AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జమ్మూ కాశ్మీర్, లడాఖ్ ప్రాంతాలను సందర్శించనున్న పార్లమెంటరీ కమిటీ.. తాజా పరిస్థితులపై సమీక్ష

హోమ్ వ్యవహారాలపై గల స్టాండింగ్ కమిటీ ఈ నెల 16 నుంచి వారం రోజులపాటు జమ్మూ కాశ్మీర్. లడాఖ్ ప్రాంతాలను సందర్శించనుంది. సీనియర్ కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ నేతృత్వంలోని ఈ కమిటీ ముఖ్యంగా లడాఖ్ లోని నియంత్రణ రేఖ వద్ద పరిస్థితిని సమీక్షిస్తుందని ప్రభుత్వం తెలిపింది

జమ్మూ కాశ్మీర్, లడాఖ్ ప్రాంతాలను  సందర్శించనున్న పార్లమెంటరీ కమిటీ.. తాజా పరిస్థితులపై సమీక్ష
Parliament
Umakanth Rao
| Edited By: Phani CH|

Updated on: Aug 01, 2021 | 11:28 AM

Share

హోమ్ వ్యవహారాలపై గల స్టాండింగ్ కమిటీ ఈ నెల 16 నుంచి వారం రోజులపాటు జమ్మూ కాశ్మీర్. లడాఖ్ ప్రాంతాలను సందర్శించనుంది. సీనియర్ కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ నేతృత్వంలోని ఈ కమిటీ ముఖ్యంగా లడాఖ్ లోని నియంత్రణ రేఖ వద్ద పరిస్థితిని సమీక్షిస్తుందని ప్రభుత్వం తెలిపింది. ఈ కమిటీ సభ్యులు 16 న ఢిల్లీ నుంచి బయల్దేరి..తిరిగి 22 న నగరానికి చేరుకోనున్నారు. జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలోనూ, ఈ కేంద్ర పాలిత ప్రాంతానికి తగిన సమయంలో మళ్ళీ రాష్ట్ర హోదాను పునరుద్దరించే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వం హామీ ఇచ్చిన దృష్ట్యా కూడా ఈ సభ్యుల పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. భారత-చైనా దేశాల మధ్య ఇంకా నివురు గప్పిన నిప్పులా ఉన్న లడాఖ్ లోని వాస్తవాధీన రేఖ వద్ద పరిస్థితిని అధ్యయనం చేసి. అక్కడి ఇండో-టిబెటన్ బోర్డర్ దళం అధికారులతో బాటు .. భారత సైనికాధికారులతో కూడా ఈ కమిటీ చర్చిస్తుంది. లేహ్ లోని అధికారులతో తాము సమావేశాలు నిర్వహిస్తామని, లడాఖ్ అభివృద్ధి, ప్రజల జీవన స్థితిగతుల గురించి తెలుసుకుంటామని ఈ కమిటీ వర్గాలు వెల్లడించాయి.

మొత్తం 31 మంది సభ్యులతో కూడిన బృందం తమ పర్యటనను ఖరారు చేసుకుంది. ఇలా ఉండగా నిన్న భారత-చైనా దేశాల కోర్స్ కమాండర్ స్థాయి అధికారుల మధ్య చర్చలు సుదీర్ఘంగా జరిగాయి. ఉదయం పదిన్నర గంటలకు మొదలైన ఈ చర్చలు రాత్రి ఏడున్నర గంటలవరకు సాగాయి. లడాఖ్ లో గోగ్రా..హాట్ స్ప్రింగ్స్ తదితర ఫ్రిక్షన్ పాయింట్ల నుంచి చైనా తన బలగాలను వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా భారత అధికారులు కోరారు.

మరిన్ని ఇక్కడ చూడండి: India Corona Cases: దేశంలో కొత్తగా 41,831 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల సంఖ్య ఇలా

ఆమిర్ ఖాన్ దంపతులతో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ భేటీ.. కాశ్మీర్ లో త్వరలో అమలు కానున్న కొత్త ఫిల్మ్ పాలసీ

పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!