Mehaboob Dil Se : మెహబూబ్ దిల్ సే బర్త్ డే సెలబ్రేషన్స్‌లో ఆగమాగం చేసిన సోహెల్..
పూర్వ విద్యార్థులు కలిస్తే ఎంత హంగామా చేస్తారో.. అంతే హంగామా చేస్తూ నెట్టింట వైరల్ అవుతున్నారు బిగ్ బాస్ 4 కంటెస్టెంట్స్...
Mehaboob Dil Se పూర్వ విద్యార్థులు కలిస్తే ఎంత హంగామా చేస్తారో.. అంతే హంగామా చేస్తూ నెట్టింట వైరల్ అవుతున్నారు బిగ్ బాస్ 4 కంటెస్టెంట్స్. షోలతో … పార్టీలతో.. విపరీతంగా చిల్ అవుతూ…నాటి బిగ్‌బాస్ హౌస్ జ్జాపకాలను గుర్తుకుతెచ్చుకుంటున్నారు. ఆ చిల్ అవుట్ ఫోటోలను వీడియోలను సోషల్ మీడియా వేదికలమీద పోస్ట్ చేస్తే నెట్టింట వైరల్ అవుతున్నారు. అయితే మెహబూబ్ దిల్ సే బర్త్‌డే సందర్భంగా మరోసారి కలిశారు ఈ గ్యాంగ్. అతడితో కేక్ కట్ చేయించి… హంగామా చేశారు. అయితే ఈ వీడియోలో మన చాలాకీ బాయ్ సోహైల్ ఎప్పటిలాగే రెచ్చిపోయారు. అల్లరి చేస్తూ.. బర్త్‌డే బాయ్ మెహబూబ్‌ను ఆగమాగం చేస్తూ.. సీన్ సితార్ చేశారు.
ఇక బిగ్ బాస్ తర్వాత ఈ గ్యాంగ్ లో చాలా మంది పాపులర్ అయ్యారు. బిగ్ బాస్ ఫైనల్ కు గెస్ట్ గా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి వీరిపై ప్రశంసలు కురిపించి మరింత హైలైట్ చేశారు. ఇక వారిలో మెహబూబ్ దిల్ సే సోషల్ మీడియలో వీడియోలు చేస్తూ సోషల్ మీడియా స్టార్ అనే క్రెడిట్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు హీరోగా కూడా మారిపోయాడు. మెహబూబ్ దిల్ సే హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. మరో వైపు సోహైల్ కూడా హీరోగాసినిమాలు చేస్తున్నాడు. అలాగే సినిమాలతోపాటు వెబ్ సిరీస్ లు కూడా అవకాశాలు అందుకుంటున్నాడు ఈ సింగరేణి ముద్దుబిడ్డ.
మరిన్ని ఇక్కడ చదవండి :