RRR Movie: రామరాజు- భీమ్‌‌‌ల స్నేహబంధం… పడమాగ్నికి జడివానకు దోస్తీ..

కేవలం తెలుగు ప్రేక్షకులే కాదు.. యావత్ సినీ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోన్న సినిమా ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం).

RRR Movie: రామరాజు- భీమ్‌‌‌ల స్నేహబంధం... పడమాగ్నికి జడివానకు దోస్తీ..
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 01, 2021 | 12:24 PM

RRR Movie: కేవలం తెలుగు ప్రేక్షకులే కాదు.. యావత్ సినీ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోన్న సినిమా ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం). దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కితోన్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారన్న విషయం తెలిసిందే. జక్కన ఎంతో ప్రతిష్టాత్మకంగా చెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజుగా, తారక్ గిరిజన వీరుడు కొమురం భీమ్ గా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు టీజర్లు సినిమా పై అంచనాలను తారాస్థాయికి చేర్చాయి. గత మూడేళ్ళుగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం చివరి దశకు వచ్చేసింది. ఒక సాంగ్ మినహా షూటింగ్ మొత్తం పూర్తి అయింది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో షూటింగ్ తో పాటుగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జెట్ స్పీడ్ తో కంప్లీట్ చేస్తున్నాడు జక్కన్న. చెప్పిన సమయానికి సినిమాని రెడీ చేయడానికి డే అండ్ నైట్ కష్ట పడుతున్నారు.

Rrr

ఇదిలా ఉంటే ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన జక్కన్న అండ్ టీమ్.. తాజాగా ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా కీరవాణి స్వరపరిచిన ఫస్ట్ సింగిల్ ”దోస్తీ” అనే పాటను విడుదల చేశారు. అనిరుధ్ రవిచంద్రన్ – అమిత్ త్రివేది – విజయ్ ఏసుదాసు – యాజిన్ నజీర్ వంటి ఐదుగురు ప్రముఖ సింగర్స్ ఈ సాంగ్ ను పాడారు. తెలుగు వెర్సన్ పాటను హేమచంద్ర ఆలపించగా.. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించారు.

మరోసారి కీరవాణి తన సంగీతంతో మెస్మరైజ్ చేశారు. అలాగే  సీతారామశాస్త్రి సాహిత్యం ప్రతీ లైన్ ను అద్భుతంగా రాశారు. కల్పిత కథతో రూపొందుతున్న బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా ‘ఆర్.ఆర్.ఆర్’లో అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్.. కొమురం భీమ్ గా ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఇందులో ఆలియా భట్ – హాలీవుడ్ భామ ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్ దేవగణ్ – శ్రియ – సముద్రఖని ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఇప్పటికే అన్ని భాషలకు సంబంధించిన బిజినెస్ క్లోజ్ చేశారు. ఆడియో రైట్స్ ని కూడా భారీ ధరకు అమ్మేశారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Annaatthe : ఆ వార్తల్లో నిజంలేదు.. రజినీకాంత్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన మేకర్స్..

Venkatesh: సంక్రాంతికి వచ్చి సందడి చేస్తా.. ఎఫ్3 రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన వెంకటేష్..

Pushpa : విలనిజంతో మరోసారి భయపెట్టడానికి సిద్ధమవుతోన్న సునీల్.. పుష్పలో ఫహాద్‌‌‌ను మించి

Priyanka Jawalkar : బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఆకట్టుకొంటున్న తెలుగమ్మాయి..