Nitish Kumar Reddy: ఇది తెలుగోడి బ్రాండ్ అంటే.. ఆసీస్ గడ్డపై టాలీవుడ్ హీరోలను గుర్తు చేసిన నితీశ్ రెడ్డి

ఇది సెంచరీ కాదు పుష్పా.. అంతకుమించి.. ఆస్ట్రేలియా గడ్డపై తెలుగోడి వైల్డ్ ఫైర్ బ్యాటింగ్‌ పవర్‌ ఇది. హాఫ్‌ సెంచరీ తర్వాత పుష్ప స్టయిల్‌లో తగ్గేదే లేదంటూ సెలబ్రేషన్స్‌ చేసుకున్న నితీశ్‌ కుమార్‌ రెడ్డి... సెంచరీ చేశాక...సలార్‌లో ప్రభాస్‌ని ఇమిటేట్‌ చేస్తూ సెలబ్రేట్‌ చేసుకున్నాడు

Nitish Kumar Reddy: ఇది తెలుగోడి బ్రాండ్ అంటే.. ఆసీస్ గడ్డపై టాలీవుడ్ హీరోలను గుర్తు చేసిన నితీశ్ రెడ్డి
Nitish Kumar Reddy
Follow us
Basha Shek

|

Updated on: Dec 28, 2024 | 8:00 PM

మెల్‌బోర్న్‌ టెస్ట్‌లో అద్భుతమైన శతకంతో మెరిసిన నితీశ్‌ కుమార్‌ రెడ్డి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరినీ గర్వపడేలా చేశాడు. విశాఖకు చెందిన నితీష్‌.. 21 ఏళ్ల 214 రోజుల వయసులోనే ఆసీస్‌ గడ్డపై సెంచరీ సాధించాడు. తద్వారా ఆసీస్‌ గడ్డపై సెంచరీ సాధించిన మూడో అత్యంత పిన్న వయస్కుడైన భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. క్రికెట్‌ దిగ్గజం​ సచిన్‌ 18 ఏళ్ల 253 రోజుల వయసులో ఆసీస్‌ గడ్డపై సెంచరీ సాధించగా.. రిషబ్‌ పంత్‌ 21 ఏళ్ల, 91 రోజుల వయసులో ఆస్ట్రేలియాలో శతకొట్టాడు.

భారత క్రికెట్‌లో సరికొత్త ధృవ తార అవతరించింది. నితీశ్‌ కుమార్‌ రెడ్డి రూపంలో టీమిండియాకు మరో ఆణిముత్యం దొరికాడు. మెల్‌బోర్న్‌ టెస్ట్‌లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగిన నితీశ్‌.. సహచరుడు వాషింగ్టన్‌ సుందర్‌ను సమన్వయపరుచుకుంటూ అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. బాక్సింగ్‌ డే టెస్ట్‌లో నితీశ్‌ చేసిన సెంచరీ ఆషామాషీ సెంచరీ కాదు. భారత క్రికెట్‌ అభిమానులకు ఈ సెంచరీ ఎప్పటికీ గుర్తుంటుంది. అరంగేట్రం సిరీస్‌లోనే సూపర్‌ సెంచరీతో మెరిసిన నితీశ్‌ విశ్వవ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానుల మన్ననలందుకుంటున్నాడు. నితీశ్‌ ఆగమనంతో భారత క్రికెట్‌ సరికొత్త ధృవ తార అవతరించిందని క్రికెట్‌ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. సునీల్‌ గవాస్కర్‌ లాంటి దిగ్గజం నితీశ్‌ సెంచరీని అద్వితీయమైనదిగా అభివర్ణించాడు. ఆసీస్‌ సిరీస్‌లో నితీశ్‌ ఆది నుంచి అద్భుతంగా ఆడుతున్నాడు. ఈ సిరీస్‌లో నితీశ్‌ బ్యాట్‌తో పాటు బంతితోనూ రాణించాడు. నితీశ్‌.. ఈ సిరీస్‌లో భారత్‌ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఈ సెంచరీతో నితీశ్‌ ఆసీస్‌ గడ్డపై సరికొత్త చరిత్ర సృష్టించాడు. భారత్‌ తరఫున ఎనిమిదో స్థానంలో బరిలోకి దిగి సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.

ఇవి కూడా చదవండి

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నాలుగో మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా పునరాగనం చేసింది. తెలుగబ్బాయ్ నితీష్ కుమార్ రెడ్డి సెంచరీతో మెల్‌బోర్న్ టెస్ట్‌లో భారత జట్టు ఫాలో ఆన్‌ను తప్పించుకోవడమే కాకుండా.. మూడో రోజు దాదాపుగా బ్యాటింగ్ చేసింది. దీంతో ఈ టెస్ట్ ఫలితం డ్రాగా ముగిసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్లకు 358 పరుగులు చేసింది. భారత జట్టు ఇంకా 116 పరుగుల వెనుకంజలో నిలిచింది. నితీష్ రెడ్డి, మహ్మద్ సిరాజ్ అజేయంగా నిలిచారు.

పుష్ప రాజ్ ను అనుకరిస్తూ..

టెస్టు కెరీర్‌లో తొలి సెంచరీ పూర్తి చేసుకున్న నితీష్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇది కేవలం సెంచరీ కాదని, భారత జట్టు మ్యాచ్‌లో రీఎంట్రీ చేసేలా చేస్తోందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నితీష్ రెడ్డి కూడా తన తొలి టెస్ట్ సెంచరీని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. ముందుగా హాఫ్ సెంచరీ పూర్తి చేసిన వెంటనే పుష్ప స్టైల్‌లో బ్యాట్ తిప్పిన నితీష్ రెడ్డి.. అనంతరం సెంచరీతో మరో అడుగు ముందుకేసి ట్రావిస్ హెడ్‌కు గట్టి కౌంటర్‌గా వైల్డ్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. సెంచరీ పూర్తి చేసిన వెంటనే నితీష్ రెడ్డి.. నేలపై మోకాళ్లపై కూర్చుని, తన బ్యాట్‌ను నేలపై ఉంచి, దానిపై హెల్మెట్‌ను పెట్టి సంబరాలు చేసుకున్నాడు. అలాగే, ఆకాశం వైపు చూస్తూ దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ కనిపించాడు.

సలార్ స్టైల్ లో..

ఈ క్రమంలో తన కుమారుడి ఆటను ప్రత్యక్షంగా చూస్తోన్న నితీష్‌ తండ్రి ముత్యాలరెడ్డి ఉద్వేగానికి గురయ్యారు. సెంచరీకి చేరువలో ఉన్నప్పుడు ఆయన పడిన టెన్షన్‌ అంతా ఇంతా కాదు. ఈ క్రమంలో నితీష్ రెడ్డి సెంచరీ పూర్తి చేసిన వెంటనే ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ గిల్ క్రిస్ట్ ఓ స్పెషల్ ఇంటర్య్వూ చేశాడు. ఈ క్రమంలో నితీష్ రెడ్డి తండ్రి మాట్లాడుతూ “మా కుటుంబానికి ఇది ఒక ప్రత్యేకమైన రోజు. ఈ రోజును మా జీవితంలో మర్చిపోలేం. నితీష్ 14-15 సంవత్సరాల వయస్సు నుంచి మంచి ప్రదర్శన చేస్తున్నాడు. ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌లో, ఇది చాలా ప్రత్యేకమైన అనుభూతి. నితీష్ 99 పరుగులతో ఉన్నాడు. 9 వికెట్లు పడిపోయాయి. నేను చాలా టెన్షన్‌లో ఉన్నాను. సిరాజ్‌‌కి కృతజ్ఞతలు’ అంటూ భావోద్వేగం చెందారు. ఇది తమకుగ్రేట్‌ మూమెంట్‌, స్పెషల్‌ డే అన్నారు నితీష్‌ కుమార్‌ రెడ్డి ఫాదర్‌ ముత్యాల రెడ్డి.

నితీష్‌కు అభినందనలు తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు. అతడి ప్రదర్శనంతో దేశం మొత్తం గర్వపడుతోందన్నారు చంద్రబాబు. ఇక నితీష్‌కు అభినందనలు తెలిపింది ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్. అతడికి 25 లక్షల నగదు బహుమతిని ప్రకటించింది. నితీష్‌…ఆస్ట్రేలియా టూర్ నుంచి వచ్చాక ముఖ్యమంత్రి చేతుల మీదుగా బహుమతి అందిస్తామని ప్రకటించిన ACA అధ్యక్షుడు కేశినేని చిన్ని.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!