ఆమిర్ ఖాన్ దంపతులతో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ భేటీ.. కాశ్మీర్ లో త్వరలో అమలు కానున్న కొత్త ఫిల్మ్ పాలసీ
బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్, చిత్ర నిర్మాత, దర్శకురాలు కూడా అయిన కిరణ్ రావుతో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా భేటీ అయ్యారు. శనివారం శ్రీనగర్ లోని రాజ్ భవన్ లో తనను కలుసుకున్న వీరితో ఆయన సుమారు గంటసేపు పైగా వివిధ అంశాలపై చర్చించారు.
బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్, చిత్ర నిర్మాత, దర్శకురాలు కూడా అయిన కిరణ్ రావుతో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా భేటీ అయ్యారు. శనివారం శ్రీనగర్ లోని రాజ్ భవన్ లో తనను కలుసుకున్న వీరితో ఆయన సుమారు గంటసేపు పైగా వివిధ అంశాలపై చర్చించారు. ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో త్వరలో అమలులోకి రానున్న ఫిల్మ్ పాలసీ గురించి తాము ప్రధానంగా చర్చించినట్టు మనోజ్ సిన్హా ట్వీట్ చేశారు. ఈ పాలసీ విధివిధానాలు, బాలీవుడ్ చిత్రాల్లో దీన్ని హైలైట్ చేయడానికి గల అవకాశాలు తమ చర్చల్లో ప్రస్తావనకు వచ్చాయన్నారు. టూరిస్టుల స్వర్గ ధామంగా పాపులర్ అయిన జమ్మూ కాశ్మీర్ ‘గ్లోరీ’ ని బాలీవుడ్ తిరిగి వెండితెర పైకి తేవాలని కోరానని ఆయన వెల్లడించారు. లోగడ పలు హిందీ సినిమాల షూటింగులు ఇక్కడే జరిగేవి. ఇక్కడి అందమైన లొకేషన్స్ లో షూటింగులు జరిగేవని ఆమిర్ ఖాన్ కూడా పేర్కొన్నాడు. ఫిల్మ్ టూరిజాన్ని ప్రమోట్ చేసేందుకు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం నూతన ఫిల్మ్ పాలసీని ఖరారు చేసింది. దీనివల్ల లోకల్ ఆర్టిస్టులను ప్రోత్సహించడానికి వీలవుతుంది.
కాగా- తాము డైవోర్స్ తీసుకుంటున్నట్టు ఆమిర్ ఖాన్, కిరణ్ రావు లోగడ ప్రకటించినప్పటికీ..తమ ‘లాల్ సింగ్ ఛాధ్ధా ‘ మూవీ ప్రమోషన్ లో ఇద్దరూ బిజీగా ఉన్నారు. ఇటీవల వీరు కార్గిల్ ని కూడా విజిట్ చేశారు. పైగా లడాఖ్ లో స్థానిక గిరిజన యువతులతో కలిసి ఈ జంట డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అయింది. తాము విడాకులు తీసుకుంటున్నా స్నేహితుల్లా కలిసి మెలిసి ఉంటామని ఈ జంట ఆ నాడే స్పష్టం చేసింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Murder: అల్లుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న అత్త.. భర్త అడ్డుగా ఉన్నాడని.. చిత్తూరులో దారుణం.
RRR Movie: రామరాజు- భీమ్‌ల స్నేహబంధం… పడమాగ్నికి జడివానకు దోస్తీ..