AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor Chinna : ఆయన పెద్ద హీరో.. అయినా నా కాళ్ల దగ్గర కూర్చోని చేసిన పనికి ఆశ్చర్యపోయా.. నటుడు చిన్నా..

విభిన్నమైన సినిమాలు.. వైవిధ్యమైన పాత్రలతో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు చిన్నా. దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు. ఇప్పటికీ అటు సినిమాలు.. ఇటు సీరియల్స్ ద్వారా సినీ ప్రియులను అలరిస్తున్నారు. గతంలో చిన్నా ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరలవుతున్నాయి. అలాగే ఓ స్టార్ హీరో గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Actor Chinna : ఆయన పెద్ద హీరో.. అయినా నా కాళ్ల దగ్గర కూర్చోని చేసిన పనికి ఆశ్చర్యపోయా.. నటుడు చిన్నా..
Chinna
Rajitha Chanti
|

Updated on: Jun 25, 2026 | 11:29 AM

Share

తెలుగు వెండితెరపై ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన సీనియర్ నటుడు చిన్నా. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ‘శివ’, ‘మనీ’ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో సహాయక పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరించిన ఆయన.. కేవలం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానే కాకుండా విలన్‌గా, హీరోగానూ నటించి ఆకట్టుకున్నారు. వెండితెరపై సుదీర్ఘ ప్రయాణం చేసిన చిన్నా, ప్రస్తుతం బుల్లితెరపై సీరియల్స్‌తో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. వైవిధ్యమైన పాత్రలతో ప్రస్తుతం ఫ్యామిలీ ఆడియన్స్‌కు మరింత దగ్గరవుతున్నారు. ఇటీవల ఇచ్చిన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో చిన్నా తన సినీ ప్రయాణంలో ఎదురైన అనుభవాలను, పరిశ్రమలోని ప్రముఖులతో తనకున్న వ్యక్తిగత అనుబంధాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను హైదరాబాద్‌కు వచ్చిన కొత్తలో ప్రముఖ నిర్మాత కే.ఎస్. రామారావు బలవంతం చేయడంతోనే ఫిలిం నగర్ క్లబ్‌లో సభ్యత్వం తీసుకున్నానని వెల్లడించారు.

అయితే, సినీ గ్లామర్ ప్రపంచంలో ఉన్నప్పటికీ తన వ్యక్తిగత జీవితం చాలా సాదాసీదాగా ఉంటుందని చిన్నా చెప్పుకొచ్చారు. ఇక తాను నటించిన పెద్ద హీరోలలో నందమూరి బాలకృష్ణ చాలా సరదాగా, ఒక చిన్నపిల్లాడిలా ఉంటారని చెప్పారు. వారిద్దరి మధ్య ఉన్న ఒక మధురమైన రైలు ప్రయాణ అనుభవాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. ఒకసారి బాలకృష్ణ తన కుమార్తె బ్రాహ్మణి వివాహ పత్రికలను ఎంపిక చేయడానికి వెళ్తున్నప్పుడు, ఇద్దరూ కలిసి ఒకే ఏసీ కంపాట్మెంట్ లో ప్రయాణించాల్సి వచ్చిందని అన్నారు. ఆ సమయంలో బాలకృష్ణ చూపించిన నిరాడంబరత తనను ఆశ్చర్యపరిచిందని చిన్నా తెలిపారు. రాత్రి భోజనం చేసిన తర్వాత, ఫస్ట్ క్లాస్ ఏసీలో అటెండర్ ఉన్నప్పటికీ, బాలకృష్ణ స్వయంగా తన ప్లేట్‌ను తీసుకెళ్లి డస్ట్‌బిన్‌లో పడేసి, కడుక్కున్నారని చెప్పారు.

అంతేకాకుండా, తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో తనకు మెలుకువ వచ్చేసరికి, బాలకృష్ణ తన కాళ్ళ దగ్గర కూర్చుని పంచాంగం చదువుతూ కనిపించారని, అంత పెద్ద స్టార్ హీరో అంత ప్రాక్టికల్‌గా ఉండటం గ్రేట్ అని అన్నారు. మరుసటి రోజు ప్రయాణంలో చిన్నా భార్య స్వయంగా వండి పంపిన ‘పాయా పరోటా’ను బాలకృష్ణ ఎంతో తృప్తిగా తిని, ఆమెకు ఫోన్ చేసి “అమ్మ తల్లి.. అద్భుతంగా చేసావు, చాలా థాంక్స్ అని అభినందించినట్లు తెలిపారు. బాలకృష్ణకు ప్రేమ ఎక్కువ కాబట్టే, కొన్నిసార్లు కోపం కూడా ఎక్కువే ఉంటుందని ఆయన అన్నారు. మహేష్ బాబు నటించిన ‘మురారి’ సినిమా షూటింగ్ రోజులను కూడా చిన్నా గుర్తుచేసుకున్నారు. మహేష్ బాబు కెరీర్ ఆరంభంలో (మూడో లేదా నాలుగో సినిమా) చేసిన మురారి సెట్స్‌లో వాతావరణం అంతా ఒక కుటుంబంలా ఉండేదని, మహేష్ చాలా మంచి వ్యక్తి అని చెప్పారు. ఘట్టమనేని కుటుంబంతో తనకు తరాల అనుబంధం ఉందని చెప్తూ.. తాను కృష్ణ డైరెక్షన్‌లో, కృష్ణ గారితో, రమేష్ బాబుతో, మహేష్ బాబుతో , రమేష్ బాబు కుమారుడితో కూడా నటించానని, ఇక మహేష్ బాబు కుమారుడు గౌతమ్‌తో నటించడం ఒక్కటే బ్యాలెన్స్ ఉందని నవ్వుతూ చెప్పారు.

ఎక్కువమంది చదివినవి : Cinema : ఇదెక్కడి డిమాండ్ రా బాబూ.. ప్రేమ, ద్రోహం, ప్రతీకారం.. ఓటీటీలో దూసుకుపోతున్న వెబ్ సిరీస్..

బాలకృష్ణ ఫోటో..

Chinna, Balakrishna

Chinna, Balakrishna

ఎక్కువమంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరో.. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్.. కానీ తెలుగులో అట్టర్ ప్లాప్.. కారణం ఇదే..

Follow Us