AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జూన్ 5 రాశిఫలాలు: వారికి ఆకస్మిక ధనలాభానికి అవకాశం..మీ రాశికి ఎలా ఉందంటే..?

దిన ఫలాలు (జూన్ 5, 2026): మేష రాశి వారికి ఉద్యోగంలో పని భారం ఎక్కువగా ఉంటుంది కానీ ముఖ్యమైన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. వృషభ రాశి వారు ఆర్థిక, ఆస్తి సంబంధిత విషయాల్లో స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం మంచిదని సూచన. అలాగే ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్త అవసరం. మిథున రాశి వారికి ఉద్యోగ పరంగా సమయం అనుకూలంగా ఉండి ఆర్థికంగా కూడా మంచి ఫలితాలు కనిపిస్తాయి. మొత్తం 12 రాశుల వారికి శుక్రవార దిన ఫలాలు ఎలా ఉన్నాయంటే..?

జూన్ 5 రాశిఫలాలు: వారికి ఆకస్మిక ధనలాభానికి అవకాశం..మీ రాశికి ఎలా ఉందంటే..?
Horoscope Today 05 June 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 05, 2026 | 6:00 AM

Share

దిన ఫలాలు (జూన్ 5, 2026): మేష రాశి వారికి ఉద్యోగంలో పని భారం ఉంటుంది. ముఖ్యమైన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. వృషభ రాశి వారు ఆర్థిక, ఆస్తి వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచివి. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం అవసరం. మిథున రాశికి చెందిన ఉద్యోగులకు సమయం చాలా అనుకూలంగా ఉంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశులకు శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, ఉద్యోగాలు బాగా అనుకూలంగా సాగుతాయి. డాక్టర్లు, లాయర్లు బాగా బిజీ అయిపోతారు. ఉద్యోగంలో పని భారం ఉంటుంది. ముఖ్యమైన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. ఆస్తి వివాదం ఒకటి సానుకూలపడుతుంది. కొందరు మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ఆదాయం బాగానే ఉన్నప్పటికీ అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మిత్రులతో కలిసి విందుల్లో పాల్గొనడం జరుగుతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన స్థిరత్వం లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. ఆర్థిక, ఆస్తి వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు మంచివి. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం అవసరం. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఉద్యోగ ప్రయత్నాల్లో కొద్దిగా ఆశాభంగం చెందుతారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబ జీవితం బాగా సాఫీగా సాగిపోతుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగులకు సమయం చాలా అనుకూలంగా ఉంది. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తుల వారికి ఆశించిన బిజీ జీవితం ఏర్పడుతుంది. వ్యాపారాలు సాఫీగా సాగిపోతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. అనుకోకుండా డబ్బు కలిసి వస్తుంది. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్య క్షేత్రానికి వెళ్లే అవకాశం ఉంది. కుటుంబంతో సంప్రదించి కీలక నిర్ణయాలు తీసుకుంటే మంచిది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ముఖ్యమైన వ్యవహారాలన్నీ నిదానంగా పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో తప్పకుండా శుభవార్త వింటారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఇష్టమైన మిత్రులతో విందు కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగంలో ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. మిత్రుల నుంచి రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగించి ప్రోత్సహిస్తారు. చాలా కాలంగా ఒత్తిడి కలిగిస్తున్న వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. అనుకున్న పనులు మిత్రుల సహాయంతో పూర్తవుతాయి. కొందరు బంధువులకు ఆర్థిక సహాయం చేస్తారు. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు కొద్ది ప్రయత్నంతో చక్కబడతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాల్లో మరింత పట్టుదల అవసరం.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో సంపాదన బాగా పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. ఆదాయ వృద్ధి ప్రయత్నాల్లో ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది. ఉద్యోగ ప్రయత్నాల్లో తప్పకుండా విజయం లభిస్తుంది. ఇతరులకు మేలు జరిగే మంచి పనులు చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. బంధువుల రాకపోకలుంటాయి. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగులకు సానుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి. ఆస్తి వ్యవహారాలకు సంబంధించిన శుభవార్త వింటారు. కొందరు బంధుమిత్రులతో సర దాగా గడుపుతారు. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఊహించని శుభ వార్తలు అందుతాయి. కుటుంబంలో అనుకూల పరిస్థితులుంటాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. అనుకున్న పనుల్ని అనుకున్నట్టు పూర్తి చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

కుటుంబంలో కొన్ని చిక్కులు తొలగిపోతాయి. ఊహించని ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ధనపరంగా చాలావరకు బాగుంటుంది. అనవసర ఖర్చుల్ని తగ్గించుకుంటారు. ముఖ్య మైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో బాధ్యతలను సంతృప్తి కరంగా పూర్తి చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. సొంత ఆలోచనల వల్ల లాభం ఉంటుంది. ఆస్తి విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది.

ధనుస్సు (మూల, పూర్వా‌షాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశం ఉంది. వృత్తి జీవితంలో ఉన్నవారికి డిమాండ్ పెరుగు తుంది. వ్యాపారాలలో పెట్టుబడులకు తగ్గట్టుగా లాభాలు లభిస్తాయి. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. దైవ కార్యాలలో పాల్గొంటారు. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగపరంగా ఒక ముఖ్యమైన సమాచారం అందుతుంది. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. వ్యాపారాల మీద శ్రద్ధ పెరుగుతుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. పెళ్లి ప్రయత్నాలు అనుకూలంగా ముందుకు సాగుతాయి. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రస్తుతానికి ఎవరికీ వాగ్దానాలు చేయడం మంచిది కాదు. ఇతరులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. బంధువులతో అనుకోని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

రోజంతా ప్రశాంతంగా, ఆనందంగా గడిచిపోతుంది. ఉద్యోగ జీవితంలో అనుకోకుండా శుభ పరిణామం చోటుచేసుకుంటుంది. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తి జీవితాలవారికి మంచి గుర్తింపు లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. బంధువుల రాకపోకలుంటాయి. చిన్ననాటి మిత్రులతో హ్యాపీగా కాలక్షేపం చేస్తారు. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాల్లో సమస్యలు, చికాకులు తొలగిపోతాయి. ఉద్యోగం మారదలచుకున్న వారికి సమయం అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణాల్లో ఇబ్బందులుంటాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. బంధువుల్లో కొందరు అపనిందలు వేయడం జరుగుతుంది. మిత్రులతో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థిక పరిస్థితి పరవాలేదనిపిస్తుంది.

Follow Us