AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: డిగ్రీ సిలబస్‌ మారుతుందోచ్‌.. విద్యార్ధులూ ఇది గుర్తుపెట్టుకోండి

తెలంగాణలో డిగ్రీ సిలబస్ మారబోతుంది. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల పరిధిలోని డిగ్రీ కోర్సుల్లో ఒకే సిలబస్ అందుబాటులోకి తెచ్చేందుకు హయర్ ఎడ్యూకేషన్ చర్యలు తీసుకుంటుంది. వచ్చే అకాడమిక్ ఇయర్ అంటే 2025-2026 నుంచే అమలు చేసే దిశగా కొత్త సిలబస్ తయారీలో ఉన్నతవిద్యామండలి నిమగ్నమైనట్లు తెలుస్తోంది.

Telangana: డిగ్రీ సిలబస్‌ మారుతుందోచ్‌.. విద్యార్ధులూ ఇది గుర్తుపెట్టుకోండి
Students
Vidyasagar Gunti
| Edited By: Ravi Kiran|

Updated on: Dec 29, 2024 | 6:30 AM

Share

రాష్ట్రంలో ఉన్నత విద్యలో నాణ్యత పెంపుతో పాటు ఉద్యోగ నైపుణ్యాలు పెంచాలన్న సంకల్పంతో విద్యాశాఖ అడుగులు వేస్తోంది. అందుకు తగ్గట్లు డిగ్రీ సిలబస్ లో క్వాలిటీతో పాటు జాబ్ ఓరియంటెడ్ సిలబస్ రెడీ చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే నాలుగు స్పెషల్ కమిటీలు ఏర్పాటు చేశారు. వీరు త్వరిగతిన సిలబస్ రెడీ చేస్తే అన్ని యూనివర్సిటీల పరిధిలో ఒకే సిలబస్ వచ్చే ఏడాది నుంచి అమలులోకి రానుంది. కామర్స్, లా, మేనేజ్మెంట్ కోర్సుల సిలబస్ తయారీ కోసం హైయర్ ఎడ్యూకేషనల్ కౌన్సిల్ చైర్మన్ బాలకిష్టారెడ్డి అధ్యక్షతన సబ్జెక్టు నిపుణులతో కమిటీ వేశారు. సైన్స్ సబ్జెక్టులకు సంబంధించి కౌన్సిల్ వైస్ చైర్మన్ మహమూద్, సోషల్ సైన్సెస్ కోర్సుల కోసం వైస్ చైర్మన్ పురుషోత్తం, ఇంజినీరింగ్ సహా ఇతర కోర్సులకు కౌన్సిల్ సెక్రెటరీ శ్రీరామ్ వెంకటేశ్ నేతృత్వంలో కమిటీలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ కమిటీలు పలు సమావేశాలు నిర్వహించి అభిప్రాయాలు సేకరించారు.

రాష్ట్రవ్యాప్తంగా వెయ్యికి పైగా డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. దాదాపు రెండున్నర లక్షల మంది విద్యార్థుల ఈ కాలేజీల్లో చేరుతున్నారు. డిగ్రీలోని బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ కోర్సులతో పాటు సుమారు 300 వందల అనుబంధ కోర్సులు ఉన్నాయి. బకెట్ సిస్టమ్ వచ్చాక వందల సంఖ్యలో కాంబినేషన్ కోర్సులు పెరిగాయి. కొత్త కోర్సులకు తగ్గట్లు సిలబస్ లేదన్న ఫిర్యాదులు ఉన్నాయి. దీంతో డిగ్రీ మొత్తం ఒకే సిలబస్ తీసుకురావాలని హయర్ ఎడ్యూకేషన్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. గతంలోని సిలబస్ మార్పుకు చర్యలు తీసుకున్న కొన్ని సబ్జెక్టులకు మాత్రమే పరిమితమైంది.

మరోవైపు ఇంజినీరింగ్. డిగ్రీలో ఇచ్చే క్రెడిట్స్ ను కూడా మార్చే దిశగా ఉన్నతవిద్యామండలి ఆలోచిస్తోంది. ఇంజినీరింగ్ లో ఉన్న 160 క్రెడిట్స్ కు అదనంగా మరో 10 పెంచి 170 క్రెడిట్స్ చేయాలని భావిస్తున్నారు. డిగ్రీలో మాత్రం ప్రస్తుతం ఉన్న 150 క్రెడిట్స్ కంటే తక్కువగా 120 సరిపోతుందని విద్యాశాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: డ్యూటీకి వెళ్లి తిరిగి ఇంటికొచ్చిన వ్యక్తి.. గుమ్మం దగ్గర కనిపించింది చూడగా

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి