AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gajakesari Yoga: అరుదైన గజకేసరి యోగం.. ఆ రాశులకు అదృష్టం తలుపు తట్టే ఛాన్స్..!

జూలై 1, 2, 3 తేదీల్లో అరుదైన గజకేసరి యోగం ఏర్పడనుంది. దీని కారణంగా మేషం, కర్కాటకం, కన్య, తుల, మకరం, మీన రాశుల వారికి విశేష శుభఫలితాలు, అదృష్టం పట్టే అవకాశం ఉంది. ఆదాయ వృద్ధి, ఉద్యోగంలో పురోగతి, రాజయోగం, విజయాలు, కొత్త అవకాశాలు, గౌరవ ప్రతిష్ఠలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త పనులు ప్రారంభించడానికి ఈ మూడు రోజులు అత్యంత అనుకూలంగా భావిస్తున్నారు.

Gajakesari Yoga: అరుదైన గజకేసరి యోగం.. ఆ రాశులకు అదృష్టం తలుపు తట్టే ఛాన్స్..!
Gajakesari Yoga
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 25, 2026 | 11:41 AM

Share

జూలై 1, 2, 3 తేదీల్లో అరుదైన గజకేసరి యోగం కలుగుతోంది. ఆ మూడు రోజుల్లో మకర రాశిలో సంచారం చేస్తున్న చంద్రుడిని సప్తమ స్థానం నుంచి ఉచ్ఛ గురువుతో పాటు శుక్ర, బుధులు కూడా వీక్షించడం జరుగుతోంది. ఇది అఖండ రాజయోగానికి దారితీస్తుంది. ఈ గజకేసరి యోగం రెట్టింపు ఫలితాలనిస్తుంది. ఆదాయ వృద్ధి, అధికార యోగం, విజయాలు, సాఫల్యాలు, పేరు ప్రఖ్యాతుల వంటివి నూరు శాతం తప్పకుండా కలుగుతాయి. మేషం, కర్కాటకం, కన్య, తుల, మకరం, మీన రాశుల వారికి ఈ అరుదైన యోగం తప్పకుండా అదృష్టానికి బాట వేస్తుంది. కొత్త ప్రయత్నాలకు, కార్యక్రమాలను ఇది బాగా అనుకూలమైన సమయం.

  1. మేషం: ఈ రాశికి చతుర్థ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువు, బుధ, శుక్రులు దశమంలోని చంద్రుడిని వీక్షించడం వల్ల ఈ రాశివారికి గజకేసరి యోగంతో పాటు ధన ధాన్య సమృద్ధి యోగం కూడా ఏర్పడింది. దీనివల్ల ఉద్యోగంలో తప్పకుండా ఉన్నత పదవి లభిస్తుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. ఎటువంటి ఆదాయ ప్రయత్నమైనా కలిసి వస్తుంది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందే అవకాశం ఉంది.
  2. కర్కాటకం: ఈ రాశిలో ఉచ్ఛ గురువుతో కలిసి ఉన్న బుధ, శుక్రులకు, సప్తమంలో ఉన్న చంద్రుడికి సమ సప్తక దృష్టి ఏర్పడినందు వల్ల ఈ రాశివారికి అద్భుతమైన గజకేసరి, కుబేర యోగం ఏర్పడ్డాయి. దీనివల్ల రాజపూజ్యాలు కలుగుతాయి. రాజయోగాలు, ధన యోగాలు కలుగుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో ప్రాభవం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటలో పయనిస్తాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది.
  3. కన్య: పంచమ స్థానంలో ఉన్న చంద్రుడికి, లాభ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువుకు, బుధ, శుక్రులకు దృష్టి ఏర్పడడం వల్ల ఈ రాశివారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. జీవితంలో ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. శత్రు, రోగ, రుణ సమస్యల మీద పైచేయి సాధిస్తారు. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉన్నత వర్గాలతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. శుభవార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది.
  4. తుల: ఈ రాశికి చతుర్థ స్థానంలో ఉన్న చంద్రుడిని దశమ స్థానంలో ఉన్న మూడు శుభ గ్రహాలు చూడడం వల్ల ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో పదోన్నతికి లేదా హోదా పెరగడానికి అవకాశం ఉంటుంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారే అవకాశం కూడా ఉంది. నిరుద్యోగులకు ఊహించని ఉద్యోగ లాభం కలుగుతుంది. ఈ మూడు రోజుల్లో శుభ వార్తలు ఎక్కువగా వింటారు. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. ఆస్తుల విలువ బాగా పెరుగుతుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. మకరం: ఈ రాశిలో ఉన్న చంద్రుడిని సప్తమ స్థానం నుంచి గురు, బుధ, శుక్రులు వీక్షించడం వల్ల గజ కేసరి యోగంతో పాటు ధన ధాన్య సమృద్ధి యోగం కూడా కలిగింది. రాజపూజ్యాలు కలుగుతాయి. ఉద్యోగంలోనే కాక, వృత్తి, వ్యాపారాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా ఘన విజయాలు సాధిస్తారు. శత్రు, రోగ, రుణ సమస్యల నుంచి చాలావరకు విముక్తి కలుగుతుంది. అనేక విధాలా ఆదాయం పెరిగి, ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. గృహ, వాహన యోగాలు పడతాయి.
  7. మీనం: ఈ రాశికి లాభ స్థానంలో ఉన్న చంద్రుడిని రాశ్యధిపతి గురువుతో పాటు శుక్ర, బుధులు కూడా వీక్షించడం వల్ల రాజయోగాలు కలుగుతాయి. సమాజంలో ఒక ప్రముఖుడుగా గుర్తింపు పొందడం జరుగుతుంది. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. అనేక వైపుల నుంచి ఆదాయం కలిసి వస్తుంది. ఉద్యోగంలో జీతభత్యాలు బాగా పెరగడంతో పాటు, పదోన్నతి కూడా లభిస్తుంది. ఉన్నత స్థాయి కుటుంబంతో ప్రేమలో పడడం లేదా పెళ్లి కుదరడం జరుగుతుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది.

Also Read: చంద్ర బలంతో వారికి పట్టిందల్లా బంగారమే..! ఇందులో మీ రాశి ఉందా..?

Follow Us