AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణ ప్రజలకు బిగ్‌ అలర్ట్‌.. భూ భారతి అమల్లోకి వచ్చేదెప్పుడంటే..

ధరణి పోర్టల్‌ పేరుతో బీఆర్‌ఎస్‌ హయాంలో అక్రమాలు జరిగాయన్నది ప్రభుత్వ పెద్దల మాట. అర్ధరాత్రి భూముల రికార్డులు మార్చేశారన్నది ప్రధాన ఆరోపణ. ఈ అక్రమాల నిగ్గు తేల్చేందుకు ధరణి పోర్టల్‌ లావాదేవీలపై ఫోరెన్సిక్‌ ఆడిటింగ్‌ జరుపుతామని రేవంత్‌ సర్కార్‌ ప్రకటించడంతో రెవెన్యూ శాఖలో గుబులు రేపుతోంది. మరి ఏయే లావాదేవీలపై ఆడిటింగ్‌ చేస్తారు? ఎవరిని బాధ్యులుగా తేలుస్తారు? జనవరి 1వ తేదీ తర్వాత తెలంగాణలో భూ ప్రకంపనలు రాబోతున్నాయా..?

Telangana: తెలంగాణ ప్రజలకు బిగ్‌ అలర్ట్‌.. భూ భారతి అమల్లోకి వచ్చేదెప్పుడంటే..
Bhu Bharathi
Shaik Madar Saheb
|

Updated on: Dec 28, 2024 | 9:26 PM

Share

తెలంగాణ ప్రజలకు బిగ్‌ అలర్ట్‌.. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి నూతన ఆర్వోఆర్ చట్టం జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. ధరణి పోర్టల్ బాధ్యతలు చూస్తున్న టెర్రాసిస్ గడువు డిసెంబర్ 31 వ తేదీతో ముగిసిపోనుండగా ధరణి పోర్టల్‌కు కాలం చెల్లిపోనుంది. దీంతో భూభారతి పోర్టల్ ను నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ పూర్తి స్థాయిలో నిర్వహించనుంది. ధరణి పోర్టల్ పూర్తి వివరాలను NICకి టెర్రాసిస్ బదిలీ చేయనుంది. ఈ తతంగం పూర్తి కాగానే భూ రికార్డులపై ఫోరెన్సిక్ ఆడిటింగ్ నిర్వహించేందుకు రేవంత్‌ సర్కార్‌ యాక్షన్‌ ప్లాన్‌ రెడీ చేసింది. దీంతో రెవెన్యూ శాఖ అధికారుల్లో గుబులు మొదలైంది.

ధరణి పోర్టల్‌ వేదికగా నిషేధిత జాబితాలో ఉన్న భూముల్లో అక్రమ లావాదేవీలు జరిగాయని ప్రభుత్వం భావిస్తోంది. రాత్రికిరాత్రి నిషేధిత జాబితాను అన్‌లాక్‌ చేసి వారికి కావాల్సిన సర్వే నంబర్‌ను తొలగించి మళ్లీ ఆ జాబితాను లాక్‌ చేశారన్నది ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో నిషేధిత జాబితా భూములే టార్గెట్‌గా ఈ ఆడిటింగ్‌ జరగొచ్చనే చర్చ రెవెన్యూ వర్గాల్లో జరుగుతోంది. ఇప్పటికే రాత్రికి రాత్రే వందల ఎకరాలు కొల్లగొట్టారని స్పష్టం చేశారు ప్రభుత్వ పెద్దలు. దీంతో అర్థరాత్రి వేళ ఎవరు లాగిన్ అయ్యారు? ఏ సర్వర్ నుంచి ఏ ఐపీ అడ్రస్‌ లావాదేవీలు చేశారు. ఏ సర్వే నెంబర్ నిషేధిత జాబితా నుంచి తొలగించారు? అనే అంశాలపై ప్రభుత్వం ఫోకస్ చేయనుంది. ఫోరెన్సిక్ ఆడిట్‌లో ధరణి లావాదేవీలు ట్రాన్సాక్షన్ హిస్టరీ ద్వారా కీలక విషయాలు వెల్లడి కానున్నట్లు ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. సుమారు 2 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తుల పరం అయ్యినట్టు ఇటీవల వెల్లడించారు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క. నిషేధిత జాబితా భూములు రాత్రికి రాత్రే ఓ పెద్ద మనిషి సమక్షంలో డీల్ జరిగిందంటూ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇప్పుడీ ఫోరెన్సిక్ ఆడిటింగ్ పై ఆసక్తి నెలకొంది.

ఒక్క హైదరాబాద్ పరిధిలో సుమారు 15వేల ఎకరాలు హాం ఫట్ అయినట్టు గవర్నమెంట్‌ పెద్దల మాట. 2014 నుంచి రికార్డులు పరిశీలించి ధరణి పోర్టల్ లావాదేవీల‌పై ఫోరెన్సిక్ ఆడిటింగ్ చేయిస్తోంది. ఫోరెన్సిక్ ఆడిట్ తర్వాత విచారణ కమిటీ వేసి దోషులను తేల్చే ప్రక్రియను స్పీడప్‌ చేయనున్నారు. దీంతో అప్పటి ప్రభుత్వ పెద్దల పాత్రతోపాటు రెవెన్యూ కీలక అధికారుల గుట్టు బయటపడనుంది. అయితే ఎవరెవరి బాగోతాలు బయటపడుతాయంటూ రెవెన్యూ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..