AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor: ప్రతి బిక్షగాడి దగ్గర ఈ టాలీవుడ్ నటుడి ఫోన్ నంబర్.. ఏ టైమ్‌లో కాల్ చేసినా క్షణాల్లోనే సాయం చేస్తారు

ఈ స్టార్ హీరోలకు వందల కోట్ల ఆస్తులున్నాయి. పెద్ద పెద్ద భవనాలున్నాయి. లగ్జరీ కార్లున్నాయి. కానీ ఎంత సంపాదించినా తన మూలాలు మాత్రం మరవలేదీ ట్యాలెంటెడ్ యాక్టర్. తాను ఎక్కడి నుంచి వచ్చాడో, ఎలా ఈ స్థాయికి ఇప్పటికీ గుర్తు పెట్టుకున్నారు. అందుకే తన సంపాదనలో కొంత భాగాన్ని పేదలకు పంచుతున్నాడు.

Actor: ప్రతి బిక్షగాడి దగ్గర ఈ టాలీవుడ్ నటుడి ఫోన్ నంబర్.. ఏ టైమ్‌లో కాల్ చేసినా క్షణాల్లోనే సాయం చేస్తారు
Tollywood Actor
Basha Shek
|

Updated on: Jun 25, 2026 | 12:16 PM

Share

బాలీవుడ్ ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్ తెలుగు ఆడియెన్స్ కు కూడా పరిచయమే. పవన్ కల్యాణ్ పంజా సినిమాలో విలన్ గా చేశాడు. అలాగే సాహో సినిమాలో ప్రభాస్ తండ్రిగా కనిపించారు. సినిమాల పరంగా జాకీష్రాఫ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో హీరోగా ఓ వెలుగు వెలిగిన ఈయన ఇప్పటికీ సినిమాల్లో నటిస్తున్నారు. విలన్ గా, సహాయక నటుడిగా మెప్పిస్తున్నారు. అయితే జాకీష్రాఫ్ కేవలం వెండితెర హీరో మాత్రమే కాదు. నిజ జీవితంలో కూడా ఆయన హీరోనే. ఒక విషయంలో అందరూ ఈ జాకీని తెగ ప్రశంసిస్తున్నారు. ఈ నటుడికి ఇప్పుడు కోట్లాది ఆస్తులున్నాయి. విశాలమైన భవనాలు, లగ్జరీ కార్లు ఉన్నాయి. కొడుకు (టైగర్ ష్రాఫ్) కూడా హీరోగా రాణిస్తున్నాడు. ఇలా ఎన్ని కోట్ల ఆస్తులున్నా జాకీ ష్రాఫ్ తన మూలాలను మర్చిపోలేదు. ఎందుకంటే ఆయన జీవిత ప్రస్థానమే కటిక పేదరికంలో మొదలైంది. పేదరికంలో ఉండే బాధ లను ఆయన స్వయంగా చూశాడు. .

జాకీ తన బాల్యాన్ని ముంబైలోని వాల్కేశ్వర్ ప్రాంతంలో గడిపారు. చిన్న ఇంటిలోనే అందరూ ఉండేవారు. రాత్రి నిద్రపోతున్నప్పుడు ఎలుకలు తన వేళ్లను కొరికాయని ఒక ఇంటర్వ్యూలో గుర్తు తెచ్చుకున్నాడు జాకీ ష్రాఫ్. ఇన్ని కష్టాలు ఉన్నప్పటికీ జాకీ జీవితాన్ని గొప్పగా మలచుకోవాలని కలలు కన్నాడు. ఇందుకోసం చేతికొచ్చిన పని చేశాడు. పల్లీలు అమ్మాడు, ఫ్లైట్‌ అటెండెంట్‌గా పని చేశాడు, చెఫ్‌గా ట్రై చేశాడు. చివరకు ప్రముఖ దర్శకుడు సుభాష్ ఘాయ్ బస్టాండ్ లో నిల్చొని ఉన్న జాకీని చూసి వెంటనే తన ‘హీరో’ చిత్రంలో అవకాశం ఇచ్చారు. ఇక ఆ తర్వాత ఆయన వెనక్కు తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు.

ఇవి కూడా చదవండి

జాకీ ష్రాఫ్ స్టార్ అయినా ఇప్పటికీ తన మూలాలు మర్చిపోలేదు. అందుకే ఇప్పటికీ తన సంపాదనలో కొంత భాగం పేదలకు దానం చేస్తున్నాడు. ఎక్కడైతే నిస్సహాయుడు కనిపిస్తాడో, అతనికి అండగా నిలబడటానికి తన వంతు ప్రయత్నం చేస్తారీ స్టార్ యాక్టర్. అలా జాకీ ష్రాఫ్ సుమారు 100 పేద కుటుంబాలను దత్తత తీసకున్నారు. వారి వైద్య ఖర్చులకు సహాయం చేయడానికి నానావతి ఆసుపత్రిలో ఒక అకౌంట్‌ కూడా మెయింటెన్‌ చేస్తున్నారు. జాకీ తన ఆదాయంలో 50 శాతాన్ని అవసరమైన వారికి సహాయం చేయడానికే ఖర్చు చేస్తారని అతని భార్య అయేషా కూడా పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. ముంబైలోని పాలి కొండ ప్రాంతంలో ఉండే ప్రతి బిక్షగాడి దగ్గర ‘జాకీ దాదా’ ఫోన్ నంబర్ ఉంటుంది. ‘రాత్రిపూట మీకు భోజనం లేకపోతే నాకు ఫోన్ చేయండి, నేను అన్నం పంపిస్తాను. మీకు ఏది అవసరమైనా ఎప్పుడైనా ఫోన్ చేయండి, నేను వస్తాను అని జాకీ దాదా మాతో చెప్పారు’ అని ఈ నటుడి సాయం పొందిన ఒకరు చెప్పుకొచ్చారు.

కూతురితో జాకీ ష్రాఫ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us