AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Annaatthe : ఆ వార్తల్లో నిజంలేదు.. రజినీకాంత్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన మేకర్స్..

సూపర్ స్టార్ రజినీకాంత్ త్వరలో అన్నతే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమైన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మొదలైన దగ్గరనుంచి అనేక కారణాల కారణంగా..

Annaatthe : ఆ వార్తల్లో నిజంలేదు.. రజినీకాంత్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Supar Star
Rajeev Rayala
|

Updated on: Aug 01, 2021 | 9:59 AM

Share

Annaatthe : సూపర్ స్టార్ రజినీకాంత్ త్వరలో అన్నతే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమైన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మొదలైన దగ్గరనుంచి అనేక కారణాల కారణంగా వాయిదా పడుతా వస్తోంది. సినిమా మొదలైన తర్వాత రజినీకాంత్ పాలిటిక్స్‌‌‌‌లోకి వెళ్ళడానికి సిద్దమయ్యారు ఆ సమయంలో షూటింగ్ ను పక్కన పెట్టేసి. పాలిటికల్ ఎంట్రీ పైనే దృష్టి పెట్టారు. అదే సమయంలో ఆయన అనారోగ్యానికి గురవ్వడంతో రాజకీయాల్లోకి రావాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఆతర్వాత కొన్ని రోజు విశ్రాంతి తీసుకొని తిరిగి సినిమాను మొదలుపెట్టారు. ఆతర్వాత కరోనా ఎంటర్ అయ్యింది. దాంతో మరోసారి షూటింగ్ వాయిదా పడింది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌‌‌ను తిరిగి ప్రారంభించారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను అనుకున్న తేదీకి విడుదుల చేయాలని సన్నాహాలు చేస్తున్న చిత్రయూనిట్. భారీ బడ్జెట్ తో .. భారీ తారాగణంతో ‘అన్నాత్తే’ రూపొందుతోంది. ఖుష్బూ .. మీనా .. నయనతార.. కీర్తి సురేశ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణకానున్నారు.

ఎమోషన్  కూడిన యాక్షన్ ఎంటర్టైనర్‌‌‌‌గా ‘అన్నాత్తే’ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే  ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. వచ్చేనెలలో షూటింగు పార్టు పూర్తవుతుందని తెలుస్తోంది. ముందుగా ఈ సినిమా దీపావళి కనుకగా విడుదల చేయాలని చిత్రయూనిట్ నిరాంయించుకుంది. అయితే షూటింగ్ వాయిదా పడుతూ వస్తుండటంతో అనుకున్నతేదీకి సినిమా విడుదలకాకపోవచ్చు అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఆ ప్రచారంలో నిజం లేదనే అంటున్నారు మేకర్స్. ముందుగా చెప్పినట్టుగా దీపావళి కానుకగా నవంబర్ 4వ తేదీనే ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు చెబుతున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Venkatesh: సంక్రాంతికి వచ్చి సందడి చేస్తా.. ఎఫ్3 రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన వెంకటేష్..

Pooja Hegde: ధనుష్‌కు జోడీగా పూజా.. క్రేజీ ఆఫర్‌ దక్కించుకున్న బుట్టబొమ్మ.. వీడియో

Pushpa : విలనిజంతో మరోసారి భయపెట్టడానికి సిద్ధమవుతోన్న సునీల్.. పుష్పలో ఫహాద్‌‌‌ను మించి

Priyanka Jawalkar : బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఆకట్టుకొంటున్న తెలుగమ్మాయి..