India Corona Cases: దేశంలో కొత్తగా 41,831 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల సంఖ్య ఇలా

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది.  కొత్తగా 24 గంటల వ్యవధిలో 17,89,472 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా...

India Corona Cases: దేశంలో కొత్తగా 41,831 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల సంఖ్య ఇలా
India Corona Updates
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 01, 2021 | 11:28 AM

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది.  కొత్తగా 24 గంటల వ్యవధిలో 17,89,472 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 41,831 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 3,16,55,824కు చేరింది. మరో 541 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. తాజా మరణాలతో కలిపి ఇప్పటి వరకూ మృతి చెందిన వారి సంఖ్య 4,24,351కి చేరింది. ఇక రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా 24 గంటల్లో 39,258 మంది వ్యాధి బారి నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 3,08,20,521కి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4,10,952 యాక్టివ్ కేసులున్నాయి.

  • మొత్తం కేసులు: 3,16,55,824
  • మొత్తం మరణాలు: 4,24,351
  • కోలుకున్నవారు: 3,08,20,521
  • యాక్టివ్​ కేసులు: 4,10,952

దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. శనివారం ఒక్క రోజే 60,15,842 మందికి వ్యాక్సిన్ అందించారు. దీంతో ఇప్పటి వరకూ పంపిణీ చేసిన డోసుల సంఖ్య 47,02,98,596కి చేరింది. కాగా దేశంలో కరోనా పాజిటివిటీ రేటు 10 శాతానికి పైగా నమోదవుతున్న జిల్లాల్లో కఠిన ఆంక్షలు అమలు చేయాలని రాష్ట్రాలకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సూచించింది. 46 జిల్లాల్లో 10%కి పైగా, 53 జిల్లాల్లో 5-10% మధ్య పాజిటివిటీ రేటు నమోదవుతున్నట్లు వెల్లడించింది. ఈ జిల్లాల్లో నిర్లక్ష్యం వహిస్తే పరిస్థితులు మరింత క్షీణించే ప్రమాదముందని హెచ్చరించింది. ఇదే సమయంలో ఆక్సిజన్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసుకునే విధంగా ప్రైవేటు ఆస్పత్రులను ప్రోత్సహించాలని పేర్కొంది.

Also Read:  రామరాజు- భీమ్‌‌‌ల స్నేహబంధం… పడమాగ్నికి జడివానకు దోస్తీ..

భారీ బడ్జెట్‌‌‌‌తో తెరకెక్కుతోన్న ప్రభాస్ సినిమా.. ఎంతో తెలిస్తే దిమ్మతురుగుద్ది

Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం