుండా, కేవలం ఆవిరిపై, చిన్న మంట మీద మాత్రమే ఉడికించాలి. దీనివల్ల ఆకుకూరలోని సహజసిద్ధమైన రుచి, పోషక విలువలు నశించకుండా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

ఆరోగ్య ప్రయోజనాలు:

గుమ్మడి ఆకులు, తీగలలో శరీరానికి అవసరమైన అనేక పోషకాలు ఉన్నాయి. ఇందులో ఫైబర్ (పీచు పదార్థం) ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ బలంగా మారుతుంది. మలబద్ధకం, గ్యాస్ వంటి కడుపు సమస్యలు తగ్గుతాయి. ఇందులో ఉండే ఐరన్ కంటెంట్ శరీరంలో రక్తాన్ని పెంచి, అనీమియా (రక్తహీనత) బారిన పడకుండా కాపాడుతుంది. విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరుస్తుంది. అలాగే విటమిన్ సి శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

గుమ్మడి ఆకులు, తీగలలో ఉండే కాల్షియం ఎముకలను, దంతాలను దృఢంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆధునిక ఆహారపు అలవాట్లు మారుతున్నప్పటికీ, ఉత్తరాఖండ్ పర్వత ప్రాంతాల్లోని ప్రజలు తమ సాంప్రదాయ గుమ్మడి ఆకుల కూరను నేటికీ రెగ్యులర్‌గా వండుకుంటారు. ఆరోగ్యాన్ని, రుచిని అందించే ఈ సాంప్రదాయ వంటకాన్ని రాబోయే తరాలకు కూడా అందిస్తూ దీని ప్రాముఖ్యతను కాపాడుకుంటున్నారు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us