కోవిడ్ కేసుల పెరుగుదల.. ఆంధ్రప్రదేశ్ సహా 10 రాష్ట్రాలకు కేంద్రం సీరియస్ వార్నింగ్.. టెస్టింగ్ పెంచాలని సూచన
దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతుండడంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా పది రాష్ట్రాలను తీవ్రంగా హెచ్చరించింది. టెస్టింగ్, వ్యాక్సినేషన్ పెంచాలని సూచించింది.
దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతుండడంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా పది రాష్ట్రాలను తీవ్రంగా హెచ్చరించింది. టెస్టింగ్, వ్యాక్సినేషన్ పెంచాలని సూచించింది. జిల్లాలవారీగా సీరో సర్వేలను నిర్వహించాలని, పాజిటివిటీ రేటు 10 శాతంపైగా ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరింది. శనివారం ఢిల్లీలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ ఆధ్వర్యాన జరిగిన రివ్యూ మీటింగ్ లో ఐసీఎంఆర్ హెడ్ బలరాం భార్గవ, ఇతర సీనియర్ అధికారులు పాల్గొని ముఖ్యంగా ఈ 10 రాష్ట్రాల్లోని పరిస్థితిని సమీక్షించారు. కేరళ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, అస్సాం, మిజోరాం, మేఘాలయ, మణిపూర్ రాష్ట్రాల్లో కేసులు ఇతర రాష్ట్రాల్లోకల్లా అత్యధికంగా ఉన్నాయని ఈ మీటింగ్ లో గుర్తించారు. 45 నుంచి 60 ఏళ్ళ మధ్య వయస్సుగల వారికి టెస్టింగ్, వ్యాక్సినేషన్ యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని, కోవిడ్ మృతుల్లో ఎక్కువ మంది ఈ వయస్సులవారే ఉన్నారని ఈ సమావేశం అభిప్రాయపడింది. థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందన్న విషయాన్ని విస్మరించరాదని బలరాం భార్గవ అన్నారు.
అందువల్ల నిర్లక్ష్యం తగదని ఆయన హెచ్చరించారు. ప్రజా సమూహాలు పెరగకుండా చూసుకోవాలని, ఎప్పటిమాదిరే మాస్కుల ధారణ తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు. 46 జిల్లాల్లో 10 శాతం పైగా.. 53 జిల్లాల్లో 5 నుంచి 10 శాతం వరకు పాజిటివిటీ రేటు నమోదై ఉన్నట్టు సమాచారం అందిందని ఆయన చెప్పారు. ఇళ్లలో ఐసోలేషన్ లో ఉన్నవారిని రెగ్యులర్ గా మానిటర్ చేస్తుండాలని, వీరు ఇతర వ్యక్తులతో కలిసినందువల్ల కూడా కేసులు పెరుగుతున్నాయని ఆయన అన్నారు. ఇతర దేశాలనుంచి ఇండియాలోకి కొత్త వైరస్ వేరియంట్లు ప్రవేశించకుండా ‘ఇనాస్కోగ్’ ల్యాబ్ లను , నెట్ వర్క్ లను రాష్ట్రాలు వినియోగించుకోవాలన్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: హిమాచల్‌ప్రదేశ్‌లో ప్రకృతి బీభత్సం..!! నేషనల్ హైవే..కళ్లముందే ఖతమ్..!!
నెల్లూరులో నడిరోడ్డుపై కుప్పలు తెప్పలుగా చాక్లెట్స్..!! చప్పరిస్తే హం ఫట్టే..!! వీడియో