Raghav Chadha: నాకు ఉచిత కరెంట్ వద్దు.. ఎమ్మెల్యేనే కావాలంటూ ట్వీట్ చేసిన యువతి. ఎమ్మెల్యే ఏమని స్పందించాడంటే.
Raghav Chadha Twitter: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సెలబ్రిటీలకు, సామాన్యులకు మధ్య అంతరం తగ్గిపోయింది. ఒకప్పుడు కేవలం పేపర్లలో, టీవీల్లో చూడడానికే...
Raghav Chadha Twitter: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సెలబ్రిటీలకు, సామాన్యులకు మధ్య అంతరం తగ్గిపోయింది. ఒకప్పుడు కేవలం పేపర్లలో, టీవీల్లో చూడడానికే పరిమితమైన వారు ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా నేరుగా మాట్లాడే అవకాశం లభిస్తోంది. మరీ ముఖ్యంగా రాజకీయ నాయకులు సోషల్ మీడియా ద్వారానే సగం ప్రచారాన్ని చేసేస్తున్నారు. తాము చేస్తోన్న పనులను సోషల్ మీడియా వేదికగానే ప్రజలతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆప్ పార్టీకి చెందిన ఓ నేత ‘ఉచిత కరెంట్ కావాలంటే ఈ సారి ఆప్ పార్టీని గెలిపించాలి’ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు స్పందించిన ఓ యువతి.. ‘నాకు ఉచిత కరెంట్ వద్దు. ఆప్ ఎమ్మెల్యే రాఘవ్ కావాలి’ అంటూ కామెంట్ చేసింది.
I’m not on the manifesto, but free electricity is.
Vote for Kejriwal and I promise you’ll get free electricty, 24×7. Can’t commit the same about myself though 🙂 https://t.co/F0tqLLp1FL
— Raghav Chadha (@raghav_chadha) July 31, 2021
దీంతో ఈ కామెంట్ కాస్త ఎమ్మెల్యే రాఘవ్ దృష్టిలో పడింది. సదరు యువతి చేసిన కామెంట్‌కు స్పందించిన ఎమ్మెల్యే.. ‘మా పార్టీ మేనిఫెస్టోలో తాను లేనని, కేవలం ఉచిత విద్యుత్ మాత్రమే ఉంది’ అని ఫన్నీగా రిప్లై ఇచ్చారు. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే సదరు యువతి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు.. గతంలోనూ ఓసారి ‘రఘు నన్ను పెళ్లి చేసుకుంటారా?’ అంటూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌కు స్పందించి ఎమ్మెల్యే.. ‘రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగా లేని ఇలాంటి సమయంలో వివాహం చేసుకోవడం అంత మంచిది కాదు. మంచి రోజులు వచ్చాక ఈ విషయం గురించి మాట్లాడుకుందాం’ అంటూ చమత్కరించారు.
Sorry Kirti, it’s a bad time to get married considering the state of the economy. Let’s talk again after Acche Din arrive. https://t.co/ddxIhFL9l4
— Raghav Chadha (@raghav_chadha) August 23, 2019
Ram Gopal Varma: ‘హ్యాపీ ఎనిమీస్ డే ‘అంటూ రచలేపిన ఆర్జీవీ.. వైరల్ అవుతున్న వర్మ ట్వీట్..
French Fries: ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ధర అక్షరాల లక్షన్నర రూపాయాలు.. ఏంటీ బంగారంతో చేశారనేగా మీ డౌట్.