శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోన్న హన్సిక సినిమా.. థ్రిల్లర్ మూవీతో రానున్న బాబ్లీ బ్యూటీ.
Hansika Motwani : గ్లామరస్ బ్యూటీ హన్సిక ఈ మధ్య కాస్త జోరు తగ్గించింది. దేశముదురు సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ఈ చిన్నది.

Hansika Motwani : గ్లామరస్ బ్యూటీ హన్సిక ఈ మధ్య కాస్త జోరు తగ్గించింది. దేశముదురు సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ఈ చిన్నది. ఆ తర్వాత వరుసగా ఛాన్సులు దక్కించుకుంటూ దూసుకుపోతోంది. తెలుగు, తమిళ్ భాషల్లో వరుసగా సినిమాలు చేసిన హన్సిక.. ఈ మధ్య చిన్న బ్రేక్ తీసుకుంది. ముద్దుగా బొద్దుగా ఉండే ఈ భామకు తమిళ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. హన్సిక అభిమానులు ఆమెకు అక్కడ గుడి కూడా కట్టారు. కానీ కొత్త హీరోయిన్ల రాకతో ఈ బ్యూటీకి ఇప్పుడు ఆఫర్లు తగ్గాయి. ఈ మధ్య కాలంలో ఆశించిన స్థాయిలో హిట్టు కూడా పడలేదు. ఇక ఇప్పుడు ఓ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకులను ముందుకు రావడానికి సిద్దమవుతోంది. చాలా కాలం తర్వత ఆమె తెలుగులో ఒక సినిమాను ఒప్పుకుంది.
మై నేమ్ ఈజ్ శ్రుతి అనే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లో హన్సిక నటిస్తోంది. ఈ సినిమాకి శ్రీనివాస్ ఓంకార్ దర్శకుడిగా వ్యవహరిస్తుండగా రమ్య – నాగేంద్రరాజు నిర్మిస్తన్నారు. రీ సెంట్ గా ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ ను పూర్తిచేసుకుంది. అలాగే ఆగస్టు రెండవ వారంలో రెండవ షెడ్యూల్ మొదలుకానుంది. వీలైనంతగా షూటింగ్ కంప్లీట్ చేసి సినిమాను విడుదల చేయాలనీ మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో, మురళీశర్మ .. ఆడుకాలం నరేన్ కీలకపాత్రల్లో నటిస్తోన్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :




